For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ డీ లోపిస్తే అవన్నీ వీక్ అయిపోతాయి.. ఇలా చేస్తే సరి

|

కొందరికి తరుచూ కాళ్లు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నడుం మొత్తం కూడా పట్టేస్తూ ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళల్లో ఉంటుంది. అయితే ఇది డి విటమిన్ లోపం వల్లే వస్తుంది. దీంతో బాగా నీరసానికి గురవుతారు.కేవలం మహిళల్లలోనే కాకుండా పురుషుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అయితే యవ్వనంలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

కోలి కాల్సి ఫెరాల్‌

డి విటమిన్ లోపం అంటూ ఉంటాం. కానీ అసలు అది ఏర్పడడానికి కారణం చాలా మందికి తెలియదు.ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సి ఫెరాల్‌ అనే ఆసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారినపడతాం. విటమిన్ డి. దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సూర్యకాంతిలో రోజూ కొంత సేపు ఉంటే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం.

చ‌ర్మం కిందే విట‌మిన్ డి త‌యారీ

చ‌ర్మం కిందే విట‌మిన్ డి త‌యారీ

సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

విట‌మిన్ డి ల‌భించే ఆహారాలు

విట‌మిన్ డి ల‌భించే ఆహారాలు

విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

అనారోగ్య స‌మ‌స్య‌లు

అనారోగ్య స‌మ‌స్య‌లు

విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీర నిరోధక శక్తి తగ్గుతుంది

శరీర నిరోధక శక్తి తగ్గుతుంది

దీంతోపాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం. నిత్యం సూర్యకాంతిలో కొంత సేపు ఉండడం లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విటమిన్‌ను పొంది తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Most Read : అనుకరించడంలో ఈ 5 రాశుల వారిని ఎవరూ మించలేరు, మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

అనారోగ్యాలు చుట్టుముడతాయి

అనారోగ్యాలు చుట్టుముడతాయి

ఇక శరీరంలో విటమిన్ డి లోపిస్తే అనారోగ్యాలు చుట్టుముడతాయి. విటమిన్ డి లోపం వల్ల మానసిక స్థితిలో తేడా ఏర్పడడం. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడా రావడం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరగడం, హృదయ, మూత్రపిండాల జబ్బులు వంటివి వచ్చే అవకాశాలున్నాయి.

కండరాల్లో నొప్పి

కండరాల్లో నొప్పి

మహిళల్లో మెనో పాజ్ తరువాత సహజంగానే శరీరం క్యాల్షియంను శోషించుకోదు. విట మిన్ డి లోపం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. క్యాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగు తుంది. కండరాల్లో నొప్పి, బలహీనత వంటివి ఏర్పడతాయి. పిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది.

చిన్నచిన్న మార్పులు అవసరం

చిన్నచిన్న మార్పులు అవసరం

విటమిన్-డి భర్తీకి సప్లిమెంట్లు వేసుకునే బదులుగా ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా విటమిన్ డి ఎండలో లభిస్తుంది. ఎండతో పాటు ఆహారంలో కింది వాటిని చేర్చుకుంటే లోపాన్ని నివారించవచ్చు...

చేపల్లో

చేపల్లో

ఆయిలీ ఫిష్, సాల్మన్, ట్రాట్, ట్యూనా, మ్యాకెరల్, ఈల్ వంటి నూనె కలిగిన చేపల్లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. తాజా చేపలు లభించని పక్షంలో క్యాన్లలో లభించే ట్యూనా, సొర చేపలు తీసుకున్నా ఫలితం ఉంటుంది. పోర్టొబెల్లో మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా విట మిన్-డి పొందవచ్చు. వెజిటేరియన్లు వెంటనే వీటిని తీసుకోవడం మొదలుపెట్టవచ్చు.

Most Read : ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

పాలు

పాలు

ఇప్పుడు లభించే పాలల్లో చాలా వరకు విటమిన్-డి ఫార్టిఫైడ్ ఉంటున్నా యి. ప్రతి రోజు గ్లాసు చొప్పున పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా విటమిన్-డిని పొందవచ్చు.

గుడ్డులోని పచ్చసొన

గుడ్డులోని పచ్చసొన

సాధారణంగా గుడ్డులోని పచ్చసొనను ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు, కాని దీన్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. దీన్లోనే విటమిన్-డి కూడా అధికంగా లభిస్తుంది. గుడ్డులో విటమిన్-డి తో పాటు పొటాషియం, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి-12, విటమిన్ బి-6, క్యాల్షియం, ఐరన్ లభిస్తాయి.

