Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే నేచురల్ హోం రెమెడీస్...
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి.
మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు, మూత్రా శయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్‌ఫెక్షన్ కారణంగా వస్తాయి. మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్ ఫెక్షన్ సోకడం, చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కార ణాల వలన వీటికి ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి.
కిడ్నీ ఇన్ఫెక్షన్ నేచురల్ గా ఎలా నివారించాలి? కిడ్నీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది వాటిని గమనించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు...

ఆపిల్ సైడర్ వెనిగర్ :
తేనె మరియు యాపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిని విడివిడిగా ఉపయోగించడం కంటే రెండు కలిపి ఉపయోగించడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి.

వెల్లుల్లి:
కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే మరో ఉత్తమ హోం రెమెడీ . ఇది ఒక ఘాటైన వాసన కలిగిన నేచురల్ రెమడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫమేటరీ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను అతి కొద్దిరోజుల్లోనే నివారిస్తుంది .

పసుపు:
కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక ప్రొటెక్టివ్ హోం రెమెడీ. ఇది రికవరీ ప్రొసెస్ ను వేగవంతంగా చేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే కంటెంట్ లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ఏజెంట్ కిడ్నీకి హానికలిగించే మైక్రోబ్స్ పెరగకుండా మరియు కిడ్నీ మొత్తం వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది.

అల్లం:
అల్లం బాగా ప్రసిద్ది చెందిన హోం రెమెడీ. ఎందుకంటే దీనిలో వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కు ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ . అల్లంలో ఉండే జింజరోల్ అనే యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ కిడ్నీలో వ్యాప్తి చెందే బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. కాబట్టి, మీరు అల్లం టీని రెగ్యులర్ గా ఉపయోగించండి.

క్రాన్ బెర్రీ జ్యూస్:
కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో క్రాన్ బెర్రీ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. క్రాన్ బెర్రీ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ఒక ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. కాబట్టి, స్వచ్చమైన జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హేర్బల్ టీ:
మీ శరీరానికి హేర్బల్ టీ ఏదైనా సరే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చమోమిలీ, మార్షమల్లో టీ, పార్ల్సే టీ లేదా గోల్డెన్ రోడ్ టీ వంటి హేర్బల్ టీలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇలాంటి టీలలో ఏదో ఒకటి రోజుకు రెండు సార్లు త్రాగాలి.

స్వచ్చమైన ఆలివ్ నూనె:
స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ను చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. ఇది ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్. ఇది మంచి ఫ్లేవర్ మరియు ఎసిడిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ లూబ్రికేట్స్ కు సహాయపడుతుంది మరియు కిడ్నీ, లివర్ మరియు గాల్ బ్లాడర్ లోని టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది.నిమ్మరసంతో పాటు తీసుకుంటే చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు లెమన్ వాటర్ లో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.

నీళ్ళు త్రాగడం పెంచాలి :
మన శరీరంను నిరంతరం తేమగా ఉంచుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది మరియు కిడ్నీలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కుసార్లు యూరిన్ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినిరల్స్ మరియు సోడియం ఫ్లష్ చేస్తుంది.

ప్రొబయోటిక్స్ :
పెరుగులో మంచి బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఈ మైక్రో ఆర్గానిజం మొత్తం ఆరోగ్యంను మరియు డైజెస్టివ్ హెల్త్ ను మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొనబడినది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కిడ్నీ నుండి వేస్ట్ మెటీరియల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది.

యాంటీ బయోటిక్స్ :
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది కిడ్నీలో టాక్సిన్స్ ను పెంచుతుంది . పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్అయ్యే అవకాశం ఎక్కువ. ఇవి చాలా నిధానంగా కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి.



Click it and Unblock the Notifications











