సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇలా చేస్తే ఏ రోగాలు రావు!

Posted By: Bharath
Subscribe to Boldsky

సెక్స్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై చాలామంది అమ్మాయిలకు అవగాహన ఉండదు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఇన్ ఫెక్షన్స్ వస్తుంటాయి. సెక్స్ పూర్తయ్యాక వీర్యం మహిళల యోనిపై పడటం, కొన్నిసార్లు యోని చుట్టూ కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్నగా మొదలై అవే పెద్ద సమస్య తెస్తాయి. అలాగే సెక్స్ చేసేటప్పుడు కొందరు ఆ పార్ట్స్ దగ్గర చేతులు తగిలిస్తూ ఉంటారు.

దీంతో చేతులపైకి వైరస్ చేరుకుంటుంది. అందువల్ల తర్వాత చేతులను కడుక్కోవాలి. లేదంటే ఆ వైరస్ నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే సెక్స్ పూర్తయ్యాక వెంటనే మహిళలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలపై అవగాహన చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోకుంటే అనవసరంగా రోగాలు కొని తెచ్చుకున్న వాళ్లు అవుతారు. ఇదేమి తప్పు కాదు. మన ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఇవీ కొన్ని. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటో మీరూ చదవండి.

సెక్స్ పూర్తయ్యాక బాక్టీరియా మహిళలు వారి యోని విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యోని చుట్టూ శుభ్రం చేసుకోవాలి. అయితే క్లీన్ చేసుకునే విషయంలోనూ కాస్త జాగ్రత్తలు పాటించాలి. తర్వాత టవల్ తో తుడుచుకోవాలి. ఇంకా తడిదనం ఉంటే బ్లోయర్ ను ఉపయోగించి ఆరిపోయేలా చేయాలి. ఇలాంటి ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అవి ఏమిటో చూడండి.

1. వాష్ రూమ్ కు వెళ్లండి

1. వాష్ రూమ్ కు వెళ్లండి

సెక్స్ తర్వాత వెంటనే ఆడవాళ్లు వాష్ రూమ్ కు వెళ్లాలి. ఎందుకంటే స్మెర్మ్ ద్వారా గానీ లేదా ఏదైనా కారణాల వల్ల ఆడవారి ఆ అవయంలోకి బ్యాక్టీరియా ఎంటరయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వారు దాన్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి ఇన్ ఫెక్షన్ రాదు. మీ పార్టనర్ తో సెక్స్ లో పాల్గొన్న వెంటనే మీరు ఈ పని చేయండి.

2. హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేయకండి

2. హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేయకండి

ఇక మీరు అందులో పాల్గొన్న తర్వాత వెంటనే హాట్ వాటర్ తో స్నానం చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో యోని కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న వెంటనే ఆడవాళ్లు షవర్ కింద వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ యోనిలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ ఫెక్షన్ కు గురవుతారు. సెక్స్ తర్వాత చేయకూడని పనుల్లో ఇది చాలా ముఖ్యమైనది.

3. నీరు తాగడం

3. నీరు తాగడం

సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే మంచి నీరు తాగడం చాలా మంచిది. దీని వల్ల మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. శృంగారం తర్వాత డీ హైడ్రేషన్ కు గురికాంకుండా ఉండేందుకు, నీరసంగా ఉండకుండా ఉండేందుకు నీటిని తాగాలి.

4. ప్రోబయోటిక్స్ ఫుడ్స్

4. ప్రోబయోటిక్స్ ఫుడ్స్

సెక్స్ తర్వాత చాలామంది అలసిపోతారు. అందువల్ల కాస్త తిందామనుకుంటారు. అయితే ఏదంటే అది తినకూడదు. వీలైనంత వరకు ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. పెరుగు, కంబాచూ లేదా కించి వంటి ఆహారాలు తినాలి. ఇవి మీలో వ్యాధులతో పోరాడగలిగే బ్యాక్టీరియను ఉత్పత్తి చేయగలవు. దీంతో మీరు ఇన్ ఫెక్షన్ గురికారు.

5. సబ్బులను ఉపయోగించకండి

5. సబ్బులను ఉపయోగించకండి

సెక్స్ పూర్తయిన తర్వాత ఆడవారు వారి జననాంగాలను సబ్బుతో క్లీన్ చేసుకోకూడదు. సెక్స్ తర్వాత గానీ లేదా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేయడం అనేది చాలా తప్పు. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులు రావని యోని క్లీన్ గా అవుతుందని చాలామంది అపోహపడుతుంటారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సబ్బులు అక్కడ ఉండే సున్నితమైన చర్మంపై ప్రభావం చూపుతాయి. చర్మం పొడిగా మారుతుంది. అందువల్ల సబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.

6. అలాంటి డ్రెస్ లు అస్సలు వద్దు

6. అలాంటి డ్రెస్ లు అస్సలు వద్దు

చాలామంది లేడీస్ లింగరీస్ వేసుకుంటూ ఉంటారు. ఇవి బికినీ టైప్ లో ఉంటాయి. ఇవి అన్నీ కూడా నైలాన్ లేదా పాలిస్టర్ వంటి వాటితో తయారవుతాయి. సెక్స్ తర్వాత వాటిని ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇవి బ్యాక్టీరియా పెరగడానికి ఎక్కువగా కారణం అవుతాయి. అందువల్ల వీటిని ఉపయోగించకపోవడం చాలా మంచిది.

7. వెట్ వైప్స్ ఉపయోగించకండి

7. వెట్ వైప్స్ ఉపయోగించకండి

కొన్ని రకాల ప్యాడ్స్ ను ఆడవారు యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలోని రసాయనాలు మీ సున్నితమైన జననేంద్రియాలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ముక్యంగా సెక్స్ తర్వాత మీరు ఆ ప్రాంతాన్ని వెంటనే వెనిగర్ తో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. సెక్స్ తర్వాత ఆడవాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఇదేనని గుర్తించుకోవాలి.

8. బ్లో డ్రైయర్ ను వాడండి

8. బ్లో డ్రైయర్ ను వాడండి

సెక్స్ తర్వాత ఆ పార్ట్ కు గాలి తగిలేలా చేయాలి. ఇందుకోసం బ్లో డ్రైయర్ ను ఉపయోగించడం చాలా మేలు. ఈ మిషన్ ను ఉపయోగించి ఆ పార్ట్ లో ఉండే తేమను పొగొట్టుకోవొచ్చు. డాక్టర్లు కూడా దీన్నే రెఫర్ చేస్తారు. అందువల్ల సెక్స్ పూర్తయ్యాక లేడీస్ ఈ పని చేస్తే మంచిది. ఇవన్నీ సెక్స్ తర్వాత ఆడవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా చేస్తే వారికి ఏ ఇన్ ఫెక్షన్స్ రావు.

English summary

do these things immediately after an intercourse

Here are a few of the things that you must do immediately after having an intercourse. Read to find out about these.
Please Wait while comments are loading...
Subscribe Newsletter