మరిన్ని ఆహార పదార్థాలు

మరిన్ని ఆహార పదార్థాలు

చేపలు, బీఫ్ లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. డి-విటమిన్ లోపించిన వారిలో తరచుగా ఒళ్లు విరుచుకోవడం, బాడీ పెయిన్స్, నిస్సత్తువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్ తీసుకుంటే అన్నీ సర్దుకుంటాయి.

డి-విటమిన్ లోపించే అవకాశాలు

డి-విటమిన్ లోపించే అవకాశాలు

అయితే, ఎండ బారిన పడకుండా, హాయిగా నీడపట్టున ఉంటున్నామనో, ఏసీలో కూర్చుని ఎంచక్కా పనిచేసుకుంటున్నామనో సంతోషించే వారు లేకపోలేదు. ముఖ్యంగా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసు గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిష్ట్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు డి-విటమిన్ లోపించే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

Most Read : ఒక్కో రాశి వారికి ఒక్కో వ్యసనం ఉంటుంది.. మీ రాశి ప్రకారం మీ వ్యసనం ఏమిటో తెలుసుకోండి

ఇన్సులిన్‌పై ప్రభావం

ఇన్సులిన్‌పై ప్రభావం

పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం.

విటమిన్-డి కొరత

విటమిన్-డి కొరత

రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కోవడం, లేచాక ఆఫీసుకో, కాలేజికో టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం వల్లే భారతీయుల్లో విటమిన్-డి కొరత ఏర్పడుతోంది.

మనదేశ జనాభాలో 84 శాతం మందిలో విటమిన్-డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయ కోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచూ శరీరంలో విటమిన్-డి నిల్వలను పరీక్షించుకోవాలి.

సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి

సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి

రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వాళ్లు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్-డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి బద్ధకాన్ని వదిలి రోజూ కొంత విటమిన్-డిని అందించండి.

ఎముకల ఆరోగ్యానికి

ఎముకల ఆరోగ్యానికి

విటమిన్‌ డి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. రక్తనాళాలను కాపాడుతుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగా జరిగేలా చూస్తుంది. అందుకే శారీరక శ్రమ తగ్గిపోయి రకరకాల జీవనశైలి సమస్యలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో విటమిన్‌ డి ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఆకలి మందగించటం

ఆకలి మందగించటం

దీని లోపంతో ఆకలి మందగించటం, బరువు తగ్గటం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ వంటి సమస్యలు వేధిస్తాయి. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. విటమిన్‌ డి లోపంతో తలనొప్పి తలెత్తుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతుండటం గమనార్హం. విటమిన్‌ డి స్థాయులు 20 ఎన్‌జీ/ఎంఎల్‌ నుంచి 50 ఎన్‌జీ/ఎంఎల్‌ వరకు ఉండటాన్ని నార్మల్‌గా భావిస్తారు. దీని కన్నా తగ్గితే తలనొప్పి రావటం ఎక్కువవుతున్నట్టు ఫిన్‌లాండ్‌ అధ్యయనం పేర్కొంటోంది.

తలనొప్పి రావటం

తలనొప్పి రావటం

విటమిన్‌ డి స్థాయులు 17.6 ఎన్‌జీ/ఎంల్‌ గలవారితో పోలిస్తే 15.3 ఎన్‌జీ/ఎంఎల్‌ గలవారు కనీసం వారానికి ఒకసారి తలనొప్పి బారినపడుతున్నట్టు బయటపడింది. విటమిన్‌ స్థాయులు తగ్గుతున్నకొద్దీ తలనొప్పి రావటం కూడా పెరుగుతూ వస్తోంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలక పోవటం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆహారం ద్వారా చాలా తక్కువ

ఆహారం ద్వారా చాలా తక్కువ

నిజానికి విటమిన్‌ డి- ఆహారం ద్వారా చాలా తక్కువగా లభిస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు దీన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. అందువల్ల రోజూ చర్మానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో తలనొప్పి ఒక్కటే కాదు. ఇతరత్రా జబ్బులనూ నివారించుకోవచ్చు.

ఎముకలు గట్టిదన్నాన్ని కోల్పొతాయి

ఎముకలు గట్టిదన్నాన్ని కోల్పొతాయి

డీ విటమిన్ బాడీలో సరిగ్గా ఉంటే ఆ యాసిడ్ కావాల్సినంత అందుతుంది. ఒక వేళ లోపిస్తే ఎముకలు గట్టిదన్నాన్ని కోల్పొతాయి. అందువల్ల సాధారణంగా మన బాడీలో ఈ ఆసిడ్ అదంతటకు అదే విడుదలవుతుంది.

