Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
అలసిన మరియు దురద కలిగించే కళ్ళకు హోం రెమెడీస్
మీ కళ్లు అలసిపోతున్నాయా ? తరచుగా ఎర్రగా మారుతున్నాయా ? మీ కళ్లు దురదగా ఉంటున్నాయా ? అలాంటప్పుడు వెంటనే కళ్లకు రిలీఫ్ ఇవ్వాలనిపిస్తుంది కాదూ. ఇలా అలసటకు గురై.. ఒత్తడికి లోనవుతున్న కళ్లకు ఉపశమనం కలిగించడానికి సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
నయనం ప్రధానం అన్నారు. ఎన్నెన్నో అందాలను.. ఆకర్షణీయమైన ప్రపంచాన్ని చూడాలంటే కంటి ఆరోగ్యం బాగుండాలి. అవి ప్రమాదానికి గురైతే.. మూడ్ తోపాటు పనికి కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్న అమేజింగ్ టెక్నిక్స్ ఫాలో అయి చూడండి.. మీ కళ్లు ఎంత బాగా సేదతీరుతాయో.
కళ్ల కింద క్యారీ బ్యాగులు మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ?
పని ఒత్తిడి, దూరప్రయాణాలు, బైక్ ల మీద జర్నీలు, కంప్యూటర్ల మీద గంటల తరబడి పనిచేయడం, స్మార్ట్ ఫోన్లలతో ఎక్కువ సేపు గడపటం.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్లు అలసటకు లోనవుతుంటాయి. కారణమేదైనా.. సున్నితమైన కళ్లపై శ్రమ మాత్రం పెరుగుతోంది. కాబట్టి అలసిపోతున్న కళ్లకు సాంత్వన ఇవ్వడానికి చక్కటి హోం రెమిడీస్ మీ కోసం...

కీరదోస:
కీరదోస నేచురల్ కూలింగ్ ఏజెంట్, ఇందులోని యాంటీఇరిటేషన్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే లక్షణాలు, కళ్ళ ఉబ్బును., కళ్ళు ఎరుపుదనాన్ని , మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కీరదోసకాయను తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి, చక్రాల్లా కట్ చేసి ఫ్రిజ్ లో 10 నుండి 15నిముషాలు పెట్టి, తర్వాత బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా రోజుల 5సార్లు చేయండి. మంచి ఫలితం ఉంటుంది.కళ్ళ మీద రెండు చక్రాలాంటి కీరదోశకాయ ముక్కలను రెండు కళ్ళమీద పెట్టి పది పదిహేను నిముషాల పాటు కళ్ళు మూసుకొని విశ్రాంతి పొందడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మాన్ని కీరదోస చల్లబరిచి, ముడుతలను పోగొడుతుంది.

ఆముదము:
ఒక స్వచ్ఛమైన ఐ డ్రాపర్ తీసుకోని దానిలోకి ఆముదమును తీసుకోని ప్రతి కంటిలో ఒక చుక్క వేయాలి. ఎక్కువగా కంటి బర్నింగ్ ఉంటే రోజులో మూడుసార్లు లేదా నాలుగు సార్లు వేయవచ్చు. ఇది మీ అలసట,బర్నింగ్ కళ్ళ ఉపశమనం మరియు వాపును తగ్గిస్తుంది.

బేకింగ్ సోడ:
బేకింగ్ సోడాను కళ్ళ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు . ఇది కళ్ళలో మురికిని మరియు క్రిములను తొలగిస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాను వాటర్లో వేసి మిక్స్ చేసి ఈ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి . ఇది దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెనిగర్:
ఆపిల్ సైడర్ వినెగర్ కళ్ళ గాయాల కొరకు ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది మీ వంటగది లో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటిగా ఉంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ స్వచ్ఛమైన ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.ఒక కాటన్ బంతి తీసుకోని ఆపిల్ సైడర్ వినెగర్ లో ముంచి మీ కళ్ళ పైన పెడితే ఉపశమనం కలుగుతుంది.

కోల్డ్ మిల్క్:
చల్లని పాలను ఉపయోగించి మీకళ్ళ చికిత్స చేసుకోవచ్చు. పత్తి ఉండలను చల్లని పాలలో డిప్ చేసి , ఇన్ఫెక్షన్ గురియైన ప్రదేశంల రుద్దాలి. తర్వతా అదే కాటన్ బాల్స్ ను కళ్ళ మీద కొంత సమయం పెట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి .

పచ్చిబంగాళదుంప:
కళ్ళ దురదను పచ్చిబంగాళదుంపతో నివారించుకోవచ్చు. కీరదోసకాయలాగే , బంగాళదుంపను కూడ్ కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టి, తర్వాత కళ్ళ మీద పెట్టుకొంటే, తక్షణ ఉపశమనం, విశ్రాంతి పొందవచ్చు.



Click it and Unblock the Notifications