Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
అలర్ట్ : ఇటువంటి చిన్న పనుల వల్లే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందంటున్న నిపుణులు
మెదడు అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కంప్యూటర్‌కు హార్డ్ డిస్క్ ఎలాంటిదో మన శరీరానికి మెదడు కూడా అలాంటిదే. ఎన్నో జ్ఞాపకాలను అది భద్రపరుచుకుంటుంది. శరీరంలోని అన్ని అవయవాలతో మెదడు అనుసంధానం అవుతుంది. అందుకే మనకు ఎక్కడ ఏ చిన్న దెబ్బ తాకినా వెంటనే మెదడు స్పందిస్తుంది.
అయితే మనం చేసే పలు పనుల వల్ల మెదడు ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతుందని మీకు తెలుసా..? అవును, చాలా మంది ఆ పనుల గురించి పెద్దగా ఆలోచించరు. అయితే వాటి గురించి తెలుసుకుంటే తద్వారా మనం మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత రాత్రి తిన్న ఆహారం తరువాత చాలా ఎక్కువ సమయం పాటు శరీరం శక్తి కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో మెదడు యాక్టివ్ గా పనిచేయాలన్నా, ఉదయాన్నే తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి చక్కగా పనిచేయాలన్నా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే శరీరానికి శక్తి సరిగ్గా అందదు. గ్లూకోజ్ లెవల్స్ పడిపోతాయి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. ఏ పనిచేయలేరు.

2. ఓవర్‌గా రియాక్ట్ అవడం
కొందరు చిన్న విషయాలకు కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. అయితే అది మంచిది కాదు, ఎందుకంటే అలా అయితే మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అది మెదడులో ఉండే రక్త నాళాలను బ్లాక్ చేస్తుంది. దీంతో మానసిక శక్తి సన్నగిల్లుతుంది.

3. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం
చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, గ్లూకోజ్ ఎక్కువగా అందే కార్బొహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే మెదడుకు పోషణ సరిగ్గా అందదు. దీంతో అది సరిగ్గా డెవలప్ కాదు. మానసికంగా ఎదగలేరు.

4. పొగ తాగడం
పొగ తాగడం మంచిది కాదు. దాంతో మెదడు కుచించుకుపోతుంది. ఫలితంగా అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వస్తుంది. మెదడు పనితనం తగ్గుతుంది.

5. నిద్రలేమి
రోజూ తగినంత సమయం పాటు నిద్రపోవాలి. నిద్ర తక్కువగా పోతే మెదడుకు విశ్రాంతి అందదు. ఫలితంగా మెదడు కణాలు నశిస్తాయి. అది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.

6. గాలి కాలుష్యం
గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు. ఉంటే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఫలితంగా మెదడు కణాలు నాశనమవుతాయి. దీంతో మెదడు పనితనంపై ప్రభావం పడుతుంది.

7. అనారోగ్యంతో ఉన్నప్పుడు పనిచేయడం
చాలా మంది అనారోగ్యంగా ఉన్నాగానీ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితిలో పనిచేస్తే మెదడుపై అధిక భారం పడుతుంది. ఫలితంగా దానిపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు.

8. నిద్రించేటప్పుడు
నిద్రించేటప్పుడు కొందరు తలకు ఏదైనా చుట్టుకుని, కట్టుకుని పడుకుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు నుంచి కార్బన్ డయాక్సైడ్ సరిగ్గా బయటకు పోదు. ఫలితంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.

9. మెదడుకు మేత
నిత్యం రొటీన్ లైఫ్ గడిపే వారు అప్పుడప్పుడు మెదడుకు పని కల్పించే విధంగా యత్నించాలి. సుడోకు ఆడడం, పజిల్స్ నింపడం, ఏవైనా క్రియేటివ్‌గా ఆలోచించి వాటిని తయారు చేయడం వంటి పనులు చేస్తే మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

10. సరిగ్గా మాట్లాడకపోవడం
కొందరు అవసరం ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. అది మంచిది కాదు. మితభాషిగా ఉండడం కరెక్టే. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అనర్గళంగా మాట్లాడాలి. దీంతో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
