Latest Updates
-
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!
Makhana Benefits: ఈ గింజలు తింటే త్వరగా బరువు తగ్గిపోతారు
తామర గింజలు, లోటస్ సీడ్స్, మఖానా, ఫాక్స్ నట్స్.. తామర గింజలకు ఎన్ని పేర్లు ఉన్నాయో అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. మఖానా తినడం వల్ల అనే
Makhana Benefits: తామర గింజలు, లోటస్ సీడ్స్, మఖానా, ఫాక్స్ నట్స్.. తామర గింజలకు ఎన్ని పేర్లు ఉన్నాయో అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. మఖానా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు.

బరువు తగ్గిస్తాయి:
తామర గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగో కేలరీలు చాలా చాల తక్కువ మొత్తంలో ఉంటాయి. దాంతో పాటు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఫాక్స్ నట్స్ తినాలని న్యూట్రిషనిస్టులు, జిమ్ ట్రైనర్‌లు సూచిస్తుంటారు. తామర గింజలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. అందుకే తక్కువ మొత్తంలో తింటారు. అలా లోటస్ సీడ్స్ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.

తామర గింజల ప్రయోజనాలు:
1. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
మఖానాలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ తో పాటు అనేక సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కాల్షియం ఎముకలల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతుంది. మెగ్నీషియం శరీరంలో విస్తృతమైన జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం.

2. యాంటీ ఆక్సిడెంట్లు
తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడతాయి. మఖానాలో గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎఫికాటెచిన్ వంటి నిర్దిష్ట యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షిస్తాయి.

3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
ఫాక్స్ నట్స్ మెరుగైన బ్లడ్ షుగర్ నిర్వహణకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్ లను పెంచుతాయి. మఖానా విత్తనాల్లోని పోషకాలు ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో తేలింది.

4. యాంటీ ఏజింగ్
మఖానాలో కనిపించే కొన్ని సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. తామర గింజల్లో గ్లూటమైన, సిస్టీన్, ఆర్జినైన్, మెథియోనిన్ వంటి యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications
