లైంగిక సామర్థ్యం పెరగడానికి.. శృంగారంలో పాల్గొన్నా సంతానం పుట్టకూడదంటే బొప్పాయి విత్తనాలు మేలు

బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు. బొప్పాయి విత్తనాలు

బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలు బొప్పాయి పండ్లలో ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు, దంత సమస్యలకు, రక్త సరఫరాకు బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే. బొప్పాయి విత్తనాలను సాధారణంగా ఎవరైనా పడేస్తారు. కానీ వాటిని నిర్భయంగా తినవచ్చు.

పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే

పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే

నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి విత్తనాలు జస్ట్ ఓ టీ స్పూన్ తీసుకుంటే..? ఏంటి బొప్పాయి విత్తనాలు తినాలా వామ్మో అనుకోవద్దు.

మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్

మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్

బొప్పాయి పండుతో మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులకు చెక్ పెట్టవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఆ మధ్య ఒకసారి కరాచీ యూనివర్శిటీ విద్యార్థులు తెలిపారు. వృత్తిలో ఏర్పడే చికాకులు, ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి కారణమవుతుంటాయి. ఇందులో భాగంగా మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు ఇలానే కబళిస్తుంటాయి.

విత్తనాల్లోనే మిక్కిలి ఔషధ విలువలు

విత్తనాల్లోనే మిక్కిలి ఔషధ విలువలు

అయితే, బొప్పాయి పండుతో వీటన్నిటికి చెక్ పెట్టవచ్చని కరాచీ యూనివర్శిటీ విద్యార్థులు తేల్చారు. బయట విరివిగా దొరికే బొప్పాయిలో ఈ వ్యాధి కారకాలను నియంత్రించే గుణం మెండుగా ఉందని వారు తమ పరిశోధనల్లో తేల్చారు. అయితే, బొప్పాయి ఫలం కంటే వాటి విత్తనాలే మిక్కిలి ఔషధ విలువలు కలిగి ఉన్నాయట.

ఉదర సంబంధ వ్యాధులు

ఉదర సంబంధ వ్యాధులు

రోజూ ఓ స్పూన్ బొప్పాయి విత్తనాలు తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, ఉదర సంబంధ వ్యాధులు కూడా దరిచేరవని హామీ ఇస్తున్నారు. రోజూ ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే దాంతో శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.

శరీర బరువును తగ్గిస్తాయి

శరీర బరువును తగ్గిస్తాయి

బొప్పాయి విత్తనాల వల్ల జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

కండరాల సమస్యలు పోతాయి

కండరాల సమస్యలు పోతాయి

బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం మన తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగమవుతాయి. అందువల్ల కండరాల సమస్యలు పోవడమే కాదు, కండరాలు చక్కగా నిర్మాణమవుతాయి. నిత్యం పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.

శృంగార సామర్థ్యం రెట్టింపు

శృంగార సామర్థ్యం రెట్టింపు

బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు. బొప్పాయి విత్తనాలు పురుషుల్లో వీర్య నాణ్యతను పెంచుతాయి. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.

సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు

సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు

ఎవరైనా బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.

విష పదార్థాలన్నీ బయటకు

విష పదార్థాలన్నీ బయటకు

ఐదు లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.

నొప్పులు, వాపులను తగ్గిస్తాయి

నొప్పులు, వాపులను తగ్గిస్తాయి

బొప్పాయి విత్తనాలను తరచూ తింటుంటే కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.

ట్యూమర్లు వృద్ధి చెందకుండా

ట్యూమర్లు వృద్ధి చెందకుండా

యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ధర్మాలు కూడా బొప్పాయి విత్తనాలకు ఉన్నాయి. ఈ-కొలి వంటి బాక్టీరియాలను నిర్మూలించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తాయి. పలు క్యాన్సర్లను అడ్డుకునే శక్తి వీటికి ఉంది.

అప్పుడే సంతానం వద్దనుకునే వారి

అప్పుడే సంతానం వద్దనుకునే వారి

కడుపు, పేగుల్లో వృద్ధి చెందే హానికర బాక్టీరియాలను నిర్మూలిస్తాయి. అప్పుడే సంతానం వద్దనుకునే వారికి ఇవి కాంట్రాసెప్టివ్ మాత్రల్లా ఉపయోగపడతాయి. జీర్ణక్రియను వృద్ధి చెందిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను పోగొడతాయి.

Story first published: Monday, May 7, 2018, 17:00 [IST]
Desktop Bottom Promotion