డీ విటమిన్ లోపించింది

డీ విటమిన్ లోపించింది

అయితే కాసేపు ఎండలో ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్ గా కోలి ఆసిడ్‌ బాడీలో విడుదల అవుతుంది. కానీ కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడేవారికి ఇది విడుదల కాదు. దీంతో డీ విటమిన్ లోపించింది అని డాక్టర్లు చెబుతారు.

ఎముకలు చాలా వీక్

ఎముకలు చాలా వీక్

డి విటమిన్‌ లోపం ఎక్కువగా ఉంటే వల్ల చాలా సమస్యలకు గురవుతారు. ఎముకలు చాలా వీక్ అయిపోతాయి. ఊరికే విరిగిపోతాయి.

Most Read : కొత్త ఇజం.. భయంకరమైన నిజాలు!

చిన్నపిల్లల్లో

చిన్నపిల్లల్లో

తగినంత కాల్షియం ఎముకలకు అందకున్నా కూడా ఇలాంటి సమస్యలకు గురవుతారు. ఇక ముఖ్యంగా చిన్నపిల్లల్లో విటమిన్ డీ లోపించకుండా జాగ్రత్తపడాలి. వారిని ఉదయంసాయంత్రం వేళ్లలో ఎండలో ఉంచడం మంచిది.

కాల్షియం ఎక్కువగా ఉంటే ఫుడ్స్

కాల్షియం ఎక్కువగా ఉంటే ఫుడ్స్

ఇక పెద్దవాళ్లలో ఇలాంటి సమస్య తలెత్తితే కాల్షియం ఎక్కువగా ఉంటే ఫుడ్స్ తినాలి. పాలు పండ్లతో పాటు, పాలకూరను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డి విటమిన్‌ మహిళల్లో ఎక్కువగా లోపించడానికి చాలా కారణాలున్నాయి.

బలహీనంగా మారుతారు

బలహీనంగా మారుతారు

రుతుక్రమంలో బాడీ నుంచి రక్తం పోవడం, అలాగే గర్భం దాల్చాక బిడ్డకు కావాల్సిన కాల్షియం కూడా తల్లి నుంచి అందడం వల్ల చాలా మంది మహిళలు బాగా బలహీనంగా మారుతారు.

కాసేపు ఎండలో ఉండాలి

కాసేపు ఎండలో ఉండాలి

విటమిన్ డీ తగ్గితే ఆటోమేటిక్ గా కాల్షియం లోపం ఏర్పడుతుంది. అలాంటి వారు ఎక్కువగా పాల సంబంధిత పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అలాగే కాసేపు ఎండలో ఉండాలి.

చర్మం కింద ఉండే కొన్ని కణాలు

చర్మం కింద ఉండే కొన్ని కణాలు

సూర్యరశ్మి శరీరంపై పడ్డప్పుడు చర్మం కింద ఉండే కొన్ని కణాలు విటమిన్ డీని స్వయంగా ఉత్పత్తి చేస్తాయి. తర్వాత దాన్ని అవసరమైన మేరకు బాడీ

ఉపయోగించుకుంటుంది.

Most Read : పార్కిన్సన్స్ వ్యాధి వణుకుడు రోగం ఎలా వస్తుందో తెలుసా? రోజూ కాఫీ తాగితే ఆ భయంకరమైన వ్యాధి బారిన పడం

సూర్మరశ్మి ద్వారా కంటే

సూర్మరశ్మి ద్వారా కంటే

కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా విటమిన్ డీ బాడీకి అందుతుంది. అయితే సూర్మరశ్మి ద్వారా కంటే ఎక్కువగా ఎందులోనూ విటమిన్ డీ దొరకదు.

చీజ్

చీజ్

చేపలతో పాటు గుడ్లు, పాలు, పుట్టగొడుగుల్లో విటమిన్ డీ బాగా ఉంటుంది. ముఖ్యంగా చీజ్‌ ఎక్కువగా తీసుకుంటే విటమిన్ డీ బాడీకి సమృద్ధిగా అందుతుంది. చీజ్ వల్ల బాడీకి కావాల్సినంత కాల్షియం కూడా అందుతుంది.

పుట్ట గొడుగులు

పుట్ట గొడుగులు

పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. రోజూ పుట్ట గొడుగులను తింటే విటమిన్ డీ లోపం అనేదే ఉండదు.

కండరాల బలహీనత

కండరాల బలహీనత

ఎలాంటి కారణం లేకుండా కండరాల పరిమాణం తగ్గడం, అనవసరంగా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి సంకేతం. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది.

డిప్రెషన్

డిప్రెషన్

విటమిన్ డి లోపిస్తే డిప్రెషన్ వేధిస్తుంది. అనవసరంగా డిప్రెషన్ కు లోనవడం, చిన్న విషయానికి ఎక్కువగా చింతించడం వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి.

నొప్పి

నొప్పి

ఎక్కువగా నొప్పులకు గురవుతున్నారంటే జాగ్రత్త వహించడం మంచిది. ఎన్ని రోజులైనా.. తలనొప్పి, కండరాల నొప్పి వంటివి తగ్గడం లేదంటే.. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

బీపీ

బీపీ

విటమిన్ డీ లోపిస్తే.. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధానం. ఒక వేళ బీపీ పెరిగిందని అనిపించినా.. చిన్న విషయాలకూ చిరాకు పడుతున్నా.. విటమిన్ డిపై శ్రద్ధ వహించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలి.

చిరాకు

చిరాకు

చీటికి మాటికి చిరాకులకు, కోపానికి గురవుతున్నారా.. అయితే మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. విటమిన్ డి లోపిస్తే.. మెదడులో మానసిక ఒడిదుడులపైపై ప్రభావం పడుతుంది.

మత్తుగా

మత్తుగా

మత్తుగా ఉన్నట్టుండి అలసిపోవడం, ఎప్పుడూ నిద్రపోవాలని ఫీలవడం వంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపానికి సంకేతాలు. విటమిన్ డి సరైన స్థాయిలో శరీరానికి అందితే.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.

కండరాల నొప్పి

కండరాల నొప్పి

కండరాల నొప్పి విటమిన్ డి లోపించినప్పుడు సాధారణంగా కండరాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్య సూర్యకిరణాలు తగలకపోవడం వల్లే తలెత్తుతుందట. విటమిన్ డి లోపించినప్పుడు శరీరానికి క్యాల్షియం అందకపోవడం వల్ల.. ఒళ్లు నొప్పులు బాధిస్తాయి. అలసట శరీరానికి శక్తి కావాలంటే.. విటమిన్ డి అవసరమని మీకు తెలుసా? అవును విటమిన్ డి లోపిస్తే.. ఎన్ని నియమాలు పాటించినా, విశ్రాంతి తీసుకున్నా తరచుగా అలసిపోతుంటారు. ఇలా ఎక్కువగా అలసిపోతుంటే విటమిన్ డి లోపించిందిమో చెక్ చేసుకోండి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాసేపు ఎండలో గడపడం మంచిది.

భావోద్వేగాలు

భావోద్వేగాలు

భావోద్వేగాలు ఉన్నట్టుండి మారిపోవడానికి కూడా విటమిన్ డి లోపమే కారణం. విటమిన్ డి శరీరానికి కావాల్సినంత అందినప్పుడు.. సెరటోనిస్ హార్మోన్ విడుదలవుతుంది. అది లోపించినప్పుడు దాని ఉత్పత్తి తగ్గి.. మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మూడ్ సడెన్ గా మారిపోతూ ఉంటుంది. బరువు పెరగడం విటమిన్ డి శరీరానికి సరిపడినంత అందితే.. కొవ్వు క్రమంగా కరుగుతూ వస్తుంది. అధిక బరువును తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి బరువు పెరుగుతున్నప్పుడు ఒకసారి విటమిన్ డి లోపం ఉందేమో చూసుకోవడం బెటర్.

తలలో చెమట చికాకు పెడుతుంటే

తలలో చెమట చికాకు పెడుతుంటే

విటమిన్ డి లోపిస్తే.. మరో లక్షణం ఇబ్బందిపెడుతుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నా.. తలలో చెమట పట్టడం, దురదగా, చిరాకుగా అనిపించం విటమిన్ డి లోపంగా గుర్తించాలి. సొరొయాసిస్ సొరియాసిస్ ప్రధానంగా విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్య. చర్మంపై పొక్కులు, దురదగా అనిపించడం సొరియాసిస్ గా గుర్తించాలి. దీన్ని నివారించాలంటే.. ఎండ శరీరంపై పడేలా జాగ్రత్త తీసుకోవాలి. చూశారుగా ఇవి విటమిన్ డి లోపించినప్పుడు కనపడే లక్షణాలు. ఈ సమస్యలు గుర్తిస్తే.. పాలు, బాదం, ఆకుకూరలు, పళ్లతోపాటు.. సూర్యరశ్మి శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

English summary

Vitamin D Deficiency Causes, Symptoms, Risks and Rich Foods

vitamin d deficiency causes common symptoms health risks and vitamin d rich foods
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more