Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
న్యూ ఇయర్ పార్టీ తర్వాత హ్యాంగోవరా? ఆ తలనొప్పి తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి
మందు తాగడంతో వచ్చే హ్యాంగోవర్ నుండి బయట పడేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. తలనొప్పి పోయి ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించొచ్చు.
పార్టీ తర్వాత హ్యాంగోవర్ కామన్. న్యూ ఇయర్ పార్టీ తర్వాత చాలా మంది హ్యాంగోవర్‌తో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. ఆల్కహాల్ తాగడం రాత్రంతా పార్టీ జోష్ వల్ల మరుసటి రోజు ఉదయం తలనొప్పి వచ్చేస్తుంది. మందు తాగడంతో వచ్చే హ్యాంగోవర్ నుండి బయట పడేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. తలనొప్పి పోయి ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించొచ్చు.

న్యూ ఇయర్ హ్యాంగోవర్ నుండి బయట పడేందుకు ఈ చిట్కాలు పాటించండి.

హ్యాంగోవర్ తలనొప్పికి కారణాలు:
ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కడుపు 20 శాతం ఇథనాల్‌ను గ్రహిస్తుంది. చిన్న ప్రేగు మిగిలిన భాగాన్ని గ్రహిస్తుంది. ఇథనాల్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించిన తర్వాత, అది మెదడుతో సహా శరీరం అంతటా ప్రయాణిస్తుంది. మూత్ర విసర్జన లక్షణాల కారణంగా, ఇథనాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది. తలనొప్పి అనేది డీహైడ్రేషన్ లక్షణాల్లో ఒకటి.

హ్యాంగోవర్ తలనొప్పిని ఎలా నయం చేయాలంటే..
1. విటమిన్ బి6
ఆల్కహాల్ ఒంట్లోని బి విటమిన్ల స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని జీవక్రియ చేయడం, ఆల్కహాల్ తొలగించడం కష్టతరం చేస్తుంది. డైటరీ సప్లిమెంట్ తీసుకోవడం లేదా అదనపు బి6 ను లోడ్ చేయడం ద్వారా శరీరం త్వరగా ఆల్కహాల్ నుండి బయటపడేలా చూసుకోవచ్చు. ఆల్కహాల్ తాగడానికి ముందు లేదా తర్వాత బి6 తీసుకుంటే హ్యాంగోవర్ రాకుండా చూసుకోవచ్చు. సిట్రస్ పండ్లు, చేపలు, కాలేయం, బంగాళాదుంపల్లో విటమిన్ బి6 ఉంటుంది.

2. స్పోర్ట్స్ డ్రింక్స్
ఆల్కహాల్ తాగేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. అదనపు ఎలక్ట్రోలైట్‌లు ఉండే పానీయాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు. గాటోరేడ్ వంటి స్పోర్ట్స్ డ్రింక్స్ సాధారణ నీటి కంటే హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ కూడా చాలా మితంగానే తీసుకోవాలి.

3. N-ఎసిటైల్-సిస్టీన్
అమైనో ఆమ్లం N-ఎసిటైల్-సిస్టీన్(NAC) అనేది ఒక సహజమైన అమైనో ఆమ్లం. ఇది శరీరం ఎసిటాల్డిహైడ్ యొక్క విష ప్రభావాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఎసిటాల్డిహైడ్ అనేది ఒక రసాయ సమ్మేళనం. ఇది తలనొప్పితో సహా అనేక హ్యాంగోవర్ లక్షణాలతో సంబంధం ఉంటుంది. గ్లూటాతియోన్ అనేది సహజంగా లభించే యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎసిటాల్డిహైడ్ వల్ల కలిగే కణాల నష్టం నుండి కాలేయాన్ని రక్షిస్తుంది. అయితే NAC తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

4. ఆహారం తీసుకోవాలి
ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. హ్యాంగోవర్ తలనొప్పి వచ్చినప్పుడు అరటి పండ్లు, పుచ్చకాయలు, మాంసం, సాల్మన్, చికెన్ వంటిని తినాలి.

5. తేలికపాటి వ్యాయామం
తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఆల్కహాల్, సంబంధిత టాక్సిన్‌లను మరింత త్వరగా తొలగిస్తుంది. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

హ్యాంగోవర్ తలనొప్పి రాకుండా చూసుకోవడం ఎలాగంటే..
* హ్యాంగోవర్ వచ్చాక ఇబ్బంది పడటం కంటే హ్యాంగోవర్ రాకుండా చూసుకోవడం ముఖ్యం.
* విస్కీ, బ్రాందీ లాంటి ఆల్కహాల్‌లో తక్కువ నీరు కలుపుకుంటే హ్యాంగోవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేసమయంలో ఎక్కువ నీటిని కలుపుకోవడం మంచిది.
* ఆల్కహాలు తీసుకునే ముందు, తర్వాత నీళ్లు తాగాలి. బీర్, విస్కీ, బ్రాందీ ఏది తాగినా నీళ్లు తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.
* చాలా మంది ఆల్కహాల్ తీసుకునే సమయంలో కేవలం లైట్‌గా స్టఫ్ తినేసి ఊరుకుంటారు. కానీ అలా చేయవద్దు. ఆల్కహాల్ తీసుకునే ముందు, తీసుకునే సమయంలో, తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోవాలి.



Click it and Unblock the Notifications