For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనం ఆక్సీజన్ తీసుకోవడంపై ఫేస్ మాస్కులు ప్రభావం చూపుతాయా?

ఫేస్ మాస్కుతో మనం పీల్చుకునే ఆక్సీజన్ పై ప్రభావం చూపుతుందా

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లేటప్పుడు మాస్కు ధరిస్తున్నారు. ఇలా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల కోవిద్ నుండి కొంత అయినా సేఫ్ గా ఉండొచ్చని నిపుణుల సలహ.

Can Face Masks Impact Your Oxygen Intake or Cause Carbon Dioxide Retention?

అయితే ఇవి అందరికీ సౌకర్యంగా లేవని చెప్పొచ్చు. చాలా మంది ఫేస్ మాస్క్ పెట్టుకోవడాన్ని అసౌకర్యంగా ఫీలవుతున్నారు. ఎందుకంటే మాస్క్ పెట్టుకున్న కొద్ది సమయం తర్వాత చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులొస్తున్నాయని చెబుతున్నారు.

Can Face Masks Impact Your Oxygen Intake or Cause Carbon Dioxide Retention?

దీంతో తాము మాస్క్ తీసేస్తున్నామని చాలా మంది చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆక్సీజన్ లోపం ఏర్పడుతుందని, కార్బన్ డై యాక్సైడ్ పీల్చుకుని బాడీలో పాయిజన్ చేరిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ చెడు ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది..జాగ్రత్తగా ఉండండి.!కరోనా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ చెడు ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది..జాగ్రత్తగా ఉండండి.!

మాస్క్ మంచిది కాదా?

మాస్క్ మంచిది కాదా?

చాలా మంది కరోనా నుండి తమను తాము కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఫేస్ మాస్క్ ధరించడం చాలా మందికి ఇబ్బందికరంగానే ఉంటోంది. ఎందుకంటే దీని వల్ల శ్వాస పీల్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడమే ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు.

ఆక్సీజన్ లోపం ఉంటుందా?

ఆక్సీజన్ లోపం ఉంటుందా?

ఇదిలా ఉండగా.. మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అని వైద్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగిపోయి.. ఆక్సీజన్ లోపం ఏర్పడుతుందనడంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ స్పష్టం చేసింది. కానీ కొందరు సోషల్ మీడియాలో దీని గురంచి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం మాస్కులు ధరించడం వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడొచ్చని వివరించింది.

కరోనాను అరికట్టాలంటే..

కరోనాను అరికట్టాలంటే..

ప్రస్తుతం కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. కరోనా వ్యాప్తిని అరికట్టాలన్నా.. మాస్కులను సరైన క్రమంలో ధరించాలని, శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

అలసట మరియు మైకము : ఇది కరోనా సెకండ్ వేవ్ యొక్క ముఖ్యమైన ప్రారంభ లక్షణం ...జాగ్రత్తఅలసట మరియు మైకము : ఇది కరోనా సెకండ్ వేవ్ యొక్క ముఖ్యమైన ప్రారంభ లక్షణం ...జాగ్రత్త

మూడు లేయర్ల మాస్క్..

మూడు లేయర్ల మాస్క్..

మిమ్మల్ని మీరు కరోనా వైరస్ నుండి కాపాడుకోవాలని భావించడానికి నాణ్యత గల మాస్కు ధరించాలని భావిస్తే.. మూడు లేయర్లు ఉండే మాస్కును ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఆక్సీజన్ లెవెల్స్ మరియు కార్బ్ డై ఆక్సైడ్ వంటివి తగ్గడం చాలా తక్కువ. అయితే వీటిని ఎక్కువగా వైద్య నిపుణులు వేసుకుంటారు.

చిన్నారులకు ఈ మాస్కులు..

చిన్నారులకు ఈ మాస్కులు..

మూడు నండి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండే చిన్నారులకు కూడా మూడు లేయర్లు ఉండే మాస్కును ఇవ్వొచ్చు. ఇది ఆక్సీజన్ స్థాయిలను మరింత దూకుడుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి చిన్నారులు 3 లేయర్ల మాస్కులను ధరించడం మంచిదని ప్రముఖ వైద్యులు మనోజ్ వివరించారు. వీటితో పాటు మీ ఇంట్లోనే తయారు చేసిన కాటన్ ఫేస్ కవర్లను కూడా వాడొచ్చు.

వ్యాయామం సమయంలో..

వ్యాయామం సమయంలో..

ఉదయాన్నే వాకింగ్ చేసే సమయంలో లేదా వ్యాయామం చేసే సమయంలో కొన్ని రకాల ఫీట్లు చేసేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించాలా వద్దా అనే విషయంలో చాలా మందిలో అనేక అపొహలు ఉన్నాయి. అయితే ఉదయాన్నే కఠినమైన కార్యకలాపాలు చేసేటప్పుడు మాస్క్ ధరించడం వల్ల ఊపిరితిత్తులపై అదనపు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు ఒంటరిగా వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సమయంలో మాస్కులు ధరించకుండా.. మీకు వీలుగా ఉండే ఫేస్ షీల్డ్ లేదా మూడు లేయర్లు ఉండే మాస్క్ లు ధరించొచ్చు.

English summary

Can Face Masks Impact Your Oxygen Intake or Cause Carbon Dioxide Retention?

If you feel uncomfortable wearing a face mask as it sits tightly across your face, be rest assured that you are not alone. Most people at one point or the other, wish to take off their masks, owing to the sweaty sensation and discomfort in breathing.
Story first published:Sunday, May 16, 2021, 11:22 [IST]
Desktop Bottom Promotion