Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
ఉన్నట్టుండి అలసిపోయే వాళ్లకు తక్షణ శక్తినిచ్చే జ్యూస్
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు కూడా రెస్ట్ తీసుకునే తీరిక ఉండటం లేదు. మన అలవాట్లు, అన్ హెల్తీ ఆహారపు అలవాట్లు మనల్ని మరింత బలహీనం చేస్తాయి. సమయానికి మన పని పూర్తి చేయడం, అవసరాలు తీర్చుకోవడం వల్ల శరీరం వీక్ అవుతుంది. వీక్ నెస్ గా ఫీలవుతారు.
చాలామంది స్టామినా కోసం.. ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ అది శరీరానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి హానికారక మందులు వాడటం కంటే.. ఇంట్లోనే పవర్ బూస్టర్స్ ఉపయోగించడం చాలా మంచిది. వాటివల్ల తక్షణ శక్తి అందుతుంది. పూర్వకాలం నుంచి.. మనవాళ్లు న్యాచురల్ పదార్థాలతోనే ఎలాంటి అనారోగ్య సమస్య నుంచైనా బయటపడేవాళ్లు.
మనందరికీ తెలుసు మందులు వాడటం కంటే.. సహజసిద్ధమైన ఆహారాలు, పదార్థాలతోనే ఎఫెక్టివ్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ నయం చేసుకోవచ్చని. కానీ.. మందులపై ఆధారపడి.. అనవసరంగా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. కాబట్టి.. ఇవాళ అలసిపోయి, స్టామినా కోల్పోతున్నవాళ్లు.. తక్షణ శక్తిని పొందే.. హోం మేడ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. దీన్ని తాగితే.. మీరు వెంటనే ఎనర్జీ పొందుతారు.

కావాల్సిన పదార్థాలు
1 లేదా 2 బీట్ రూట్స్
1 యాపిల్
1 ముక్క అల్లం

బీట్ రూట్
బీట్ రూట్ లో ఇన్ ఆర్గానిక్ నైట్రేట్ ఉంటుంది. ఇది ఎక్స్ ట్రా ఎనర్జీ ఇవ్వడానికి తోడ్పడుతుంది. అధ్యయనాల ప్రకారం బీట్ రూట్ జ్యూస్ తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది.

యాపిల్
యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాయామానికి ముందు ఒక యాపిల్ తీసుకుంటే.. ఎనర్జీ పెరుగుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి.

అల్లం
అల్లంకు పోషకాలను గ్రహించే శక్తి ఉంటుంది. నీరసాన్ని తగ్గించి.. శక్తిని అందించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తయారు చేసే విధానం
బీట్ రూట్, యాపిల్, అల్లం కట్ చేసి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టి.. మీకు కావాలంటే.. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని తీసుకోవచ్చు.

తీసుకునే విధానం
ఈ జ్యూస్ ని వారానికి 3 నుంచి 4 సార్లు తీసుకోవడం వల్ల మీకు న్యాచురల్ గా స్టామినా అందుతుంది.

చిట్కా
అయితే ముందుగా కొంచెం మోతాదులో తీసుకుని ట్రై చేయండి. మీ శరీర తత్వానికి ఈ జ్యూస్ సరిపోతుందో లేదో చెక్ చేసుకుని.. ఎలాంటి సమస్య లేదంటే.. రెగ్యులర్ గా తాగుతూ ఉండండి. మీలో శక్తి పెరిగిపోతుంది.

రెగ్యులర్
చాలా మంది రెగ్యులర్ గా ఈ జ్యూస్ ని తాగుతారు. వ్యాయామం చేసేవాళ్లు ఈ జ్యూస్ ని రెగ్యులర్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
