Latest Updates
-
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.!
ఎర్లీ మార్నింగ్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల పొందే గ్రేట్ బెనిఫిట్స్ ...
రిఫైండ్ చేయని ఉప్పులో మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో కొన్ని ప్రత్యేకమైన హీలింగ్ ప్రొపర్టీస్ ఉంటాయి . ఇక్కడ మనం ప్రతి రోజూ వినియోగిస్తున్న ఉప్పు అలాంటిది కాదు. మనం ఉపయోగిస్తున్న సాల్ట్ ప్రొసెస్ చేయబడినది. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. నేచురల్ గా అన్ రిఫైండ్ సాల్ట్ ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
ముఖ్యంగా ఇలాంటి సాల్ట్ లో దాదాపు 80 ట్రేస్ మినిరిల్స్ కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు అంఛనా వేస్తున్నారు . అందుకే మన శరీరం యొక్క మెటబాలిజం, బోన్, ఇమ్యూన్ సిస్టమ్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
ఉప్పును తక్కువగా అంచనా వేయకండి, తక్కువైనా ప్రమాదమే...
మరి ఉప్పు స్వచ్చమైనదో లెదో తెలుసుకోవడానికి ఒక జగ్ నీటిలో మూడు చెంచాల అన్ రిఫైండ్ సాల్ట్ వేయాలి. నీరు మగ్ నిండుగా పోసి లిడ్ తో క్లోజ్ చేయాలి. రోజంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఒక కప్పు గోరువెచ్చనీ నీటిని తీసుకొని అందులో ముందురోజు ఉంచిన సాల్ట్ వాటర్ ను కలపాలి. ఈ వాటర్ ను త్రాగాలి. కొన్ని దశాద్దాల కాలం నుంచి నేచురల్ సాల్ట్ ను వంటకాల్లో ఉపయోగిస్తున్నారు.
హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి...
ఈ సాల్ట్ సొల్యూషన్ ట్రై చేయడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి . మరి ప్రతి రోజూ ఉదయం సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....

జీర్ణక్రియను మెరుగుపడుతుంది:
నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగిన తర్వాత లాలాజల గ్రంథులు అభివ్రుద్ది చెందుతాయి మరియు స్టొమక్ యాసిడ్స్ క్రమంగా స్రవిస్తాయి. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

డిటాక్సిఫై అవుతుంది:
సాల్ట్ వాటర్లో ఉండే వివిధ రకాల మినిరల్స్ బాడీ డిటాక్సిఫికేషన్ కు సహాయపడుతుంది . మరియు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ జీవక్రియల్లో(ప్రేగుల్లో) బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది:
నేచురల్ సాల్ట్ లో ఉండే మినిరల్స్ స్కిన్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. సల్ఫర్, జింక్, ఐయోడిన్, మరియు క్రోమియం వంటి మినిరల్స్ కొన్ని రకాల చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
శరీరంలో సోడియం తగ్గినప్పుడు రెనిన్ అనే ఎంజైమ్ మరియు ఆల్డోస్టిరోన్ (హార్మోన్)ఇన్ఫ్లమేషన్ కు కారణం అయ్యే వీటిని పెంచుతుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ కు గురికావల్సి వస్తుంది . అందువల్ల కొద్దిగా నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

బోన్స్:
సాల్ట్ వాటర్ ఇండైరెక్ట్ గా బోన్ హెల్త్ కు సహాయపడుతుంది . మీ రక్తంలో బ్లడ్ అసిడిక్ గా మారినప్పుడు శరీరం ఎముకల్లోని క్యాల్షియంను ఉపయోగించుకుంటుంది. అలాంటి పరిస్థితిలో సాల్ట్ వాటర్ తీసుకొన్నప్పుడు శరీరంను నేచురల్ గా ఆల్కలైస్ చేస్తుంది, దాంతో బోన్స్ సురక్షితంగా ఉంటాయి.

నిద్ర :
నేచురల్ సాల్ట్ లోని కొన్ని రకాల మినిరల్స్ నాడీవ్యవస్థను రిలాక్స్ చేయడానికి మరియు స్ట్రెస్ హార్మోనులను తగ్గించడానికి సహాయపడుతుంది . దాంతో మీరు పీస్ ఫుల్ గా నిద్రపోవచ్చు.

శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది:
నేచురల్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల శరీరం వాటర్ ను గ్రహిస్తుంది మరియు తగిన విధంగా ఉపయోగించుకుంటుంది . సాధారణంగా మనం ఎక్కువగా ప్లెయిన్ వాటర్ తీసుకుంటుంటాము ఇది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది , కానీ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల శరీరం కొద్దిగా సాల్ట్ ను నిల్వచేసుకోగలుగుతుంది.

ఇతర ప్రయోజనాలు:
ఎర్లీమార్నింగ్ సాల్ట్ వాటర్ త్రాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి, బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి, మజిల్ క్రాంప్స్ నివారించబడుతుంది. మజిల్ క్రాంప్స్ నివారించబడుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications