జీలకర్ర ద్రావణాన్ని మూడు నెలలు తీసుకుంటే మీ రూపు రేఖలే మారుతాయి

Written By:
Subscribe to Boldsky

జీలకర్ర ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే ఆరోగ్య ప్రదాయని. దీనిని మనం కూరల్లో వాడుతూనే ఉంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. జీలకర్ర రెండు రకాల్లో దొరుకుతుంది. నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. రెండింటితో అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు నిపుణులు.

జీలకర్ర ప్రధానాహారంగా కాకపోయినా... ఆహారానికి మంచి రుచి, సువాసన (ఫ్లేవర్‌) రావడానికి ఉపయోగపడే దినుసు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని... తాలింపులో జీలకర్ర పడగానే ఒక మంచి సువాసనతో మనకు ఆహ్లాదం చేకూరుతుంది.

తామర, తెల్లమచ్చలు తగ్గుతాయి

తామర, తెల్లమచ్చలు తగ్గుతాయి

జీలకర్ర కషాయంతో తామర, తెల్లమచ్చలు తగ్గుతాయి. చర్మ వ్యాధులున్నా తగ్గు ముఖం పడతాయి. ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణాల్ని సమపాళ్లలో తీసుకుని, పొడిచేసి, మజ్జిగలో కలుపుకుని తాగాలి. దీనివల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. నులి పురుగుల సమస్య పోతుంది.

గుండెనొప్పి రాదు

గుండెనొప్పి రాదు

జీలకర్ర కషాయంగా రోజూ తాగుతూ ఉంటే గుండెనొప్పి రాదంటున్నారు నిపుణులు. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల సైనస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంచెం జీలకర్ర తీసుకుని నేతిలో దోరగా వేయించాలి. అనంతరం దాన్ని పొడి చేసి, సైంధవ లవణం / ఉప్పు కలిపి రోజుకు రెండుపూటలా తీసుకుంటే గర్భాశయ బాధలు తగ్గుతాయి. ఈ పొడిని అన్నంలో / మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు.

కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడేవారు

కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడేవారు

ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడేవారు జీలకర్రనుగానీ, ధనియాలు, జీలకర్ర మిశ్రమంగానీ తీసుకొంటే ఫలితం కనిపిస్తుంది. ధనియాలు, జీలకర్ర సమపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి, పొడి చేసుకోవాలి. అందులో తగినంత సైంధవ లవణం / ఉప్పును కలిపి, అన్నంలో / మజ్జిగలో కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.

తలతిప్పడం నుంచి ఉపశమనం

తలతిప్పడం నుంచి ఉపశమనం

జీలకర్రను నిమ్మరసంతో కలిపి రెండపూటలా తీసుకుంటే తలతిప్పడం, వేడి తదితర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్‌ అనే రసాయనమే దీనికి కారణం. ఇది మన లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి ఆకలిని పెంచుతుంది.

జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది

జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది

పైన పేర్కొన్న ప్రక్రియ జరగగానే జీలకర్ర ఉండే థైమాల్‌ అనే మరో రసాయనం జీర్ణప్రక్రియకు అవసరమైన బైల్, ఇతర జఠరరసాలు ఊరేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. అందుకే ఆకలి లేనివారు, అరుగుదల సమస్యలు ఉన్నవారు జీలకర్ర వాడితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర గ్యాస్‌ట్రబుల్‌ను తగ్గిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను వాడితే గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

ఐరన్ ఎక్కువగా ఉంటుంది

ఐరన్ ఎక్కువగా ఉంటుంది

జీలకర్రలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్‌ తిరిగి భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్‌ ఎక్కువగా అవసరం కాబట్టి వారు వాడటం కూడా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్స్‌ను జీలకర్ర తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవొచ్చు

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవొచ్చు

జీలకర్ర నీటితో కేవలం 15 రోజుల్లో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున ఈ నీటిని తీసుకుంటే చెడు కొవ్వుని తగ్గించుకోవడంతోపాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒక ఓ రీసెర్చ్‌ వెల్లడించింది. జీరా వాటర్‌ మలబద్దకాన్ని దూరం చేసి, జీర్ణక్రియను మెరుగు పరుస్తుందనీ.. జీవ క్రియ రేటుని పెంచుతుందని తెలిపింది.

ఇలా తయారీ చేయాలి

ఇలా తయారీ చేయాలి

ఒక గ్లాసు మంచి నీటిలో టేబుల్‌ స్పూన్‌ జీలకర్రను రాత్రి మొత్తం నానబెడితే చాలు. నీరంతా జీరా గింజల్లోకి చేరడంతో వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి. అంతే జీరా వాటర్‌ రెడీ. పసుపు రంగులోకి మారిన ఆ ద్రావణంలో కేవలం 7 కాలరీలు మాత్రమే ఉండడం విశేషం. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి సాఫ్ట్‌ డ్రింక్‌గా పనిచేస్తుందనేది పరిశోధనల సారాంశం.

జీరా ద్రావణం తాగితే...

జీరా ద్రావణం తాగితే...

