For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లం - తేనె - నిమ్మకాయల సాయంతో జలుబును ఎలా ఉపసంహరిస్తాము

|

ప్రస్తుతానికి ఇది శీతాకాల సమయం ! కురుస్తున్న మంచు, చలిని కాచుకునే మంటలు, మరియు కప్పులలో వెచ్చని చాక్లెట్ పాలలో తేలుతున్న మార్ష్మాల్లౌ వంటివి ఈ కాలంలోనే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి.

ఈ కాలంలోనే దురదృష్టవశాత్తు, భయంకరమైన చల్లని ఫ్లూ కారణంగా "జలుబును" కూడా వ్యాపింపజేస్తుంది. మీరు ఈ వ్యాసాన్ని చదువుతున్నవారైతే ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన తగుజాగ్రత్తలు తీసుకొనే మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు.

మేము అనవసరపు మాటలతో ఉన్న సమయాన్ని వృధా చేయకుండా, అసలు విషయానికి వచ్చేస్తున్నాము - అదేమిటంటే, అల్లం - తేనె - నిమ్మకాయలతో పాటు కలిసిన ఆపిల్ సైడర్ వెనిగర్ తో కలసిన పానీయంతో, మీ శరీర వ్యవస్థను బలోపేతం చేస్తూ, దగ్గును మరియు జలుబును నివారించే ఇంటి చిట్కాను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar

ఈ పానీయం తయారీకి కావలసిన పదార్థాలు :

5 స్పూన్ల - తురిమిన అల్లం

1/4 కప్పు - ఆలివ్ ఆయిల్

1/2 కప్పు - తేనె

4 - 5 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar

1వ దశలో :

ఒక శుభ్రమైన గిన్నెలో 5 స్పూన్ల తురిమిన అల్లాన్ని తీసుకోండి.

పసుపు మొక్కల జాతికి సంబంధించినదే అల్లం కూడా. ఇది మీ శ్వాసకోశ నాళంలో వున్న మంటను నిరోదించి, మీ ఆకలిని మెరుగుపరిచే సామర్ధ్యాన్ని కలిగి ఉన్న శక్తివంతమైన శోధ నిరోధకతను మరియు యాంటి-మైక్రోబియల్ ఏజెంట్ ను కలిగి ఉంది.

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar


2వ దశలో :

పై మిశ్రమానికి అరకప్పు తేనెను చేర్చి, బాగా కలపాలి. గొంతుమంటకు కారణమైన కణాలను నిర్వీర్యం చేయడానికి మరియు చికాకును కలిగించే ప్రాంతాన్ని శాంతి పరచడానికి "తేనే" అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

కనీసం 8 గంటల పాటు అల్లం మరియు తేనె కలిసేలా చూడాలి. అలా కలిసిన మిశ్రమము కలుషితం కాకుండా, ఒక మూతను ఆ గిన్నె పై ఉంచాలి.

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar


3వ దశలో :

అల్లం మరియు తేనె కలిసిన మిశ్రమానికి ఆలివ్ ఆయిల్ ను జోడించి బాగా కలిపి వేయాలి.

తేనె మరియు ఆలివ్ ఆయిల్తో చేయబడిన ఈ మిశ్రమం మీ గొంతు నొప్పిని (లేదా) గొంతులో చికాకును తగ్గిస్తుంది. అలాగే ఈ మిశ్రమం తేనెకన్నా పలుచగా ఉండి, మీ బాధని పూర్తిగా ఉపసంహరించేదిగా ఉంటుంది.

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar

4వ దశలో :

పై మిశ్రమానికి 4 - 5 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను జోడించి బాగా కలపండి.

5వ దశలో :

అలా తయారైన మిశ్రమాన్ని వడకట్టి, ఒక జాడిలో భద్రపరచాలి. ఈ మిశ్రమాన్ని వినియోగించడానికి ముందు ఒక స్పూనుతో బాగా కలపాలి.

6వ దశలో :

ఇలా ఒక జాడీలో నిల్వ చేయబడిన ఈ పదార్ధాన్ని, సూర్యకాంతి తగలని, చల్లని, పరిశుభ్రమైన మరియు పొడి ప్రదేశంలో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని 6 వారాల వరకు వాడటం చాలా ఉత్తమం.

సూచనలు : ఈ మిశ్రమాన్ని ఉపయోగించడానికి ముందు తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం మంచిది. మంచి ఫలితాల కోసం ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు చొప్పున వాడండి.

ఈ వ్యాసాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి :

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు జబ్బు పడుతున్నారు కాబట్టి , ఈ వ్యాసాన్ని మీ మిత్రులకు షేర్ చేసి - వారికి సహాయం చేయండి. ఎవరికి తెలుసు ఇది ఎప్పుడు అవసరం అవుతుందో ?

English summary

Ginger Honey Lemon Cough Remedy with Apple Cider Vinegar

So we will not waste time dillydallying any longer and get straight to the point - how to make a powerful and all-natural ginger, honey, lemon cough remedy at home with a bit of apple cider vinegar in it to strengthen your system.
Desktop Bottom Promotion