For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిగడ్డ తింటే మగవారు అస్సలు తట్టుకోలేరు.. కోరికతో రగిలిపోతారు.. ఉల్లితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

ఉల్లి అందించే అనేక లాభాలలో ఒకటి సెక్స్ కోర్కెలను పెంచడం. ఉల్లికి సూక్ష్మజీవ సంహార శక్తి ఉంది. ఉల్లి అధికంగా తింటే సెక్స్ శక్తి పెరుగుతుందని చాలామంది నమ్మకం. సంతాన దేవత సెరెస్ రూపమే ఉల్లి. ఉల్లి లాభాలు

|

ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల షుగర్ వ్యాధి పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వ్యాధిని మనం ఇంట్లో రోజూ వాడే పచ్చి ఉల్లిపాయతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ తినాలి

రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ తినాలి

రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి. షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఖచ్చితంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఇన్సులిన్‌కి బదులు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం.

షుగర్ లెవల్ కంట్రోల్ అవుతుంది

షుగర్ లెవల్ కంట్రోల్ అవుతుంది

ఏడు రోజులు క్రమంతప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్ లెవల్ కంట్రోల్ అవుతుంది.పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకుని అన్నంలో కలుపుకుని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గించడమే కాదు జీర్ణక్రియను క్రమబద్దీకరిస్తుంది ఉల్లి. బాక్టీరియా మన దరిజేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నింటినో దూరం చేసుకోవచ్చు.

చరిత్ర

చరిత్ర

ఉల్లిపాయ ఆసియాలో పుట్టిందని కొందరంటే ప్రస్తుతం పాకిస్థానగా పిలుస్తున్న ప్రాంతంలో పుట్టిందని మరికొందరంటుంటారు. ఏదేమైనా ఆరోగ్యాన్ని చేకూర్చే ఉల్లి సర్వేసర్వత్రా లభ్యమవుతోంది. ఏ రూపంలో దీన్ని తిన్నాసరే వీటిలో ఉండే పదార్థాలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే ఎక్కువగా తినడం వల్ల నష్టమూ ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ మితంగా ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. ఆ మంచేమిటో, ఆ లాభాలేంటో చదవండి!

బాక్టీరియా దరి చేరదు

బాక్టీరియా దరి చేరదు

తినడం వల్ల మాత్రమే కాదు, ఉల్లిని మనవెంట ఉంచుకుంటే చాలట! వైరస్‌, బాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను మనదరిజేరనీయదట. టెస్టోస్టిరాన్, ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్ వంటివి ఉల్లిలో ఉన్నాయి. అందుకే రక్తశుద్ధికీ, రక్తవృద్ధికీ ఉల్లి దోహదపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

శరీరంలోని కొలెస్ర్టాల్‌ను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసేకంటే, రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే చాలు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులోఉంటుంది. రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే అధిక కొలెస్ట్రాల్ ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లి గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. అల్లిల్‌ ప్రోపిల్‌ డిసల్ఫయిడ్‌ తగ్గిన బ్లడ్‌ షుగర్‌ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

దగ్గు మాయం

దగ్గు మాయం

ఉల్లిపాయను రెండు ముక్కలు చేసి ప్రతి పొరలోనూ ఒక టేబుల్‌స్పూన బ్రౌన షుగర్‌ అప్లయి చేయాలి. తర్వాత ఆ ముక్కల్ని పాయరూపంలో దగ్గరకు నొక్కి ఒక జార్లో గంటసేపు ఉంచాలి. దాన్ని రోజుకు రెండుసార్లు వాసన చూస్తుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. లేకపోతే ఉల్లిపాయ రసం, తేనె రెంటినీ సమభాగాల్లో తీసుకుని బాగా గిలక్కొట్టి తాగితే గొంతునొప్పి, దగ్గు తగ్గిపోతాయి. ఇతర ఇన్ఫెక్షన్లను కూడా ఇది నివారిస్తుంది.

చెవినొప్పి నివారణ

చెవినొప్పి నివారణ

చెవినొప్పి నివారణకు ఉల్లి బాగా పనిచేస్తుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు దూదిమీద ఉల్లిరసం పిండి దాన్ని చెవిలో ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది లేదా ఉల్లి రసం వేడిచేసి చల్లార్చి చెవిలో వేస్తే చిన్నపిల్లలకు చెవినొప్పి తగ్గిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్‌ను నొప్పి ఉన్న ప్రదేశంలో పూసి, ఒక గుడ్డ చుట్టిఉంచడంవల్ల కూడా నొప్పి క్రమంగా నయమవుతుంది.

విటమిన్ల సముదాయం

విటమిన్ల సముదాయం

యాంటీసెప్టిక్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ మైక్రో బాక్టీరియల్‌ లక్షణాల నిలయం ఉల్లిపాయ. విటమిన సీ, బీ 12, బీ 6, విటమిన కె, బయోటిన, క్రోమియం, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, డైటరీ ఫైబర్‌ ఫుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజూవారి ఆహారంలో ఉల్లిపాయ తింటే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.

జ్వర నివారిణి

జ్వర నివారిణి

జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ తింటే జ్వరం ఎక్కువవుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. రెండు బాగాలుగా కట్‌చేసిన ఉల్లిపాయను గుజ్జుగా కానీ లేదా ఆ రెండుముక్కల్నిగానీ పాదాలకింద ఉంచుకోవాలి. సాక్సులు వేసుకుని రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స జబ్బులను నివారిస్తుంది.

గుండెకు మేలు

గుండెకు మేలు

గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు ఎంతో మేలు చేస్తాయి. కొలెసా్ట్రల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని రక్తాన్ని పల్చగా చేసి కణాలన్నింటికీ ప్రసరణ చేసేందుకు ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్‌ వ్యాధులకు దారి తీయవచ్చు. గుండె జబ్బులు, బీపీతో బాధపడే వారు రోజూ 100 గ్రాముల ఉల్లి తీసుకోవడం చాలా మంచిది. ఉల్లిపాయలోని సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిని నియంత్రించి, బ్లడ్‌ కొలెస్ర్టాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

వాంతులు తగ్గుతాయి

వాంతులు తగ్గుతాయి

ఉల్లిపాయల్ని రుబ్బి దాంట్లోంచి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ‘స్ర్టాంగ్‌ పుదీనా టీ' రెడీగా ఉంచుకోవాలి. ముందుగా రెండు చెంచాల ఉల్లిరసం తాగి, ఐదు నిమిషాల విరామం తర్వాత రెండు చెంచాల చల్లటి పుదీనా టీ తాగాలి. మరో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఉల్లిరసం, పుదీనా టీ రెండు చెంచాల చొప్పున విరామంతో సేవించాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గిపోతాయి. అజీర్తి వల్ల వాంతులు, విరోచనాలు వస్తే అరకప్పు ఉల్లిపాయరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి అప్పుడప్పుడు తాగితే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

రక్తస్రావాన్ని అరికట్టే ఉల్లి

రక్తస్రావాన్ని అరికట్టే ఉల్లి

ముక్కులోంచి రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కోసి ముక్కుదగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కీటకాలు కుట్టినప్పుడు ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లయి చేయాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది.

క్రిములు చేరకుండా

క్రిములు చేరకుండా

గాయంచుట్టూ క్రిములు చేరకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు తినడంవల్ల రక్తపుష్టి కూడా కలుగుతుంది. ఉల్లిలోని ఐరనని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.

పొట్టనొప్పి నివారణ

పొట్టనొప్పి నివారణ

పిల్లల్లో పొట్టనొప్పి నివారించడానికి ఉల్లి మంచి దోహదకారి. అందుకు మనం చేయాల్సిందల్లా, కొంచెం నీళ్ళల్లో ఉల్లిపాయను వేసి ఉడికించాలి. ఆ ఉల్లినీటిని చల్లార్చి పిల్లలకు ఒక చెంచాడు తాగిస్తే తక్షణ రిలీఫ్‌ లభిస్తుంది. ఇలా గంటకొక్కసారి చెంచాడు ఉల్లినీరు తాగిస్తే నొప్పి నివారణవుతుంది.

