Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అధికంగా టీ సేవించటం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్
భారతదేశ జనాభాలో 90 శాతం ప్రతి ఉదయం అల్పాహారం ముందు టీ సేవిస్తుంటారు. మీరు ఈ అలవాటును ఆరోగ్యకరమైనదని అనుకుంటున్నారా! ఇటీవల అధ్యయనాలు ఖాళీ కడుపుతో టీ త్రాగటం అనారోగ్యకరమని ప్రత్యేకించి వేసవిలో ఈ పద్ధతిని అనుసరించడం మంచిది కాదని చెపుతున్నాయి.
టీలో కొద్ది మొత్తంలో కెఫిన్, ఎల్-థెయానిన్, థియోఫిలినిన్ ఉండటం వలన, దీనిని ఉదయాన్నే త్రాగటం వలన మీలో ఒక ఉత్తజకరమైన శక్తి వచ్చినట్లుగా అనుభూతి వస్తుంది. అవును, సూర్యోదయమైన వెంటనే టీ త్రాగాలి అన్న అనుభూతి కలుగవచ్చు, కాని ఏదైనా ఆహారం తీసుకున్న తరువాతనే! టీ ఎక్కువగా తాగడం వలన కడుపు లోపల లైనింగ్ దెబ్బతింటుంది.
దానితో ఆరోగ్యం పాడవుతుంది. పాలు, టీ డికాషన్ కలుకుని తాగితే కొంతవరకు ఫర్వాలేదు. కేవలం డికాషన్ ఒక్కటే త్రాగటం అన్నది అత్యంత హానికరం. టీలో చక్కర కూడా ఉండటం వలన మీరు వేసే ప్రతి గుటక మీ బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం ఎందుకు మంచిది కాదు అని తెలుసుకోవటానికి ఇక్కడ మరికొన్ని కారణాలు ఇస్తున్నాము. పరిశీలించండి.

టీ తాగటం మిమ్మలిని చిరాకు కలిగిస్తున్నదా?
దీనికి కారణం టీలో అధిక శాతంలో ఆల్కలీన్ / ఆమ్లం ఉంటాయి,.ఖాళీ కడుపుతో టీ తాగటంవలన కడుపులోని రసాలను చాలా అప్సెట్ చేస్తాయి. అందువలన మీరు చాలా అసౌకర్యంగా, చిరాకైన అనుభూతిని పొందుతారు.

బ్లాక్ టీ సురక్షితమైనదా?
బ్లాక్ టీ పాలు కలుపకుండా తయారయ్యేది. ఇది త్రాగటం ఆరోగ్యకరం అని మరియు అధికబరువు కోల్పోవటానికి మంచిదని భావింపబడుతుంది, కాని బ్లాక్ టీ ఎక్కువగా తీసుకున్నందువలన పొట్టలో ఉబ్బరంగా ఉండటం మరియు ఆకలి వేయకుండా కడుపు భార్తీగా ఉన్నట్లు అనుభూతి కలిగిస్తుంది..

మిల్క్ టీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి?
మిల్క్ టీ మనలో చాలామందికి చాలా ప్రియం. అంచనాల ప్రకారం, ఖాళీ కడుపుతో ఈ మిల్క్ టీ ఎక్కువగా తాగడం వలన చాలా అలసట కలుగుతున్నట్లుగా ఒక భావన కలుగుతుంది. మరోవైపు, ఈ పానీయం అధికంగా తీసుకునేవారిలో టిన్నిటస్(చెవిలో హోరు)కు దారితీస్తుంది.

తేనీరు స్ట్రాంగ్ గా తీసుకున్నందువలన మీ మీద ప్రభావం చూపుతుందా?
ఖాళీ కడుపుతో స్ట్రాంగ్ టీ త్రాగితే, పాలు కలిపిన టీ తాగినదానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఆరోగ్యానికి హానికరం. స్ట్రాంగ్ టీలో ఉన్న ఆమ్లాలు కారణంగా స్టమక్ లైనింగ్ మీద ప్రభావం ఏర్పడి, కడుపులో అల్సర్లు ఏర్పడవచ్చు.

కలిపిన టీ తాగినందువలన ఏమి జరుగుతుంది?
ఉదయాన్నె ఒక బ్రాండ్ టీకి రెండు లేదా మరిన్ని టీ రుచులను మిక్సింగ్ చేసి త్రాగినందువలన మీకు ఉత్తేజ భావన కలుగుతుంది. ఈ మిశ్రమ టీ కలయికను సేవించటం వలన మీకు మద్యపానం సేవించిన అనుభూతి కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు

చెత్త టీ అలవాటు అంటే ఏమిటి?
టీలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది, ప్రత్యేకంగా స్ట్రాంగ్ టీలో టానిన్ అధిక స్థాయిలో ఉంటుంది మరియు మీ ఆహారం లో ఇనుముపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టీ త్రాగటం నివారించండి.



Click it and Unblock the Notifications