చెడు కొవ్వు మైనస్‌, మంచి కొవ్వు ప్లస్‌ సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడంతో జీవక్రియ మందగిస్తుంది. శరీరంలోని చక్కెరలు, కొవ్వులు ఖర్చు కావు. దాంతో శరీరంలో అధికంగా కొవ్వు పేరకుపోయే ప్రమాదం ఉంది. జీరా ద్రావణాన్ని రోజూ తీసుకోవడం వల్ల అందులో విరివిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ఆక్సిజన్‌ రాడికల్స్‌ను తొలగిస్తాయని తెలిసింది. తద్వారా జీవక్రియ మెరుగు పడి బరువు తగ్గడం తేలికవుతుందని రీసెర్జి అధికారులు అంటున్నారు. ఇది ఒంట్లోని చెడు కొవ్వుని తొలగించడంతో గుండె జబ్బుల బారిన అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇంకా శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని వృద్ధి చేస్తుంది.

హ్యాపీగా తినొచ్చు

హ్యాపీగా తినొచ్చు

మంచి జీర్ణక్రియతో మంచి ఆరోగ్యం సాధ్యం. జీరా వాటర్‌ ప్రేగుల్లో కదలికలను మెరుగు పరచి, అక్కడ ఉండే ఎంజైమ్‌లపై ప్రేరకంగా పనిచేస్తుంది. తద్వారా పొట్టలో ఉబ్బరాన్ని తగ్గించి, మంచి జీర్ణక్రియ సొంతమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

పాలిచ్చే తల్లులకు..

పాలిచ్చే తల్లులకు..

గర్భిణులు, పాలిచ్చే తల్లులు జీలకర్ర ఉండే పదార్థాలను తరచూ తీసుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో పాలు ఎక్కువగా పడేలా చేస్తుంది. థైమాల్‌ అనే పదార్థం ఇందుకు దోహద పడుతుంది.జీలకర్రలో ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే, వారు కోల్పోయే ఐరన్‌ తేలిగ్గా భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్‌ ఎక్కువగా అవసరం కాబట్టి వారికీ జిలకర చాలా మంచిది.

ఐరన్ తో పాటు ఇంకా చాలా..

ఐరన్ తో పాటు ఇంకా చాలా..

జీలకర్రలో ఐరన్‌తో పాటు చాలా ఎసెన్షియల్‌ ఆయిల్స్, విటమిన్‌-సి, విటమిన్‌-ఏ, ఇతర ఖనిజలవణాలు చాలా ఎక్కువ. ఇవన్నీ సంయుక్తంగా రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక వ్యాధులనుంచి నివారిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటివి రాకుండా నిరోధించే గుణం జీలకర్రకు ఉంది. శ్వాసవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్ - ఇ

విటమిన్ - ఇ

జీలకర్రలో విటమిన్‌-ఇ ఎక్కువ. అందుకే ఇది యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు... చర్మం వదులు కావడం, ముడుతలు, ఏజ్‌ స్పాట్స్‌ వంటి వాటిని నిరోధిస్తుంది.

సర్వరోగ నివారిణి

సర్వరోగ నివారిణి

ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాట‌న్నింటికీ స‌ర్వ‌రోగ నివారిణిగా జీలకర్ర పని చేస్తుంది. మీరు ఒక ద్రావణాన్ని తాగితే చాలు. దీనిని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవ‌చ్చు.

ఇలా తయారు చేసుకోవాలి

ఇలా తయారు చేసుకోవాలి

కావాల్సిన‌వి: 250 గ్రాముల మెంతులు.100 గ్రాముల వాము.

50 గ్రాముల నల్ల జీలకర్ర.

తయారు చేయు విధానము : పై మూడు పదార్దాలను శుభ్రం చెయ్యండి. వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి. గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోండి.

వాడే విధానం

వాడే విధానం

ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం(పొడి)ని కలిపి తాగండి. వేడి నీళ్ళలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు. అన్ని వయసుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణాన్ని తాగొచ్చు. రోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి.

మంచి రక్తం

మంచి రక్తం

80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావ‌డాన్ని మీరు గమనించగలరు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్నముడతలు తగ్గుతాయి. శరీరం బలంగా, చురుకుగా, ప్ర‌కాశవంతంగా త‌యార‌వుతుంది. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్ని త‌గ్గిపోతాయి.

ఎముకలు బలంగా మారుతాయి

ఎముకలు బలంగా మారుతాయి

అలాగే దీన్ని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. మల బద్దకం శాశ్వతంగా నివార‌ణ అవుతుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీర్ఘ కాలిక దగ్గు నివార‌ణ‌. గుండె పనితీరు మెరుగవుతుంది. మీరు చలాకీగా త‌యార‌వుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వినికిడి శక్తి పెరుగుతుంది. గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్ప్రభావాలను ఇది క్లియర్ చేస్తుంది. రక్త శుద్ది జరుగుతుంది.

మూడు నెలలు తీసుకున్నాక..

మూడు నెలలు తీసుకున్నాక..

అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి. పళ్ళు చిగుళ్ళు బలంగా తయారవుతాయి. మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. రెండు లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు. నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే, 15 -20 రోజులు ఆపి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.

English summary

20 incredible benefits of jeera water for your skin hair and health

20 incredible benefits of jeera water for your skin hair and health
Story first published: Tuesday, May 15, 2018, 11:12 [IST]