Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,
యూకలిప్టస్ ఆయిల్ తో నుదుటిపై, తలపై మసాజ్ చేయించుకోండి. వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. పాలుఆవు పాలను కాసేపు వేడి చేయండి. తర్వాత వాటిని తాగండి. దీని వల్ల కూడా తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది. గంధపు చె
మనలో చాలా మంది తలనొప్పితో ఇబ్బందిపడుతుంటారు. ఏదో ఒక కారణం వల్ల తలనొప్పికి గురువుతూనే ఉంటాం. తలనొప్పి వస్తే ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అవుతుంటాం. దీంతో అది మరింత ఎక్కువవుతుంది.
కొందరు తలనొప్పిని వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అది కూడా మంచిదికాదు. కొన్ని రకాల చిట్కాలు పాటించి తలనొప్పిని ఈజీగా తగ్గించుకోవొచ్చు.

నిమ్మరసం
కొన్ని గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకోండి. దాన్ని కొద్దికొద్దిగా తాగుతూ ఉండండి. క్రమంగా మీ తలనొప్పి తగ్గిపోతుంది.

యూకలిప్టస్ ఆయిల్ తో నుదుటిపై, తలపై మసాజ్ చేయించుకోండి. వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది.

పాలు
ఆవు పాలను కాసేపు వేడి చేయండి. తర్వాత వాటిని తాగండి. దీని వల్ల కూడా తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది.

గంధపు చెక్క
గంధపు చెక్క ద్వారా కూడా తలనొప్పిని ఈజీగా తగ్గించుకోవొచ్చు. గందాన్ని కాస్త పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని నుదుటిపై రాసుకుని కాసేపు రెస్ట్ తీసుకోండి. అంతే తలనొప్పి మాయం అవుతుంది.

కొబ్బరి నూనె
తలనొప్పి బాగా ఎక్కువగా ఉంటే కొద్దిసేపు కొబ్బరి నూనెతో తలపై, నుదుటిపై మసాజ్ చేసుకోండి. దీని వల్ల కూడా ఈజీగా తలనొప్పి తగ్గిపోతుంది.

అలాగే వెల్లుల్లి వల్ల కూడా తలనొప్పిగా ఈజీగా తగ్గించుకోవొచ్చు. వెల్లుల్లిని మెత్తగా చేసి దాని రసాన్ని తయారుచేసుకోండి. వెల్లుల్లి రసాన్ని కాస్త తాగితే చాలు.. ఈజీగా హెడ్ ఎక్ తగ్గిపోతుంది.

అంతేకాదు కాళ్లను వేడి నీళ్లలో ఉంచుకోవడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవొచ్చు. కాళ్లను కిందకు విడుస్తూ మంచంపై కూర్చొండి. మీకాళ్లను వేడి నీళ్లు ఉండే పాత్రలో ఉంచుకోండి.
అలా కొద్ది సేపు పెట్టుకున్న తర్వాత హ్యాపీగా పడుకోండి. నిద్రలోనే మీ తలనొప్పి మాయం అయిపోతుంది.

ఆపిల్ ద్వారా
ఆపిల్ ద్వారా కూడా మీ తలనొప్పి తగ్గిపోతుంది. ఆపిల్ కు కాస్త ఉప్పు రాసుకుని తినండి. ఒక పది నిమిషాల తర్వాత వేడి పాలు తాగండి. దీంతో తలనొప్పి పోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చాలు.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ ద్వారా కూడా తలనొప్పి తగ్గిపోతుంది. ఆలివ్ ఆయిల్ ను వేడి చేసి దాంతో తలకు మసాజ్ చేసుకోండి. ఈజీగా తలనొప్పి తగ్గిపోతుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవొచ్చు. గ్రీన్ టీలో కాస్త తేనె కలుపుకోండి. అలాగే దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. దాన్ని తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గిపోతుంది.

బ్రౌన్ పేపర్
అలాగే ఒక బ్రౌన్ పేపర్ ను తీసుకుని దాన్ని వైట్ వెనిగర్ లో కాసేపు ఉంచాలి. తర్వాత దాన్ని మీ నుదుటిపై కొద్దిసేపు పెట్టుకోండి. కొద్దిసేపట్లోనే మీ తలనొప్పి పోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
