వరల్డ్ కిడ్నీ డే: మీరు తెలుసుకోవలసిన కిడ్నీ సమస్యల లక్షణాలివే

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఈ రోజు వరల్డ్ కిడ్నీ డే. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధులకి సంబంధించిన లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా, కిడ్నీ వ్యాధుల లక్షణాలను సులభంగా గుర్తించలేరు.

కిడ్నీస్ అనేవి లోయర్ బ్యాక్ లో ఉంటాయి. వెన్నుకి ఇరువైపులా రెండు కిడ్నీలుంటాయి. శరీరంనుంచి టాక్సిన్స్ ను తొలగించడం కిడ్నీల ప్రాధమిక విధి. టాక్సిన్స్ ను బ్లాడర్ లో కి పంపిస్తుంది. యూరినేట్ చేస్తున్నప్పుడు ఈ టాక్సిన్స్ తొలగిపోతాయి.

World Kidney Day: Symptoms Of Kidney Problems You Should Know

కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? రక్తం నుంచి వ్యర్థాలను తొలగించే సామర్థ్యం కిడ్నీలలో తొలగిపోయినప్పుడు కిడ్నీ లు ఫెయిల్ అయ్యాయని అర్థం. వివిధ దీర్ఘకాల వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కిడ్నీల పనితీరును దెబ్బతీస్తాయి.

దీర్ఘకాల కిడ్నీ వ్యాధుల లక్షణాలను మనం గుర్తించలేకపోవచ్చు. ఈ లక్షణాలు అత్యంత సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. వీటిని ఒకసారి పరిశీలిద్దాం.

1. ఎల్లప్పుడూ అలసటగా ఉండటం

1. ఎల్లప్పుడూ అలసటగా ఉండటం

ఆరోగ్యకరమైన కిడ్నీలు ఎరిత్రోపొయిటిన్ లేదా EPO అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ ని క్యారీ చేసే ఆక్సిజెన్ ని తయారుచేయమని శరీరానికి సూచిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, కిడ్నీలు EPOలను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందువలన శరీరం త్వరగా అలసిపోతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండటం వలన ఇది జరుగుతుంది.

2. శ్వాస ఆడక పోవడం

2. శ్వాస ఆడక పోవడం

కిడ్నీలకు సంబంధించిన శ్వాస సమస్యలు రెండు రకాలు. శరీరంలోని పేరుకుపోయిన అదనపు ద్రవాలు లంగ్స్ లో కి చేరతాయి, అనీమియా వలన శరీరానికి ఆక్సిజన్ తగినంత ఉండదు. ఈ రెండు సమస్యల వలన శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి.

3. కళ్ళు తిరగడంతో పాటు బలహీనత

3. కళ్ళు తిరగడంతో పాటు బలహీనత

కిడ్నీ ఫెయిల్యూర్ కి సంబంధించిన అనీమియాలో మెదడుకి తగినంత ఆక్సిజన్ లభించదు. ఇది మూర్ఛకు, కళ్ళు తిరగడానికి అలాగే బలహీనతకు దారితీస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

4. కాళ్ళు చేతులలో వాపులు:

4. కాళ్ళు చేతులలో వాపులు:

కాళ్ళు చేతులలో వాపులు కనిపిస్తే, కిడ్నీ ఫెయిల్యూర్ కి అవి సూచనలు కావచ్చు. కిడ్నీ ఫెయిల్ అయితే శరీరంనుంచి అదనపు ఫ్లూయిడ్స్ అనేవి తొలగిపోవు. ఇవి శరీరంలో పేరుకుపోతాయి. అందువలన, కాళ్ళలో, చేతులలో, చీలమండలలో వాపులు కనిపించవచ్చు.

5. దురద:

5. దురద:

రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడానికి కిడ్నీలు తోడ్పడతాయి. అయితే, కిడ్నీ ఫెయిల్యూర్ తలెత్తినప్పుడు, రక్తంలో వ్యర్థాలు పేరుకునే ఉంటాయి. ఇవి తీవ్రమైన దురదకు దారితీస్తాయి. ఇటువంటి లక్షణాలను మీరు గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్న సంగతి మర్చిపోకండి.

6. ముఖం ఉబ్బుట

6. ముఖం ఉబ్బుట

కిడ్నీ వ్యాధులకు గురైనప్పుడు ముఖంలో వాపు కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వలన శరీరం నుంచి అదనపు ద్రవాలు తొలగిపోవు. అందువలన, శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. ముఖంలో వాపు కనిపిస్తుంది. ఈ లక్షణం ఎదురైనప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యున్ని సంప్రదించండి.

7. తరచూ యూరినేట్ చేయడం

7. తరచూ యూరినేట్ చేయడం

ప్రతి రాత్రి ఎక్కువగా యూరినేట్ చేస్తుంటే కిడ్నీ వ్యాధికి గురయ్యారేమో తెలుసుకోవాలి. ఇది కిడ్నీ వ్యాధి లక్షణం. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు, తరచూ యురినేట్ చేస్తారు. లేదా యురినేట్ చేయడానికి ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు.

8. మూత్రంలో నురుగు:

8. మూత్రంలో నురుగు:

మూత్రంలో నురుగు కనిపిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ కి సంబంధించిన లక్షణంగా దీనిని భావించి వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. కిడ్నీ ఫెయిల్యూర్ తలెత్తినప్పుడు, యూరిన్ రంగు మారుతుంది. నురుగు కనిపిస్తుంది. మూత్రంలో సాధారణంగా లభించే ప్రోటీన్ అధికంగా కనిపిస్తుంది.

9. వికారం:

9. వికారం:

కిడ్నీ వ్యాధులకు సంబంధించిన మరొక లక్షణం వికారం. కిడ్నీ ఫెయిల్యూర్ సంభవించినప్పుడు కిడ్నీలకు శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగించే సామర్థ్యం తగ్గిపోతుంది.

English summary

World Kidney Day: Symptoms Of Kidney Problems You Should Know

Kidney failure occurs when your kidneys lose the ability to filter out waste from the blood. The symptoms of kidney disease include urinating more often, feeling tired all the time, having shortness of breath, dizziness, a swollen face, swelling in the ankles and hands, etc. On this World Kidney day, it is important we are aware of these symptoms.
Story first published: Friday, March 9, 2018, 8:00 [IST]