Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
రాత్రిళ్లు నిద్రలో ఇబ్బందిపెట్టే కాళ్ల తిమ్మిర్లకు కారణాలేంటి ?
రాత్రిపూట మంచి నిద్రలో ఉండగా.. కాళ్లు తిమ్మిర్లు పట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయా ? ఒకవేళ నిజమే అయితే.. రాత్రిపూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు పట్టడానికి కారణాలేంటో తెలుసుకోవాలి. పాదాల్లో పట్టేసినట్టు నిద్రకు భంగం కలిగించే ఈ సమస్యను లెగ్ క్రాంప్స్ లేదా కాళ్ల తిమ్మిర్లు అని పిలుస్తారు. ఇది.. చాలా సాధారణంగా ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. కాబట్టి.. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఇది కొన్ని నిమిషాలకు తగ్గుతుంది. అయితే ఆ సమయంలో దాన్ని ఫేస్ చేయడం మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి నొప్పితో కూడిన సమస్య.. మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది.. అంత హానికరమైనదని అనిపించదు. అయితే.. ఇది అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
చాలా తరచుగా.. ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించి.. అనారోగ్య సమస్యను గుర్తించడం మంచిది. అయితే.. ఈ లెగ్ క్రాంప్స్ కి కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. రాత్రిపూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు పట్టడానికి కారణాలేంటో తెలుసుకోండి..

డీహైడ్రేషన్
రాత్రిపూట కాళ్లు తిమ్మిర్లు పట్టడానికి డీహైడ్రేషన్ చాలా సాధారణ కారణం. శరీరంలో ఫ్లూయిడ్స్ తక్కువైనప్పుడు.. కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల.. మధ్య రాత్రిలో కాళ్లు తిమ్మిర్లు వస్తాయి.

హైపోథైరాయిడిజం
హైపోథైరాయిడిజంతో బాధపడేవాళ్లు.. తరచుగా రాత్రిపూట నిద్రలో.. కాళ్ల తిమ్మిర్ల సమస్యను ఎదుర్కొంటారు. అలసట, బలహీనత వంటి సమస్యలు.. కండరాల తిమ్మిర్లకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

హై బ్లడ్ షుగర్ లెవెల్
రాత్రిపూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు పట్టడానికి హైబ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఒక కారణం. షుగర్ సమస్యతో బాధపడేవాళ్లు.. ఈ సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి.. లెగ్ క్రాంప్స్ సమస్యతో తరచుగా బాధపడుతుంటే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం మంచిది.

సైడ్ ఎఫెక్ట్స్
రాత్రిపూట కాళ్ల తిమ్మిర్లకు వాడుతున్న మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం కావచ్చు. ఒకవేళ మీరు మందులు వాడుతున్నారు, అలాగే కాళ్ల తిమ్మిర్ల సమస్య ఎదుర్కొంటున్నారు అంటే.. డాక్టర్ ని సంప్రదించాలి.

అలసట
చాలా అలసిపోయినప్పుడు కండరాల అలసట కాళ్ల తిమ్మిర్లకు కారణమవుతుంది. మోతాదుకి మించి వ్యాయామం చేయడం వల్ల కూడా రాత్రిళ్లు లెగ్ క్రాంప్స్ కి కారణం కావచ్చు.

కండరాల అలసట
బలహీనత లేదా అలసట కండరాల్లో కనిపించినప్పుడు.. రాత్రిళ్లు కాళ్లలో తిమ్మిర్ల సమస్య మొదలవుతుంది. కండరాల బలహీనత అనేది అంత సీరియస్ విషయం కాకపోయినా.. తరచుగా వస్తుంటే మాత్రం.. తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతం అవుతుంది.

పోషకాహార లోపం
పొటాషియం, సోడియం వంటి ముఖ్యమైన మినరల్స్ లోపం వల్ల ... రాత్రిళ్లు కాళ్లు తిమ్మిర్లు పడతాయి. ఏదైనా ముఖ్యమైన పోషకం శరీరంలో తగ్గిపోయినప్పుడు.. కండరాల కణాలపై ఒత్తిడి పెరిగి.. ఈ సమస్యకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications
