For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ బిB3 వాస్తవాలు

|

విటమిన్ B3కి గల మరోపేరు నియాసిన్. మీ శరీరం ముఖ్యంగా మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఈ నియాసిన్ కీలకపాత్రను పోషిస్తుంది. వాస్తవానికి నియాసిన్ ఎన్నో ఇతర పాత్రలను కూడా పోషిస్తుంది. క్రమంగా శరీర జీవక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

పురుషుల జీవక్రియలకు 16 మిల్లీ గ్రాముల నియాసిన్ ఖచ్చితంగా అవసరమవుతుంది మరియు మహిళలకు రోజువారీ ఆహారం ద్వారా సుమారు 14 మిల్లీ గ్రాముల పోషకాలు అవసరమవుతాయి. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లుల అవసరాలు తరచుగా మారుతూ ఉన్న కారణాన, వైద్యుని సంప్రదించి మందులను వాడవలసి ఉంటుంది. వాస్తవానికి, వైద్యులు సాధారణ చెకప్ నిమిత్తం కొన్ని మందులను సూచిస్తుంటారు. ఆ మందులలో భాగంగా నియాసిన్ కూడా జోడించబడి ఉంటుంది.

కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి, వారి ఆహారం ద్వారా నియాసిన్ ఎక్కువ అవసరం కావచ్చు. అయితే, మీరు సప్లిమెంట్లను వాడాలని కోరుకుంటే, ఈ విటమిన్ మోతాదు ఎక్కువ కాకుండా, వైద్యుని సంప్రదించి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వినియోగించవచ్చు.

విటమిన్ B3 గురించిన వాస్తవాలు :

వాస్తవం #1

వాస్తవం #1

విటమిన్ B3 మూలాలుగా చికెన్ బ్రెస్ట్, కాలేయం, ఆకుకూరలు, గింజలు, ట్యూనా, ఆకుపచ్చ బఠానీలు, లీన్ రెడ్ మీట్ మరియు ఆస్పరాగస్ ఉన్నాయి. వీటిని తరచుగా మీ ఆహార ప్రణాళికలోనికి జోడించుకోవడం మంచిది.

వాస్తవం #2

వాస్తవం #2

నియాసిన్ కూడా జీర్ణ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని పెంచడానికి, మీ చర్మాన్ని ప్రకాశవంతముగా ఉంచడానికి, మరియు నాడీ వ్యవస్థ యొక్క కార్యాచరణకు కూడా సహాయపడుతుంది.

వాస్తవం #3

వాస్తవం #3

చర్మం చికాకుకు గురికాకుండా చూడడంలోనూ, జీర్ణ సమస్యలు తలెత్తకుండా, మరియు బలహీనమైన కండరాల సమస్యతో బాధపడుతున్న వారికి విటమిన్ B3 అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇది సమస్యల సంకేతాలను తగ్గించడంలోనే కాకుండా, లోపాన్ని కూడా తగ్గించగలదు. విటమిన్ b౩ లోపం కొన్ని శారీరిక ప్రతికూల లక్షణాలను చూపిస్తుంది కూడా.

వాస్తవం #4

వాస్తవం #4

విటమిన్ B3 చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనే కాకుండా, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి కూడా ఎంతో ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది. అంతేకాకుండా ఇది అథెరోస్క్లెరోసిస్ సమస్యను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

వాస్తవం #5

వాస్తవం #5

విటమిన్ B3 లోపం వలన లైంగిక సమస్యలు కూడా తలెత్తవచ్చు, ప్రధానంగా లిబిడో ప్రభావితం కావొచ్చు. క్రమంగా అంగస్తంభనల సమస్య కూడా ఏర్పడవచ్చు. లైంగిక ఆరోగ్యానికి శరీరానికి నియాసిన్ ఖచ్చితంగా అవసరమవుతుందని చెప్పబడింది.

వాస్తవం #6

వాస్తవం #6

కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లను శక్తిగా మార్చడంలో కూడా ఈ విటమిన్ B3 కీలక పాత్ర పోషిస్తుంది.

వాస్తవం #7

వాస్తవం #7

నియాసిన్ కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి కీలకంగా పనిచేస్తుందని చెప్పబడింది. కావున, విటమిన్ B3 అధికంగా ఉండే ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: health wellness
English summary

Sources Of Vitamin B3

Niacin is the other name of vitamin B3. Your body needs it mainly to control your cholesterol levels. In fact, niacin has many other roles to play. Read on...
Desktop Bottom Promotion