Latest Updates
-
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్!
జాజికాయతో దాన్ని తయారు చేసుకుని తాగితే ఎలాంటి మగాడైనా...
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కామవాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయ మగతనాన్ని మేల్కొలుపుతుంది. జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వీర్యవృద్ధి.
జాజికాయతో చాలా ప్రయోజనాలున్నాయి. ఆడవారి అందం పెంచడానికి... మగవారికి ఆ సామర్థ్యం పెంచడానికి జాజికాయ బాగా ఉపయోగపడుతుంది. ఇండోనేషియా, మలేషియా, గ్రెనడా వంటి దేశాలతోపాటు మన దేశంలోనూ జాజికాయ ఎక్కువగా పండుతుంది. దీన్ని మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం.
అయితే ఇది వంటలకే కాదు, పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి కూడా పనికొస్తుంది. ఈ క్రమంలో జాజికాయ వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కామవాంఛని పెంచుతుంది
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కామవాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయ మగతనాన్ని మేల్కొలుపుతుంది. జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా వీర్యవృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది.

సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది
అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని, పాలతో కాకుండా జాజికాయ ఊరగాయ రూపంలోనూ, చూర్ణంగానూ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఆవుపాలతో కలుపుకుని తాగితే..
జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది సంతాన లేమిని తొలగిస్తుంది. మగతనాన్ని రెచ్చగొడుతుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇది నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది. నరాల బలహీనతని పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.

అందం పెంచడానికి
జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడం కోసం కూడా ఉపయోగపడుతుంది. కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

దుర్వాసన పోతుంది
జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది.

గుండెల్లో నొప్పి పోతుంది
పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

అధిక దాహాన్ని ఆపుతుంది
అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది.

మతిమరుపును పోగొడుతుంది
జాజి కాయలో లభించే ‘మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది.

బాగా నిద్ర వస్తుంది
వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంది. అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రించడానికి 15 నిమిషాల ముందు తాగాలి. దీంతో చక్కని నిద్ర వస్తుంది.

చందనంతో కలిపి
ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశంవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి.

ట్యాన్ పోతుంది
ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాల తరవాత చల్లటినీటితో కడిగితే కొన్నాళ్ళకు ట్యాన్ మొత్తం పోతుంది. చికెన్ ఫాక్స్ ఉన్నవారికి జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని ఆహారానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సందుల్లో జాబికాయను రాస్తే..
నీటిలో ఎప్పుడూ బాగా నానటం వలన పాచిపోయిన కాళ్ళు వేళ్ళ సందుల్లో జాజికాయను నూరి రాస్తే దీనిలో ఉండే యాంటీఫంగల్ కర్మ ఉండటంవలన దీర్ఘకాలంగా ఉంటూ ఉండే తామర వంటి వ్యాధుల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications