Latest Updates
-
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే!
డ్రై త్రోట్ (పొడి గొంతు) సమస్యకు దారితీసే ఎనిమిది కారణాలు
డ్రై త్రోట్ (పొడి గొంతు) సమస్యకు దారితీసే ఎనిమిది కారణాలు
డ్రై త్రోట్ సమస్య సర్వసాధారణమైన సమస్య. ఇది ఒకరకంగా ఇబ్బందిని కలిగించే సమస్యే. ఇది ఇరిటేటింగ్ గా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు నొప్పిగా కూడా ఉంటుంది. సాధారణంగా, డ్రై త్రోట్ అనేది ఏ ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించినదై ఉండేది కాదు. ఇది చాలా సాధారణ సమస్య.
అయితే, ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ని తీసుకోవాలి. తద్వారా, డ్రై త్రోట్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఐతే, కొన్ని సార్లు డ్రై త్రోట్ సమస్యకు కొన్ని ఆరోగ్య స్థితులు కారణమవుతాయి. ఆ ఆరోగ్య స్థితులను మీరు అర్థం చేసుకోవాలి. వాటిని తగ్గించుకోవడం ద్వారా మీరు డ్రై త్రోట్ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు.

డ్రై త్రోట్ కు దారితీసే అటువంటి కొన్ని కారణాలను ఇక్కడ వివరించాము. వీటి గురించి మీకు అవగాహన లభించడం ద్వారా డ్రై త్రోట్ ను నివారించడం కోసం మీరు మరింత జాగ్రత్తను తీసుకోగలుగుతారు.

1. నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉండటం:
ఈ కారణాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. డ్రై త్రోట్ కి కారణమయ్యే ఈ లక్షణం గురించి మీరు జాగ్రత్త వహించాలి. చాలా సార్లు, తెలియకుండానే నోరు తెరిచి నిద్రిస్తారు. దీని వలన డ్రై త్రోట్ సమస్య తలెత్తుతుంది.
నోరు తెరిచి నిద్రించే వారు మెలకువ రాగానే డ్రై త్రోట్ ను గుర్తిస్తారు. ఎందుకంటే, ఈ విధంగా నిద్రించే సమయంలో, నోటి లోనున్న లాలాజలం ఎండిపోతుంది. అందువలన, డ్రై త్రోట్ సమస్య ఎదురవుతుంది.

2. ఫ్లూ:
ఫ్లూ వలన కూడా డ్రై త్రోట్ సమస్య ఎదురవుతుంది. ఫ్లూ అనేది శ్వాసకోశకు సంబంధించిన అనారోగ్యం. ఫ్లూ బారిన పడితే పొడి గొంతు లేదా గొంతు నొప్పి సమస్యలు తలెత్తుతాయి.
అయితే, కేవలం పొడి గొంతు మాత్రమే ఫ్లూ లక్షణం కాదు. ఫ్లూ వలన జ్వరం, జలుబు వంటి ఇబ్బంది పెట్టే ఇతర లక్షణాలు కూడా ఎదురవుతాయి. డ్రై త్రోట్ అనేది ఫ్లూ వైరస్ వలన ఎదురయ్యే ఒక లక్షణం.

3. మోనోన్యూక్లియోసిస్:
ఈ వ్యాధి గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ సమస్య వలన డ్రై త్రోట్ వేధించడం ప్రారంభించి ఉండొచ్చు. మోనోన్యూక్లియోసిస్ అనే ఈ సమస్యను సాధారణంగా మోనో అని పిలుస్తారు. ఈ స్థితి అనేది ఒక వైరస్ వలన వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సెలైవా ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అనేది పొడి గొంతు.

4. అలర్జీస్ లేదా హే ఫీవర్:
కొన్ని సార్లు, మన చుట్టూ ఉండే వాటి వలన అలర్జీ సంభవించే ప్రమాదం ఉంది. వాటిని మనం గుర్తించడానికి ఫెయిల్ అవుతాము. సీజనల్ అలర్జీస్ లేదా హే ఫీవర్ వలన డ్రై లేదా స్క్రాచీ త్రోట్ సమస్య వేధించే అవకాశాలున్నాయి.
మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పరిసరాలలో ఉండే హానికరం కాని గడ్డి లేదా పోలెన్ వంటి కొన్ని పదార్థాలకు కూడా ఎక్కువగా రియాక్ట్ అవడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య వలన గొంతు నొప్పి వేధిస్తుంది.

5. డీహైడ్రేషన్:
గొంతు పొడిబారటానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం. మీ శరీరం డీహైడ్రేటెడ్ గా మారినప్పుడు డ్రై త్రోట్ సమస్యకు గురయ్యే అవకాశాలెక్కువ.
తగినంత ద్రవాలను తీసుకోకపోవటం వలన శరీరం డిహైడ్రేట్ అవుతుంది. అందువలన, లాలాజలం సాధారణ స్థాయిలో ఉత్పత్తి అవదు. దీని వలన, పొడి గొంతు సమస్య వేధిస్తుంది.

7. స్ట్రెప్ త్రోట్:
స్ట్రెప్ త్రోట్ అనే త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది బాక్టీరియా వలన తలెత్తుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కు గురయినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి వేధిస్తుంది. కొన్ని సార్లు డ్రై త్రోట్ సమస్య కూడా ఎదురవవచ్చు. స్ట్రెప్ త్రోట్ ను తగ్గించుకుంటే పొడిగొంతు సమస్య తగ్గిపోతుంది.

8. టాన్సిలైటిస్:
ఈ సమస్యను టాన్సిల్స్ అనంటారు. ఈ సమస్య బాక్టీరియా లేదా వైరస్ వలన ఎదురవుతుంది. శరీరంలోకి గొంతు ద్వారా వ్యాధి కారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే ప్రక్రియలో టాన్సిల్స్ వాచుతాయి. ఈ సమస్య వలన కూడా పొడి గొంతు సమస్య తలెత్తవచ్చు. జ్వరం అలాగే గొంతు నొప్పి కూడా బాధించవచ్చు.
పొడిగొంతు సమస్య వెనుక ఇన్ని కారణాలున్నాయి. ఏ సమస్య వలన పొడి గొంతు సమస్య వేధిస్తుందో తెలుసుకుంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











