Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
సరైన నిద్రకై సుప్త బద్ద కోనాసన (రిక్లైనింగ్ బౌండ్ యాంగిల్ పోస్)
సుప్త బద్ద కోనాసనం రిలాక్సింగ్ పోస్ గా కూడా ప్రసిద్ది. ఈ ఆసనం పేరు కూడా సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది.
మీరు ఒక్క సారి 'సుప్త బద్ద కోనాసనం' అనే పదాన్ని గమనిస్తే, ఈ పదం మూడు పదాల కదలిక అని అర్ధమవుతుంది. 'సుప్త' అంటే నిద్రావస్థ, 'బద్ద' అంటే నిబద్ధమైన మరియు 'కోన' అంటే భంగిమ.
మానవ శరీరం యంత్రం కాదు. తమ శరీరాన్ని కొందరు యంత్రంగా భావించినా కూడా శరీరం కాస్త సేద తీరాలని కోరుకుంటుంది.
మీరెంత తీరిక లేకుండా ఉన్నా కూడా కనీసం ఒక్కసారైనా ప్రశాంతమైన ప్రదేశానికి విశ్రాంతి సెలవులకు వెళ్ళాలి. యోగాపై మీకు మక్కువ ఉన్నట్టైతే, అటువంటి ప్రశాంతమైన ప్రదేశంలో, మీరు ఈ ఆసనాన్ని కచ్చితంగా ప్రారంభించాల్సిందే.

అద్భుతమైన సెలవులతో పాటు చక్కటి విశ్రాంతి దొరకడంతో నిజంగా ఓ గొప్ప వరం పొందిన భావన కలుగుతుంది. ఈ ఆసనం, మీ లోపలి తొడలను సాగదీయడంతో పాటు మీ తుంటి భాగాన్నితెరుస్తుంది. అలాగే ఛాతిని కూడా తెరవబడుతూ మీ కాలర్ బోన్స్ ని విస్తృతపరుస్తుంది.
ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా మీరు ఎంతో చక్కటి విశ్రాంతిని పొందినవారావుతారు. ఎటువంటి ఆలోచనలు లేని మనస్సుతో ఈ ఆసనాన్ని సాధన చేయండి.
ఈ ఆసనాన్ని సాధన చేసే దశల సూచనలు
స్టెప్ 1: శ్వాసను వదులుతూ మీ చేతులపై ఆనుతూ ఈ ఆసనాన్ని ప్రారంభించండి. మీ వెనుకవైపు నడుము కింది భాగాన్ని నేలపై అన్చండి. మీ నడుము కింది ప్రదేశంపై అలాగే టైలర్ బోన్ ద్వారా తుంటి పైభాగంపై ఆనుతూ మీ చేతుల సహాయంతో మీ పెల్విస్ ను విస్తరించడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో మీరు సౌకర్యవంతంగా ఉండేందుకు మీ తలకు అలాగే మెడకు అవసరమైన సపోర్ట్ ను అందివ్వాలి.

స్టెప్ 2: ఇప్పుడు, మీ లోపలి తొడలకు తగినంత పట్టును ఇస్తూనే మీ లోపలి తొడలను వెలుపలి వైపుకు తిప్పడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో మీ వెలుపలి తొడలు మీ పక్క నడుమును ఇరువైపులా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ తుంటి భాగం నుంచి ఎడంగా మీ మోకాళ్లను విస్తరించాలి. ఇప్పుడు, మీ చేతులను మీ లోపలి తొడల భాగం నుంచి గజ్జల వరకూ సున్నితంగా తీసుకురావాలి. ఈ క్రమంలో మీ గజ్జలు పెల్విస్ లో దిగబడిపోయినట్టు ఊహించుకోవాలి. మీ తుంటి భాగాన్ని మీరు ఏ విధంగా విస్తరించాలంటే, తద్వారా మీ వెనుకవైపు పెల్విస్ విస్తరించబడడంతో పాటు మీ ముందు వైపు పెల్విస్ కుదించినట్టు అవ్వాలి. మీ చేతుల నుంచి నేలవరకు 45 డిగ్రీల కోణంలో మీరొక భంగిమలో ఉండాలి. ఈ క్రమంలో మీ అరిచేతులు పైవైపుకి చూడాలి.
స్టెప్ 3: సాధారణంగా ఈ ఆసనంలో మీ మోకాళ్లను ఇవతలివైపుకు తేవడం ద్వారా ఎక్కువ ప్రాధాన్యత లోపలి తొడలను అలాగే గజ్జలను సాగదీయడంపై ఉంటుంది. అయితే మీరొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీ గజ్జలు చాలా ధృడంగా ఉంటే మీ పై ఈ ఆసనం వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలు కలవు. ఎందుకంటే, ఈ ఆసనం వల్ల మీ వెనుకవైపు కింది నడుము భాగం అలాగే మీ పొట్టతో పాటు మీ గజ్జలు మరింత ధృడంగా మారిపోతాయి. ఇప్పుడు, మీ మోకాళ్ళు గాలిలో పైపైన తేలియాడుతున్నట్టు ఊహించుకోండి. అదే సమయంలో, మీ గజ్జలు మీ పెల్విస్ లోకి దిగుబడిపోతున్నట్టు ఊహించుకోండి. మీ గజ్జలు నేలని తాకినప్పుడే మీ మోకాళ్ళు కూడా నేలను తాకుతాయన్న మాట.

స్టెప్ 4: ఈ భంగిమలో మీరు కనీసం 60 సెకండ్ల పాటు ఉండగలగాలి. లేదా కనీసం మీరు సౌకర్యవంతంగా ఉండగలిగినంత సేపు ఉండగలగాలి. రాను రాను, మీరు ఈ భంగిమలో కనీసం పది నిమిషాల పాటు ఉండడానికి ప్రయత్నించండి. మళ్ళీ సాధారణ భంగిమకు చేరుకోవడానికి మీరు మీ తొడలను దగ్గరకు తీసుకువచ్చి, ఒకవైపుకు తిరిగి మెల్లగా లేవడానికి ప్రయత్నించాలి.
ఈ ఆసనాన్ని మీరు సాధన చేయడం ప్రారంభించగానే, మిమ్మల్ని ఇంతకాలం ఒత్తిడికి గురిచేస్తున్న సమస్యల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతున్న భావన మీకు లభిస్తుంది. అలాగే, ఈ ఆసనం వల్ల కలిగే ప్రశాంతంత మీకు చక్కటి నిద్రను కలిగిస్తూ మీరు ఎల్లప్పుడూ తాజాగా, ఉల్లాసంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఈ ఆసనాన్ని సాధన చేయడం వలన కలిగే లాభాలు
జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
లోపలి తొడలను సాగదీయడంలో తోడ్పడుతుంది
దిగువ ఉదరానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది
నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది తద్వారా ఒత్తిడి మరియు ఆందోళనల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది
హెచ్చరిక
ఈ ఆసనాన్ని మీరు సాధన చేసే ప్రారంభ దశలో మీ తొడలకు, ప్రత్యేకించి వెలుపలి తొడలకు సపోర్టివ్ గా దుప్పటిని వాడుకోవాలి. అలాగే, మోకాళ్ళ గాయంతో పాటు నడుము కింది భాగంలో నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళు ఈ ఆసనానికి దూరంగా ఉంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications