Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Eat Stop Eat: ఈ ఉపవాస పద్ధతితో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు
ఈట్ స్టాప్ ఈట్ అనే పద్ధతి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు.
Eat Stop Eat: అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది చాలా మందికి తెలిసిందే. శరీరంలో జీవక్రియను పునరుద్ధరించడానికి ఉపవాసం ఉత్తమ మార్గం. నీటి ఉపవాసం శరీరాన్ని శుభ్రపరచడానికి, బరువును తగ్గించడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలకు ప్రతికూలతలు ఉన్నాయి.

ఉపవాసం చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరగడంతో పాటు శరీరం పూర్తిగా శుభ్రం అవుతుందని అంటున్నారు. అయితే ఉపవాసం నుండి మంచి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందాలంటే వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే చేయాలని సూచిస్తున్నారు. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. అయితే వారానికొకసారి ఉపవాసం చేయడం అనేది అత్యుత్తమమని అంటున్నారు న్యూట్రిషనిస్టులు.
ఈట్ స్టాప్ ఈట్ అనే పద్ధతి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు.

ఈట్ స్టాప్ ఈట్ అంటే?
ఈట్ స్టాప్ ఈట్ అనే పద్ధతిని బ్రాడ్ పిలోన్ తీసుకువచ్చారు. 2007వ సంవత్సరంలో బ్రాడ్ రాసిన పుస్తకంలో దీని గురించి వివరించారు. ఈట్ స్టాప్ ఈట్ పద్ధతిలో వారానికి రెండు సార్లు 24 గంటలు ఉపవాసం ఉండాలి. మిగిలిన 5 రోజుల్లో సమతుల్య ఆహారం తినాలి. అలా అని అది డైటింగ్ కాదు, అలా అని ఇష్టారీతిగా తినొద్దు. ఐదు రోజుల్లో మూడు పూటలా తినొచ్చు. అయితే అది తక్కువ మొత్తంలో ఉండాలి. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. మంచి బరువు మెయింటైన్ చేయవచ్చు.

ఈట్ స్టాప్ ఈట్ ప్రయోజనాలు:
* ఈట్ స్టాప్ ఈట్ పద్ధతి వల్ల గ్రోత్ హార్మోన్ స్థాయిలు 5 రెట్లు పెరుగుతాయి. ఇది కొవ్వు తగ్గడానికి, కండరాలు పెరగడానికి సహాయపడుతుంది. అలా బరువు కూడా తగ్గొచ్చు.
* ఈ పద్ధతి వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఈట్ స్టాప్ ఈట్ పద్ధతిలో ఉపవాసం ఉన్నప్పుడు, కణాలు సెల్యులార్ రిపేర్ ప్రక్రియలను ప్రారంభిస్తాయి. ఇది ఆటోఫాగిని కలిగి ఉంటుంది. ఇలా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* ఈట్ స్టాప్ ఈట్ పద్ధతి వల్ల హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటుంది. కణాల పని తీరు కూడా మెరుగుపడుతుంది. అలా ఆరోగ్యంగా ఉండొచ్చు.
* ఇన్సులిన్ ను తగ్గించడం గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచడంతో పాటు, అది కొవ్వును కాల్చే హార్మోన్ నోర్ పైన్ ఫ్లైన్ విడుదలను పెంచుతుంది. దీని వల్ల జీవక్రియ రేటూ కూడా మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications