For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free Covid Booster Dose: జూలై 15 నుండి 18 ఏళ్లు పైనున్న వారందరికీ ఉచిత కోవిడ్ బూస్టర్ డోసు

|

Booster dose: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజూ వేలాది కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించింది. క్రమంగా పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులు తగ్గించేందుకు వ్యాక్సిన్లు మరింత వేగంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలె ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 15 నుండి కొవిడ్-19 బూస్టర్ డోస్ ఇవ్వనుంది కేంద్ర సర్కారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ డోసు తీసుకునేందుకు అర్హులేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ బూస్టర్ డోసు పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

free booster covid 19 doses to given to all adults above 18 years

భారత దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ కాల్ సందర్భంగా, 15 జూలై 2022 నుండి వచ్చే 75 రోజుల వరకు, 18 ఏళ్లు పైబడిన పౌరులకు ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. 75 రోజుల స్పెషల్ డ్రైవ్ కింద ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రజలకు ఉచిత కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందించబడతాయని మరో అధికారి తెలిపారు.

కోవిడ్ ముందు జాగ్రత్త డోసులను పెంచే లక్ష్యంతో, భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కొత్త వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది ముందికి ప్రికాషన్ డోసును అందించారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, 60 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న 16 కోట్ల మంది అర్హులైన జనాభాలో 26 శాతం మంది, అలాగే ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌ లైన్ కార్మికులు బూస్టర్ డోస్ అందుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత జనాభాలో ఎక్కువ మందికి తొమ్మిది నెలల క్రితం రెండో డోసు వేశారు. ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అలాగే ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అధ్యయనాలు రెండు డోస్‌లతో ప్రైమరీ టీకా వేసిన ఆరు నెలల తర్వాత యాంటీ బాడీ స్థాయిలు తగ్గుతాయని సూచించాయి. బూస్టర్ ఇవ్వడం రోగ నిరోధక ప్రతిస్పందనను పెంచుతుందని వైద్యులు తెలిపారు.

కాబట్టి, ప్రభుత్వం 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సమయంలో 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులకు జూలై 15 నుండి ప్రభుత్వ టీకా కేంద్రాలలో ముందస్తు జాగ్రత్త డోసులను ఉచితంగా ఇవ్వనున్నారు. గత వారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని లబ్ధిదారులకు COVID-19 వ్యాక్సిన్ యొక్క రెండో డోసు అలాగే ప్రైమరీ డోసు మధ్య అంతరాన్ని తొమ్మిది నుండి ఆరు నెలలకు తగ్గించింది. ఇది నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) నుండి సిఫార్సు ప్రకారం ఇలా అంతరాన్ని తగ్గించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు పంపిన లేఖలో, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.

free booster covid 19 doses to given to all adults above 18 years

బూస్టర్ డోసు తీసుకునేముందు గుర్తుంచుకోవాల్సినవి:

* ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. భారత్ 75వ స్వతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. కొవిడ్ -19 ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య పెంచేందుకే ప్రభుత్వం ఈ డ్రైవ్ నిర్ణయాన్ని తీసుకుంది.
* జూలై 15 నుండి ప్రభుత్వం ప్రత్యేక టీకా డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. దీనిలో 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు ప్రభుత్వ టీకా కేంద్రాలలో ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చు. ఈ కరోనా టీకా డోసులను ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇవ్వనుంది.
* కొవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి అలాగే.. బూస్టర్ షాట్‌లను ప్రోత్సహించడానికి మరో కార్యక్రమాన్ని కేంద్ర సర్కారు చేపట్టనుంది. ప్రభుత్వం జూన్ 1న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 'హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ 2.0' రెండో దశను ప్రారంభించింది.
* 77 మంది లక్ష్యం జనాభాలో 1 శాతం కంటే తక్కువ మందికి ముందస్తు జాగ్రత్త డోసు అందించారు. 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 77 కోట్ల మందికి ఈ బూస్టర్ డోస్ అందించనున్నారు.
* అధికారిక లెక్కల ప్రకారం.. 60 ఏళ్ల వయస్సు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న 16 కోట్ల మంది అర్హులైన వ్యక్తుల్లో సుమారు 26 శాతం మంది, అలాగే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్ కార్మికులు బూస్టర్ డోసును పొందారు.

ఈ కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్ వల్ల దేశంలో కొవిడ్ -19 కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. జులై 15 నుండి ప్రారంభం కానున్న బూస్టర్ డోస్ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ వర్గాలు పూర్తి చేశాయి.

English summary

Free Booster Covid-19 doses to be Given to All Above 18 Years of Age From July 15; Details in Telugu

Read on to know free booster covid 19 doses to given to all adults above 18 years..
Desktop Bottom Promotion