For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాయిలెట్ మూత ఓపెన్ చేసి నీళ్లు వదులుతున్నారా?

By Y. Bharath Kumar Reddy
|

మీరు టాయిలెట్ కు వెళ్లినప్పడు మూత తెరిచి నీళ్లు వదులుతున్నారా? ఇలా చేస్తున్నట్లయితే వెంటనే ఆ పద్ధతి మానుకోండి. చాలామంది మూత తెరలిచి ఫ్లష్ ప్రెస్ చేస్తారు. ఎందుకంటే అందరికీ అలా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందనే కదా మీ ప్రశ్న. దీనివల్ల 'టాయ్లెట్ ప్లూం' వ్యాపిస్తుంది. మీరు టాయిలెట్ ను ఫ్లష్ చేసినప్పుడు.. వచ్చే వాటర్ పక్కకు పడుతూ ఉంటుంది.

అందువల్ల మూత మూసి మీరు నీటి బటన్ ను ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ నీటి వేగం అధికంగా ఉంటుంది. దీంతో నీరు 15 అడుగుల ఎత్తులో చేరవచ్చు. మీరు టాయిలెట్ కు వెళ్లాక మూత తెరిచి ఫ్లష్ చేశారనుకో చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్లవుతారు.

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలుమీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

ఎందుకంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా అక్కడ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. దీంతో నీళ్ల ఫోర్స్ కు ఆ వైరస్ మొత్తం కూడా ఇంటిలో ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది. మీ ఇంటి ఫ్లోర్, సింక్, మీ టూత్ బ్రష్ ఇలా పలు ప్రదేశాల్లోకి వైరస్ వ్యాపిస్తుంది. అలాకాకుండా టాయిలెట్ మూసి ఉంచి ఫ్లష్ చేస్తే అక్కడ ఉండే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇలా చేస్తే కొన్ని ఫ్లష్ లకే బ్యాక్టీరియా తగ్గిపోయింది. అలా తరచు చేయడం వల్ల బ్యాక్టీరియ పూర్తిగా తగ్గిపోయినట్లు పరిశోధనలో తేలింది.

Are You Flushing With Lid Open; Then You Need To Stop This

నోటిలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ

టాయిలెట్స్ లో ఉండే సాల్మోనెల్లా, షిగెల్లా వంటి బాక్టీరియా అలాగే నోరోవైరస్ హెపటైటిస్ - ఏ లాంటి వైరస్లు మన నోటిలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల వీలైనంత వరకు నోటికి సంబంధించిన సామగ్రిని అంటే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మొదలైనటువంటివి వాష్ రూమ్ బయట ఉండే గదుల్లో ఉంచడం చాలా మంచిది. అంతేకాకుండా టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలి. టాయిలెట్ నుంచి బయటకు వచ్చే ముందు మీరు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.

Are You Flushing With Lid Open; Then You Need To Stop This

ఎన్నో వైరస్ లకు కేంద్రం

గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైరస్లు, ఎంటేరిక్ పాథోజెన్లు, చర్మానికి హానీ చేసే జీవులు, శ్వాసకోశ వైరస్లు, అవశేష శిలీంధ్రాలు మొదలైనవన్నీ టాయ్ లెట్స్ లో ఉంటాయి. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచడం వల్లే ఈ వ్యాధికారక క్రిములను నివారించగలుగుతాం. అలాగే స్యుడోమోనాస్ ఏరోగినోసా, స్టెఫిలోకాకస్ అయుయస్, సాల్మోనెల్లా, ఎంటర్ బ్యాక్టర్ మొదలైనవి కూడా టాయిలెట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల అనేక వ్యాధులకు గురవుతాం.

యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది.. యాసిడ్ ను టాయిలెట్ క్లీనర్ గా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది..

పబ్లిక్ టాయిలెట్స్ కు వెళ్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అలాగే మీరు పబ్లిక్ టాయిలెట్స్ కు వెళ్లినప్పుడు కొన్నిసూత్రాలు పాటించాలి. దీంతో మీరు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వీలైనంత వరకు టాయిలెట్స్ తలపులను తాకొద్దు. అలాగే డోర్ ఓపెన్ చేసేందుకు గుండ్రటి ఆకారంలో ఉండే దాన్ని డైరెక్ట్ గా అస్సలు ముట్టుకోవొద్దు. అక్కడ అనేక సూక్ష్మ జీవులుంటాయి. ఇవి చాలా అంటురోగాలకు కారణం అవుతాయి. అందువల్ల డోర్ ను తీయడానికి మీరు టిస్యూ పేపర్ ఉపయోగించండి.

Are You Flushing With Lid Open; Then You Need To Stop This

మీ వ్యక్తిగత వస్తువులు జాగ్రత్త

అలాగే మీరు పబ్లిక్ టాయిలెట్స్ కు వెళ్లినప్పడు మీ వ్యక్తిగత వస్తువులపై వైరస్ అటాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సూక్ష్మజీవులు మొదట మీ చేతులపైకి ప్రవేశిస్తాయి. అయితే మీరు చేతులను శుభ్రం చేసుకునే సమయంలో అవి మీ బ్యాగ్స్, ఫోన్స్ పైకి వ్యాపిస్తాయి. అందువల్ల వాటిని బయటే ఉంచండి.

హ్యాండ్ డ్రైయర్ ను ఉపయోగించొద్దు

అలాగే టాయిలెట్ లోపల ఉండే హ్యాండ్ డ్రైయర్ ను ఉపయోగించొద్దు. ఎందుకంటే అది గాలిలోకి జెర్మ్స్ ను ఈజీగా వ్యాప్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. వీలైనంత వరకు పేపర్ టవల్స్ ఉపయోగించండి. అలాగే ఎక్కువ ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ కు మీరు ప్రాముఖ్యం ఇవ్వండి. అవి లేని పక్షంలో వెస్టర్న్ టాయిలెట్స్ కు వెళ్లండి.

English summary

Are You Flushing With Lid Open; Then You Need To Stop This

Are You Flushing With Lid Open; Then You Need To Stop This ,Are you flushing your toilet with the lid open? Then, you need to stop this habit immediately! Read to know why.
Desktop Bottom Promotion