Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఈ రాశులకు చెందిన వారు తమ రిలేషన్షిప్ కు సంబంధించిన చిన్న చిన్న విషయాలతోనే సంతృప్తి పడతారు.
ఈ రాశులకు చెందిన వారు తమ రిలేషన్షిప్ కు సంబంధించిన చిన్న చిన్న విషయాలతోనే సంతృప్తి పడతారు.
ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తులు జీవితంలోని చిన్న చిన్న విషయాలతో సర్ధుకుపోతారని ఆస్ట్రాలజీ చెప్తోంది. వీరికి టాక్సిక్ రిలేషన్ షిప్ నుండి బయటపడటమనేది ఎంతో కష్టతరమైన విషయం. అందువలన, రిలేషన్ షిప్ లో అనేక విషయాలలో వీరు రాజీ పడుతూ ఉంటారు.
మిగతా వారి కంటే ఇబ్బందులను ఎదుర్కొనడం వీరికి కష్టతరమైన విషయం. అందువలన, చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోతూ ఉంటారు.
ఈ ఆర్టికల్ లో చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోయి తమ భాగస్వామి నుంచి మరేదీ ఆశించకుండా ఉండే స్వభావం కలిగిన వ్యక్తులు ఏ రాశికి చెందినవారై ఉంటారో ఇప్పుడు చూద్దాం.
ఈ రాశిచక్రాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20
వీరు నమ్మకస్తులు. రిలేషన్ షిప్ ని పటిష్టంగా ఉంచుకోవడానికి వీరు ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రిలేషన్ షిప్ లోని అస్థిరతను తొలగించుకునేందుకు వీరు శాయశక్తులా ప్రయత్నిస్తారు. రిలేషన్ షిప్ లో తమ భాగస్వామిపట్ల నమ్మకమైన వైఖరితో ప్రవర్తిస్తారు. భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. గతంలోని రిలేషన్ షిప్ విషయంలో జరిగిన ఓ పొరపాటు వలన వీరు మరింత నమ్మకస్తులుగా మారతారు. తమ భాగస్వామిని వెనకేసుకొని వస్తారు. భాగస్వామి పట్ల అమితమైన ప్రేమను అలాగే ఆప్యాయతను కురిపిస్తారు.
తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23
తులారాశికి చెందిన వారు తమ రిలేషన్ షిప్ ను నిలబెట్టుకునేందుకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తారు. తమకు రిలేషన్ షిప్ ద్వారా కావలసిన మద్దతును అలాగే బాలన్స్ ను ఈ విధంగా పొందేందుకు తాపత్రయ పడతారు. వీరు, రిలేషన్ షిప్ ను ఎండ్ చేయడాన్ని బాలన్స్ కోల్పోయినట్టుగా భావిస్తారు. తమ భాగస్వామికి మనసా వాచా కర్మణా అంకితమైపోయి ఉంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే వీరు సంపూర్ణమైన వ్యక్తిగా భావింపబడతారు. అయితే, రిలేషన్ షిప్ కి కమిట్ అయ్యాక ప్రతి విషయంలోనూ తమ భాగస్వామి సూచనలు లేకుండా ముందుకు వెళ్ళలేరు. అందువలన, వీరు తమ భాగస్వామిపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు.
మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20
వీరు సహజంగానే త్యాగ స్వభావం కలిగినవారు. వీరు మిగతా రాశిచక్రాల వ్యక్తుల కంటే త్యాగస్వభావం ఎక్కువగా ఉన్నవారు. వీరు నమ్మకాన్ని అలాగే ప్రేమను ఎక్కువగా నమ్ముతారు. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ఇష్టపడతారు. తమ సంతోషం కంటే ఇతరులు సంతోషంగా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరు ఊహా ప్రపంచంలో జీవిస్తారు. అందువలన తమ భాగస్వామికి చెందిన చెడు ప్రవర్తనను ఎక్కువగా పట్టించుకోరు. అందువలన, వీరి రిలేషన్ షిప్ లో గొడవలు ఎక్కువగా రావు. సర్దుకుపోయే స్వభావం వీరి సొంతం.



Click it and Unblock the Notifications
