Latest Updates
-
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా?
Alert: కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతోందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి..
కోవిషీల్డ్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతున్న కేసులను ప్రభుత్వం గుర్తించిందట.
ప్రస్తుతం కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్నప్పటికీ.. దానికి విరుగుడు కనుగొన్నారు కొన్ని దేశాల నిపుణులు. దీంతో కరోనా నుండి తమను తాము కాపాడుకోవచ్చని చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు.

ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా టీకాలు కూడా ఉత్పత్తి అవ్వడమే కాదు.. చాలా మంది తీసుకుంటున్నారు. కరోనా నుండి కోలుకుంటున్నారు. కరోనా టీకా ఉత్సవ్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది.

అయితే అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో తాజాగా కోవిషీల్డ్ టీకాలో ఒక సైడ్ ఎఫెక్ట్ కనుగొన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కోవిషీల్డ్ కరోనా నుండి మనల్ని రక్షిస్తున్నప్పటికీ, కొందరికి కొన్ని దుష్ప్రభావాలు ఎదురువుతున్నాయి.

అందులో కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు AEFI ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వివరించింది. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం...

ఎంతమందికి రక్తం గడ్డకట్టింది..
భారతదేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ టీకాలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో దాదాపు ఒక శాతం అంటే 0.61% మందికి ఇలా రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. యుకె మరియు జర్మనీలలో ఒక మిలియన్ ప్రజల్లో దాదాపు 10 మంది ప్రభావితమయ్యారు. మన దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోగా.. సుమారు 700 మందికి ఇలా రక్తం గడ్డ కట్టే సమస్య ఉండొచ్చని AEFI తన నివేదికలో తెలిపింది.

కోవాగ్జిన్ లో రక్తం గడ్డ కట్టలేదు..
మన దేశంలో రెండు రకాల టీకాలు ఇవ్వబడుతున్నాయి. అవి కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్, రెండు టీకాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే వీటిలో కోవిషీల్డ్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కోవాగ్జిన్ పొందిన వారిలో రక్తం గడ్డకట్టడం నివేదించబడలేదు.

టీకా ఎప్పుడు దొరుకుతుంది?
కోవిషీల్డ్ యొక్క మొదటి మోతాదు తర్వాత కొన్ని వారాలలో ఈ రకమైన రక్తం గడ్డకట్టే సమస్య కనిపిస్తుంది. సాధారణంగా కోవిషీల్డ్ టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న నాలుగు వారాలు లేదా ఆరు వారాల తర్వాత రెండో డోసు తీసుకుంటున్నారు. ఆ తర్వాత కొందరిలో దుష్ప్రభావాలు నెమ్మదిగా బయటపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రక్తం గడ్డకట్టే లక్షణాలు ఏమిటి?
కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుకున్న తర్వాత తలనొప్పి, మైకము, వాంతులు, కడుపు నొప్పి లేదా ఊపిరి తీసుకోవడం వంటి లక్షణాలను మీరు ఎదుర్కొంటే, వెంటనే మీ వైద్యుడికి తెలియజేయండి. భారతదేశంలో మార్చి 31 నాటికి 700 మంది ఈ రకమైన దుష్ప్రభావాలను కలిగి ఉన్నారు. 617 మంది పరిస్థితి విషమంగా ఉంది. 130 మంది మరణించారు. గణాంకాల ప్రకారం, మే 14 నాటికి 184 కోట్ల మందికి టీకాలు వేశారు.

మార్చి వరకు జిరో కేసులు..
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ నాణ్యతపై మార్చి మాసంలోనే పలు దేశాల్లో సందేహాల్లో తలెత్తుతున్నాయి. ఈ టీకాను తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డ కట్టిన(బ్లడ్ క్లాటింగ్) కేసులు బయటపడ్డాయని వార్తలొచ్చాయి. అయితే మార్చి మాసంలో భారతదేశంలో ఇలాంటి కేసు ఒక్కటి కూడా లేదని నివేదికలు వెల్లడించాయి.



Click it and Unblock the Notifications