For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవొచ్చు, మూత్రంలో వాసన వస్తే?

పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ప్రతి దానికీ డాక్టర్ దగ్గరకి వెళ్లి టెస్టులు చేయించుకోలేం. మీ మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవొచ్చు, మూత్రంలో వాసన వస్తే?

|

పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ప్రతి దానికీ డాక్టర్ దగ్గరకి వెళ్లి టెస్టులు చేయించుకోలేం. ఇలాంటి సమయాల్లో మన ఆరోగ్యం బాగుందో లేదో తెలుసుకోవడానికి డబ్బు, కాలం వృథా కాకుండా ఓ చిన్న చిట్కాతో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
దీనికి పెద్దగా సమయం కూడా అవసరం లేదు. కావలసిందల్లా అబ్జర్వేషన్ మాత్రమే. మీ మూత్రాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలు.

మీ మూత్రం కలర్ మీ సమస్యను ఇట్టే చెప్పేస్తుంది. యూరిన్ రంగు ఆధారంగా మీకేం సమస్య ఉందో ఓ అంచనాకు రావచ్చు. నీరు సరిగ్గా తాగకపోతేమూత్రం తక్కువగా వస్తుంటుంది. అలాగే కాస్త రంగు కూడా మారొచ్చు. నీళ్లు తాగితే ఇవన్నీ సర్దుకుంటాయి. అయితే ఇతరత్రా కారణాలతోనూ మూత్రం రంగు, వాసన మారిపోతుంటాయి. వీటి ఆధారంగా కొన్ని సమస్యలనూ అంచనా వేయొచ్చు.

పసుపు లేదా తెలుపు రంగులో

పసుపు లేదా తెలుపు రంగులో

సాధారణంగా మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో వస్తుంది. మరికొందరికి మాత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. ఈ రంగు ముదురు గోధుమ రంగు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇలా డార్క్ రంగులో వస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి, మూత్ర పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. మనిషి అనారోగ్యం బారినపడితేనే ఇలా డార్క్ రంగులో మూత్రం వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మూత్రం డార్క్ కలర్‌లో వస్తే ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి.

మూత్రం ఎరుపు

మూత్రం ఎరుపు

శక్తికి మించి వ్యాయామం చేయటం లేదా కొన్నిరకాల మందులతో మూత్రం ఎర్రగా రావొచ్చు. ఇది హానికరమైందేమీ కాదు. అయితే మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ జబ్బు, ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బు, మూత్రాశయ క్యాన్సర్‌, సికిల్‌సెల్‌ రక్తహీనత, మూత్రమార్గంలో అడ్డంకి వంటి సమస్యల్లోనూ మూత్రంలో రక్తం పడొచ్చు. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు.

పసుపుగా, నీలంగా

పసుపుగా, నీలంగా

కామెర్ల వంటి కాలేయం సమస్యల్లో మూత్రం పసుపురంగులో రావటం తెలిసిందే. అయితే కొన్ని రకాల మందులు, పదార్థాల మూలంగానూ మూత్రం రంగు మారొచ్చు. ఉదాహరణకు.. బీట్‌రూట్‌ తిన్నప్పుడు మూత్రం ఎర్రగా లేదా ముదురు వూదారంగులో మూత్రం వస్తుంటుంది. కొన్నిరకాల యాంటాసిడ్‌ మందులతో నీలంగానూ, కీమోథెరపీ మందులతో నారింజ రంగులోనూ రావొచ్చు. సూక్ష్మరక్తనాళాల వాపు (వ్యాస్కులైటిస్‌) తలెత్తితే మూత్రం టీ రంగులో కనబడొచ్చు.

వాసన రావటం

వాసన రావటం

ఒంట్లో నీటిశాతం తగ్గటం (డీహైడ్రేషన్‌) లేదా విటమిన్‌ బి6 తీసుకోవటం మూలంగా మూత్రం వాసన ఘాటుగా మారుతుంది. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు. తగినంత నీరు తాగితే, విటమిన్‌ ప్రభావం తగ్గితే తిరిగి మామూలుగా అయిపోతుంది. అయితే మధుమేహం, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, కాలేయ వైఫల్యంలోనూ మూత్రం వాసన మారిపోయే అవకాశముంది. కాబట్టి వాసనలో ఏదైనా తేడా అనిపిస్తే జాగ్రత్తగా గమనించటం మేలు.

నురగ నురగగా

నురగ నురగగా

మూత్రంలో సుద్ద (అల్బుమిన్‌) స్థాయులు పెరిగితే నురగ కనబడొచ్చు. ఇది మధుమేహానికి తొలి సంకేతం కావొచ్చు. కిడ్నీల వడపోత ప్రక్రియ దెబ్బతిన్నా మూత్రం నురగగా రావటంతో పాటు రక్తం కూడా పడొచ్చు.

బంగారు రంగులో

బంగారు రంగులో

మూత్రం లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటే ఆరోగ్యం బాగానే ఉన్నట్టు. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మీరు తక్కువ నీరు తాగుతున్నారని లేదా మీ శరీరంలో తగినంత నీరు లేదని అర్థం. మూత్రం నారింజ రంగులో కనుక ఉంటే కాలేయం లేదా పిత్తాశయ సమస్య కావచ్చు.

ముదురు పసుపు

ముదురు పసుపు

కాలేయం సమస్య ఉన్నవాళ్లలో కొన్ని సార్లు మూత్రం ముదురు పసుపు రంగులో కూడా ఉంటుంది. సాధారణంగా మనం క్యారెట్, బీట్ రూట్ ఎక్కువ తింటే మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. అవేమీ తీసుకోకుండానే మూత్రం రంగు గులాబీ లేదా ఎరుపుగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.

8 సార్లు మూత్రానికి వెళ్లాలి

8 సార్లు మూత్రానికి వెళ్లాలి

మీరు విటమిన్ బి2, యాంటి బయోటిక్స్ వంటి మందులు వాడుతుంటే వాటి వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. మనిషి రోజుకి సరాసరిన కనీసం 8 సార్లు మూత్రానికి వెళ్లాలి. గర్భిణిలు, వృద్ధులు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. ఇలాంటివేవి లేకుండానే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తే మీకు యూరినరి సమస్యలు, కిడ్నీ సమస్యలు లాంటివి సమస్యలుండొచ్చు. కాబట్టి వెంటనే డాక్టరుని సంప్రదించండి.

ఆరెంజ్‌

ఆరెంజ్‌

యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ డ్ర‌గ్స్‌, కిమోథెర‌పీ డ్ర‌గ్స్‌, లాక్సేటివ్ డ్ర‌గ్స్‌ను వాడితే మూత్రం రంగు ఆరెంజ్ క‌ల‌ర్‌లో వ‌స్తుంది. దీంతోపాటు విట‌మిన్ బి2, బీటా కెరోటీన్ ఎక్కువ‌గా ఉండే క్యారెట్ వంటి ఆహారాల‌ను తిన్నా మూత్రం రంగు ఇలా మారుతుంది. అయితే ఇవేవీ కార‌ణాలు కాక‌పోతే మీరు నీటిని స‌రిగ్గా తాగ‌డం లేద‌ని అర్థం. నీటిని త‌గినంత తాగ‌క‌పోయినా మూత్రం రంగు ఆరెంజ్‌లోకి మారుతుంది. క‌నుక నీటిని ఎక్కువ‌గా తాగాలి. ఇక ఇవే కాకుండా లివ‌ర్‌, కంటి స‌మ‌స్య‌లు ఉన్నా అలా మూత్రం ఆరెంజ్ రంగులో వ‌స్తుంది. క‌నుక వీటి ప‌ట్ల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.

పింక్ లేదా ఎరుపు

పింక్ లేదా ఎరుపు

ఎరుపు లేదా పింక్ రంగులో ఉండే ఆహారాల‌ను తింటే మూత్రం కూడా ఇదే రంగులో వ‌స్తుంది. దీనికి చింతించాల్సిన ప‌నిలేదు. ఇలా కాకుండా వేరే కార‌ణాల వ‌ల్ల అయితే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. కిడ్నీ, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు, కిడ్నీ స్టోన్లు, క్యాన్స‌ర్‌, ట్యూమ‌ర్లు, బ్ల‌డ్ క్లాట్స్‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు ఉన్నవారిలో మూత్రం ఈ రంగులో వ‌స్తుంటుంది.

గ్రీన్ లేదా బ్లూ

గ్రీన్ లేదా బ్లూ

మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు, కిడ్నీ స్టోన్లు ఉంటే మూత్రం ఒక్కోసారి గ్రీన్ లేదా బ్లూ క‌ల‌ర్‌లోనూ వ‌స్తుంటుంది. డీహైడ్రేషన్‌, క‌డుపు నొప్పి, ర్యాషెస్‌, మూర్ఛ, ట్యూమ‌ర్లు వంటి స‌మ‌స్య‌లు ఉంటే మూత్రం బ్రౌన్ రంగులో వ‌స్తుంది.

పార‌ద‌ర్శ‌కంగా

పార‌ద‌ర్శ‌కంగా

మూత్రం రంగు మ‌రీ పార‌ద‌ర్శ‌కంగా ఉంటే మీరు నీరు అవ‌స‌రానికి మించి తాగుతున్నార‌ని అర్థం చేసుకోవాలి. ఇలా జ‌రిగితే ఒంట్లో ఉన్న అవ‌స‌ర‌మైన మిన‌ర‌ల్స్‌, సాల్ట్స్ కోల్పోవాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌న శ‌రీరానికి అవ‌స‌రం ఉన్నంత మేర మాత్ర‌మే నీటిని తాగాలి.

వాపు

వాపు

బైలిరుబిన్, కొలెస్ట్రాల్ రెండూ కలసి గాల్ స్టోన్స్‌గా మారుతాయి. అయితే ఇవి అంత సమస్య కాకపోయినా కొన్ని సార్లు మాత్రం గాల్ బ్లాడర్ డక్ట్‌ను బ్లాక్ చేస్తాయి. దీంతో ఆ ప్రదేశం వాపునకు లోనవుతుంది. ఈ క్రమంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. అలాగే మూత్రం కూడా డార్క్ కలర్‌లో వస్తుంది. ఇలాంటి వారు నిత్యం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్‌కు‌గాను సర్జరీ చేయించుకోవాలి.

డార్క్ బ్రౌన్

డార్క్ బ్రౌన్

పచ్చ కామెర్లు ఉన్నవారిలోనూ మూత్రం రంగు మారుతుంది. మూత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. దీని వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తుంటాయి. దీనికి తగిన వైద్యం చేయించుకుంటే పచ్చకామెర్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. మూత్రం ముదురు గోధుమ రంగు (డార్క్ బ్రౌన్ కలర్)లో వస్తుంటే అందుకు లివర్ వ్యాధులు కారణమవుతాయి. బైలిరుబిన్ అనే ద్రవం ఎర్ర రక్తకణాలతో కలిస్తేనే మూత్రం ఇలా వస్తుంది. మూత్రం ఈ రంగులో వస్తుంటే అలాంటి వారికి లివర్ వ్యాధులు ఉన్నట్లు గ్రహించాలి. ఇలాంటి వారు లివర్ ఫంక్షన్ సరిగా ఉందో లేదో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

English summary

what the color of your urine says about your health

what the color of your urine says about your health
Desktop Bottom Promotion