Latest Updates
-
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.!
రక్త ప్రసరణ సమస్యను నిమిషాల్లో నయం చేసే సింపుల్ టిప్స్
వ్యాయామం చేయకపోవడం, వాకింగ్, జాగింగ్ లాంటి యాక్టివిటీస్ కి దూరంగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైనది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడమనేది ఒకటి. డైట్ కూడా.. సరిగా ఫాలో అవకపోతే.. బ్లడ్ సర్క్యులేషన్ సమస్య చాలా తీవ్రంగా మారుతుంది.
బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగకపోతే.. శరీరంలోని అనేక టిష్యూలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని అనేక అవయవాలు వాటి పనితీరులో అడ్డంకులు ఫేస్ చేస్తాయి. కాబట్టి.. బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే.. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

స్ట్రెచ్
ప్రతిరోజూ.. నిద్రలేవగానే.. కొన్ని నిమిషాలు.. శరీరాన్ని స్ట్రెచ్ చేయడానికి కేటాయించండి. ఇలా చేయడం వల్ల.. కండరాలు ఉత్సాహంగా మారి, బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

వ్యాయామం
వ్యాయామం అంటే ఏదో కష్టపడాలని భయపడకండి. సింపుల్ చిట్కా ఇది. ఫస్ నిలబడాలి. ఒక పాదంపై మరొక పాదాన్ని నిలబెట్టాలి. అయితే రెండు కాళ్ల మడిమలు పైకి లేపాలి. ఇలా ఈ పొజిషన్ లో 10 సెకన్లు ఉండాలి. ఇది చేసేటప్పుడు మోకాళ్లు టైట్ గా ఉంచాలి. ఇలా 8 నుంచి 10 సార్లు చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఫీట్ రొటేషన్
కూర్చోవాలి. పాదాన్ని.. అటు ఇటు కదుపుతూ ఎక్సర్ సైజ్ చేయాలి. ఇలా 10 సార్లు.. చేస్తూ ఉంటే.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

పుష్ అప్స్
ప్రతి రోజూ ఉదయాన్నే పుషప్స్ చేస్తూ ఉంటే.. మీరు యాక్టివ్ గా ఉండటమే కాదు.. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా జరుగుతుంది. ప్రతి రోజూ 10 పుష్ అప్స్ చేస్తే ఫలితం ఉంటుంది.

నడక
రెగ్యులర్ గా వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా.. చాలా మెరుగ్గా సాగుతూ.. కండరాలకు రిలాక్సేషన్ ని అందిస్తుంది.

స్విమ్మింగ్
స్విమ్మింగ్ అనేది ఎముకలు, కండరాలు, కీళ్లతో అనుసంధానమై ఉంటుంది. రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేయడం వల్.. గుండెకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది.

యోగా
బ్లడ్ సర్క్యులేషన్ ని కండరాలన్నింటినీ అందించడంలో.. యోగా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ బాడీ బ్రీత్ ని పెంచుతాయి. అలాగే ఆక్సిజన్ గ్రహించే శక్తిని మెరుగుపరుస్తాయి.

డ్యాన్సింగ్
డ్యాన్సర్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు శరీరాన్ని అలా కదుపుతూ ఉంటే.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే..క్యాలరీలు చాలా వేగంగా, ఎక్కువగా కరగడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
