Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
ఉద్యోగం లేదా బిజినెస్ నుండి సెలవు ఎందుకు తీసుకోవాలి? వెకేషన్‌తో కలిగే ప్రయోజనాలేంటి?
సెలవు తీసుకోవడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉద్యోగులు తమ పని నుండి సెలవు తీసుకోవాలని, వ్యాపారస్థులైతే వెకేషన్‌కు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వెకేషన్‌కు వెళ్లడం వ
ఒక బరువైన వస్తువును మోసుకువెళ్తుంటాం అనుకోండి. అలా తీసుకెళ్తున్నప్పుడు దానిని మధ్యలో కిందకు దించి కొంత శ్వాస పీల్చుకుని మళ్లీ మోసుకువెళ్తుంటాం. ఇలా మధ్యలో దింపడం ద్వారా అలసట కొద్దిగా తగ్గుతుంది. కొంత శక్తి పుంజుకుంటాం. అలాంటివే సెలవులు, వెకేషన్లు. వీటి వల్ల బాధ్యతలు, బరువుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కుటుంబ బాధ్యతలైనా కొద్ది ఉపశమనం వల్ల అలసట తగ్గుతుంది. ఆ బాధ్యతలను, బరువులను మరికొంత దూరం తీసుకెళ్లేందుకు శక్తిని పుంజుకుంటాం. అందుకే పని నుండి ఉపశమనం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు.

సెలవు తీసుకోవడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉద్యోగులు తమ పని నుండి సెలవు తీసుకోవాలని, వ్యాపారస్థులైతే వెకేషన్‌కు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వెకేషన్‌కు వెళ్లడం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వెకేషన్ మైండ్ ఫుల్‌నెస్ పెంచుతుంది:
సెలవు రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ది జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం పని నుండి సెలవు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. మానసిక ప్రశాంతత కలుగుతుందని వెల్లడైంది. ధ్యానంతో కలిగే ప్రయోజనాలు వెకేషన్ వల్ల కలుగుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
పని నుండి, వ్యాపారం నుండి సెలవు తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుందని పరిశోధనలో పాల్గొన్న చాలా మంది తెలిపారు.

వెకేషన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
తరచుగా వెకేషన్ వెళ్లడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ తగ్గుతుంది. అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, అధిక పొట్ట కొవ్వు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిల్లాంటి గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
తరచూ వెకేషన్లకు వెళ్లే వ్యక్తుల్లో మెటబాలికి సిండ్రోమ్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఆందోళన కలిగించే పరిస్థితులు, వాతావరణం నుండి సెలవు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
వారానికి కనీసం 120 నిమిషాలు హాయిగా, జాలీగా గడిపేలా చూసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సెలవు తీసుకోవడం దానిని వినియోగించుకోవడంపై దాని లాభాలు ఆధారపడి ఉంటాయి.

మెదడు శక్తిని పెంచుతుంది:
విశ్రాంతి తీసుకోవడం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు, అది శక్తి ఏకీకృతం చేస్తుంది. అందుకే నడుస్తున్నప్పుడు, బాత్రూములో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి.

సంబంధాలను బలపరుస్తుంది:
జీవిత భాగస్వామి, తోబుట్టువులు, పిల్లలు, స్నేహితులు ఎవరైనా, ఎంతకాలంగా పరిచయం ఉన్నా వారితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలంటే వెకేషన్లే ఉత్తమం. కలిసి ప్రయాణించడం, జాలీగా గడపడం సంబంధాలకు కొంత ఉత్సాహాన్ని అందిస్తుంది.
ప్రియమైన వారితో కొత్త అనుభూతి పొందినప్పుడు అది వారితో మునుపెన్నడూ లేనంత లోతైన స్థాయిలో బంధాన్ని ఏర్పరుస్తుంది.

ఉత్పాదకత, సృజనాత్మకత పెరుగుతుంది:
ఉద్యోగి పనితీరు మెరుగుపరచడానికి ఉత్తమ మార్గం వారికి సెలవు ఇవ్వడమేనని అంటారు మానసిక నిపుణులు. మన మెదడు కొత్త భాషలు, కొత్త దృశ్యాలు, కొత్త శబ్దాలు, కొత్త సంస్కృతులకు గురైనప్పుడు అది మనస్సును పునరుజ్జీవింపజేస్తుంది.
పని నుండి సెలవు తీసుకోని ఆ సమయాన్ని హాయిగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో సృజనాత్మకతను పెంచుతుంది.



Click it and Unblock the Notifications
