గ్రహణ సమయంలో భారతీయులు ఎందుకు ఆహారం తీసుకోరో తెలుసా?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

భారతదేశం ఎన్నో వందల సంస్కృతులు సంప్రదాయాల సమ్మేళనం. భారతీయులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు, పాటిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఈ ప్రపంచంలో భారత దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

భారతదేశాన్ని ఒక "ఉపఖండం" గా చాలామంది అభివర్ణిస్తారు, అందుకు కారణం లేకపోలేదు. ఎన్నో కులాలు, మతాలు, ప్రాతాల నుండి వైవిధ్యమైన జీవన విధానాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంసృతులు భారతదేశం లో ఉద్భవించాయి. ఇతిమిద్దంగా ఎన్ని, ఇలా ఉత్పన్నమయ్యాయి అని చెప్పడం కష్టతరమైన విషయం.

solar eclipse facts

దేశంలోని ప్రతి రాష్ట్రానికి, అందుకు తగ్గట్లు ప్రత్యేకమైన సంస్కృతులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విబ్భిన్నం అని చెప్పడానికి వాటికంటూ కొన్ని వైవిధ్యమైన సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ఈరోజుటికి ఆయా రాష్ట్రాలు తూచాతప్పకుండా పాటిస్తున్నాయి.

మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు

ఉదాహరణకు, చాలా రాష్ట్రాలు కొత్త సంవత్సర ఆరంభాన్ని ఒక్కో విధంగా, సంవత్సరంలోని వేరు వేరు సమయాల్లో జరుపుకుంటాయి.

కర్ణాటక "ఉగాది" పేరుతో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. తమిళనాడు "పొంగల్" పేరుతొ అదే పండగను జరుపుకుంటుంది. కానీ ఆ పండగను జరుపుకునే విధానం మాత్రం రెండింటికి ఎక్కడా పోలిక ఉండదు. ఎవరికీ వారు తమ సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకోవడానికి ఇష్టపడతారు.

సంప్రదాయాలు అనేటివి నమ్మకాల ఆధారంగా ఏర్పడతాయి. ఈ నమ్మకాల లో కొన్నింటికి ఖచ్చితమైన కారణాలు ఉంటాయి, అందుకు తగ్గ రుజువులు కూడా ఉంటాయి. అవి పాటించడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం మరియు జీవన విధానం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకొన్ని నమ్మకాలు అర్థరహితంగా నమ్మలేని విధంగా, ఆచరణ యోగ్యంకాని విధంగా ఉంటాయి.

ఉదాహరణకు,ఏ స్త్రీ అయితే మగపిల్లాడికి జన్మనిస్తుందో ఆమె స్వర్గానికి చేరుతుందని ఇప్పటికి భారత దేశంలో చాలా కుటుంబాలు నమ్ముతాయి. ఈ నమ్మకానికి ఎటువంటి ఆధారంలేదు ఇది కేవలం అభూతకల్పనే. మిగతా నమ్మకాలలో, నెలసరి సమయంలో మూడవరోజు స్త్రీలు తల స్నానం చేయాలి అనే దానికి శాస్త్రీయపరంగా ఆధారం ఉంది. ఋతు చక్ర సమయంలో స్త్రీల శరీరం నుండి ఎక్కువ చెమట మరియు నూనెలు వెలువడతాయి. కాబట్టి నెలసరి చివరిలో తలస్నానం చేయడం అనేది ఒక ఆరోగ్యవంతమైన అలవాటు.

మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన మూఢనమ్మకాలు

పౌర్ణమి, గ్రహణం మొదలగు సహజ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు భారత దేశ ప్రజలకు కొన్ని బలమైన నమ్మకాలు ఉన్నాయి.

సూర్య గ్రహణం రోజు ఆహరం ఏమి తీసుకోకూడదని చాలా మంది ప్రజలు చెబుతారు.

అసలు ఎందుకు చాలామంది భారతీయులు ఇలా చెబుతారు ? అలా ఆహరం తీసుకోకూడదు అనే నియమాన్ని ఎందుకు పాటిస్తారు? దాని వెనుక దాగిఉన్న అసలు నిజాలేంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యగ్రహణం గురించి యధార్ధాలు :

మొదటి కారణం : ఆ సమయంలో వెలువడే సూర్య కిరణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో, ఆ సందర్భాన్ని సూర్య గ్రహణం అంటారు. ఈ సమయంలో చంద్రుడు అడ్డుగా ఉన్నంతసేపు సూర్యుడి కిరణాలు, భూమిపై పడవు. గ్రహణ సమయంలో కొన్ని రకాల కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించి భూమిని చేరుతాయంట. ఈ కిరణాలు ఆహారంలో ఉండే సూక్ష్మ క్రిములు అధికంగా వృద్ధి చెందడానికి దోహదపడతాయట. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు దృవీకరించారు.

క్రియాశీల గ్రహణం రోజు భారతీయులు ఆహరం తినకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

రెండవ కారణం : అజీర్తి అయ్యే అవకాశం ఉంది.

గ్రహణం పూర్తి అయ్యే వరకు చాలామంది భారతీయులు ఆహరం తీసుకోకపోవడానికి మరొక కారణం ఏమిటంటే, గ్రహణ సమయంలో భూమికి చేరే కిరణాల వల్ల సహజంగా జరిగే ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భావిస్తారు.

ఇదే విషయమై ఎన్నో పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు, గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే అజీర్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.

అధ్యయనాలు చేసిన నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఏ ఆహరంపై అయితే గ్రహణ సమయంలో నేరుగా సూర్య కిరణాలు పడతాయో, ఆ ఆహరం విష పదార్థంగా మారే అవకాశం ఉంది.

ఇలా కొన్ని కారణాల వల్ల గ్రహణ సమయంలో భారతీయులు ఆహరం తీసుకోరు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Read more about: food ఆహారం
  English summary

  Why Indians Do Not Consume Food During An Eclipse

  Here is why Indians do not want to eat food when there is a solar or a lunar eclipse.
  Story first published: Wednesday, August 23, 2017, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more