పెద్దపేగు కేన్సర్‌

పెద్దపేగు కేన్సర్‌

ఉల్లికాడలలో పెక్టిన (నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌) ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్‌ అభివృద్ధి అవకాశాలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలో స్థూలపోషకాలు ఉండడంవల్ల ఇది జీవక్రియ క్రమబద్దీకరణకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను నీళ్లలో వేడిచేసి ఆ నీటికి కొంచెం చక్కెర చేర్చి పిల్లలకు తాగిస్తే వారికి మంచి నిద్ర పడుతుంది.

ఉల్లితో అందమైన జుట్టు

ఉల్లితో అందమైన జుట్టు

జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉపయోగపడే మెరుగైన పదార్థాల్లో ఉల్లి ఒకటి. ఇందులోని పోషకాలు జట్టును మరింత బలంగా మార్చి వాటి పెరుగుదలకు దోహదపడుతాయి. ముఖ్యంగా ఉల్లిలో ఉండే సల్ఫర్‌ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఉల్లిరసరం తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.

తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది

తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది

జుట్టులో ఉన్న ఫంగస్ ని ఉల్లి హరింపజేస్తుంది. చుండ్రును నివారించి తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కల్పించే ఈ ఉల్లిరసాన్ని వారంలో మూడుసార్లు తలకు పట్టిస్తే రెండునెలల్లో ఎన్నో ఫలితాలు పొందవచ్చు. ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

మృదువుగా మసాజ్‌ చేయాలి

మృదువుగా మసాజ్‌ చేయాలి

అనంతరం ఈ ఉల్లి పేస్టును ఒక బుట్టలో తీసుకుని రసం పిండాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఐదు నిమిషాలపాటు మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన అనంతరం 45 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే ఉల్లిపాయ రసంలో క్యాటలైజ్‌ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి.

కీళ్లవాతానికి ఉల్లితో చెక్‌

కీళ్లవాతానికి ఉల్లితో చెక్‌

తీసుకునే ఆహారంలో ఉల్లి అధికంగా ఉండేలా చూసుకుంటే కీళ్లవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. మిగిలిన వారితో పోలిస్తే ఆహారంతో పాటు ఉల్లి తీసుకున్న వారిలో కీళ్లవాతం ముప్పు లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి.

సెక్స్ కోరికలు రేకెత్తుతాయి

సెక్స్ కోరికలు రేకెత్తుతాయి

ఉల్లి అందించే అనేక లాభాలలో ఒకటి సెక్స్ కోర్కెలను పెంచడం. ఉల్లికి సూక్ష్మజీవ సంహార శక్తి ఉంది. ఉల్లి అధికంగా తింటే సెక్స్ శక్తి పెరుగుతుందని చాలామంది నమ్మకం. రోమన్ సంస్కృతిలో సంతాన దేవత సెరెస్ రూపమే ఈ ఉల్లి, వెల్లుల్లి అనే విశ్వాసముంది.

సెక్స్ కోరికలు ముదురుతాయి

సెక్స్ కోరికలు ముదురుతాయి

కొన్ని చోట్ల సన్యాసం తీసుకున్నవారు ఈ రెండూ తినడం నిషిద్ధం. ఉల్లి తిన్నట్లు తెలిస్తే టిబిట్‌లో బౌద్ధ సన్యాసులను బహిష్కరించేవారట. అవి తింటే సెక్స్ కోర్కెలు ముదురుతాయని తరతరాలుగా వారిలో దృఢంగా ఉన్న అభిప్రాయం. ఉల్లి తింటే మగవారు అస్సలు తట్టుకోలేరు.. సెక్స్ కోరికలతో రగిలిపోతారు.

English summary

31 surprising benefits of onions for skin hair and health

31 surprising benefits of onions for skin hair and health
Story first published:Monday, May 7, 2018, 17:51 [IST]
Desktop Bottom Promotion