Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
నిమ్మ, వెల్లుల్లి మిశ్రమంతో.. గుండె సంబంధిత సమస్యలు దూరం..!
నిమ్మ, వెల్లుల్లి రెండూ చాలా కామన్ గా వంటింట్లో ఉపయోగించే పదార్థాలే. ఈ రెండు న్యాచురల్ పదార్థాలను ఉపయోగించి.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. బ్లాక్ అయిన ధమనులను క్లియర్ చేయవచ్చు.
నిమ్మ, వెల్లుల్లి రెండూ చాలా కామన్ గా వంటింట్లో ఉపయోగించే పదార్థాలే. ఈ రెండు న్యాచురల్ పదార్థాలను ఉపయోగించి.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. బ్లాక్ అయిన ధమనులను క్లియర్ చేసి.. బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగేలా జాగ్రత్త పడవచ్చు.

హార్ట్ బ్లాకేజ్ లను ఎలా క్లియర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ రెండూ నిమ్మ, వెల్లుల్లి ఎలా సహాయపడతాయనేది చాలామందిలో వచ్చే అనుమానం. హై లెవెల్స్ కొలెస్ట్రాల్ ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయిందని సూచిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ లేదా ఇతర గుండె సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
ఇలాంటి సమస్య నివారించడానికి అనేక మెడిసిన్స్, రెమిడీస్ ఉన్నాయి. గుండె సంబంధిత సమస్యలు నివారించడానికి హోం రెమెడీస్ ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తాయి. వెల్లుల్లి, నిమ్మ ద్వారా పర్ఫెక్ట్ సొల్యూషన్ పొందవచ్చు. ఈ రెమెడీని రెండు విధాలుగా పొందవచ్చు.

సొల్యూషన్ 1
1 కప్పు వెల్లుల్లి జ్యూస్
1 కప్పు నిమ్మ రసం
1 కప్పు యాపిల్ సైడర్ వెనిగర్
1 కప్పు అల్లం రసం
3 కప్పుల తేనె
తయారు చేసే విధానం
అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి.. 30 నిమిషాలపాటు వేడి చేయాలి. చల్లారిన తర్వాత తేనె కలపాలి. తేనె అందులో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని టైట్ గా ఉండే ఒక గ్లాస్ జార్ లో వేసి.. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ కి ముందు ఒక స్పూన్ తీసుకోవాలి.

సొల్యూషన్ 2
6 నిమ్మకాయలు
30 వెల్లుల్లి రెబ్బలు
తేనె
తయారు చేసే విధానం
నిమ్మకాయలు, వెల్లుల్లి రెండింటికీ పొట్టు తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్లెండర్ వేసి నీళ్లు కలపి మెత్తగా చేసుకోవాలి. తర్వాత 2 లీటర్ల నీటిని కలిపి ఉడికించాలి. తర్వాత మరో 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు జార్ లో నింపి.. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి.. మరో మూడు వారాలు తీసుకోవాలి. రోజుకి 30 ఎమ్ఎల్ తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
