For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bathing Irregularly: వాతావరణం చల్లగా ఉందని స్నానం చేయట్లేదా.. ఈ సమస్యలు తప్పవు

|

Bathing Irregularly: స్నానం అనేది జీవితంలో ఓ భాగం. స్నానాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ చేస్తారు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం చేసే పని స్నానం చేయడమే. అయితే కాలాన్ని బట్టి స్నానం అనేది రోజుకు ఎన్ని సార్లు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పెడుతుంది కాబట్టి చాలా ఉదయం, రాత్రి వేళ స్నానం చేస్తారు. స్నానం చేయడం వల్ల పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఉపశమనంగా అనిపిస్తుంది.

Health Problems You will get if dont take a bath in cold weather in telugu

అయితే రోజుకు ఒక్కసారి స్నానం చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. అయితే అది చలికాలం లేదా వర్షాకాలం అయితే వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లని వాతావరణంలో కొంత మందికి స్నానం చేయాలని అనిపించదు. రోజుకు ఒక్కసారి కూడా స్నానం చేయకుండా ఉంటారు. కొందరు అయితే రెండు, మూడు రోజులు కూడా స్నానం లేకుండా అలాగే ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల పలు సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

స్నానం చేయకపోతే వచ్చే సమస్యలు:

స్నానం చేయకపోతే వచ్చే సమస్యలు:

అది ఏ కాలం అయినా రోజుకు రెండు సార్లు స్నానం చేయడం అనేది మంచిదని వైద్యులు అంటారు. కానీ వాతావరణం చల్లగా ఉంటే మొత్తానికి స్నానం చేయాలనిపించదు. కానీ ఇలా స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉంటే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజూ శరీరంపై కణాలు చనిపోతూ ఉంటాయి ఆ మృతకణాలు చర్మంపై పేరుకుపోతాయి. వాటిని తొలగించకపోతే వాటి వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల దుర్వాసన కూడా వస్తుంది. గాలి తగలని చోట జననేంద్రియాల వద్ద మృతకణాలు పేరుకు పోతాయి. ఆయా ప్రాంతాల్లో గాలి కూడా తగలదు కాబట్టి చెమట కూడా అలాగే ఉండిపోతుంది. ఈ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అక్కడ బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు ఒక చోట ప్రారంభమై మరో చోటుకు అక్కడి నుండి ఇంకో చోటుకు సోకుతాయి.

రోజూ స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు:

రోజూ స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు:

చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం.. కాలం ఏది అయినా చర్మంపై కణాలు చనిపోతూ ఉంటాయి. కొత్తవి పుడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీనికి కాలంతో సంబంధం లేదు. మృతకణాలు చర్మంపై పేరుకుపోతూనే ఉంటాయి. ఇలా పేరుకుపోయిన మృతకణాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే శరీరం నుండి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ రాత్రి వేళ చాలా చురుుకుగా జరుగుతుంది కాబట్టి, ఉదయం లేవగానే స్నానం చేయాలని అంటారు. స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మహిళలు శుభ్రంగా ఉంటే ప్రయోజనం:

మహిళలు శుభ్రంగా ఉంటే ప్రయోజనం:

మహిళలను ప్రతి నెలా బాధపట్టేది నెలసరి. ఈ వేళ రక్తస్రావం జరుగుతుంది. కడుపు నొప్పి ఉంటుంది. ఈ సమయంలో కొందరిలో వెన్ను నొప్పి కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొదరు స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఇలాంటి సమయంలో స్నానం తప్పకుండా చేయాలని అంటారు వైద్యులు. నెలసరి సమయంలో శుభ్రత పాటించాలని చెబుతుంటారు. రోజూ రెండు పూటల స్నానం చేయాలని చెబుతారు. జననేంద్రియాల వద్ద శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. శానిటరీ ప్యాడ్ లు మార్చుకుని వేడి నీటితో స్నానం చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ ఉపశమనం లభిస్తుంది.

ఎక్కువసార్లు స్నానం చేస్తే ఏమవుతుంది:

ఎక్కువసార్లు స్నానం చేస్తే ఏమవుతుంది:

షవర్ చేయడం తప్పనిసరిగా రోజువారీ దినచర్యలో ఓ భాగం. కొంత మంది వ్యక్తులు ప్రమాదాలను పట్టించుకోకుండా రోజుకు చాలా సార్లు స్నానం చేస్తూనే ఉంటారు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. చర్మం పొడి బారుతుంది. చర్మానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది. చలికాలంలో, మీ చర్మం ఇప్పటికే పొడి బారినప్పుడు, చాలా తరచుగా స్నానం చేయడం బాధలను మరింత పెంచుతుంది.

ఎంత తరచుగా, ఎంతసేపు స్నానం చేయాలి?

ఎంత తరచుగా, ఎంతసేపు స్నానం చేయాలి?

వర్కవుట్‌ల మొత్తం ఒక వ్యక్తి ఎంత తరచుగా స్నానం చేయాలో నిర్ణయిస్తుంది. చికాకు, మొటిమలు మరియు చర్మ పరిస్థితి, ఎక్కువ పని చేసే వారు తరచుగా స్నానం చేయాలి. స్నానానికి సరైన వ్యవధి లేనప్పటికీ, నిపుణులు గజ్జలు మరియు చంకలపై దృష్టి సారించి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు షవర్ చేయాలని సిఫార్సు చేస్తారు.

క్రమం తప్పకుండా తలస్నానం చేయకపోవడానికి ఇది సాకుగా ఉంటుందా?

క్రమం తప్పకుండా తలస్నానం చేయకపోవడానికి ఇది సాకుగా ఉంటుందా?

ఒక వైపు, ఎక్కువగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడంతోపాటు చర్మం ఆరోగ్యంపై ఇతర ప్రతికూల ప్రభావాలను ప్రేరేపిస్తుంది. నిపుణులు ఇప్పటికీ క్రమం తప్పకుండా స్నానం చేయకపోవడానికి కారణం కాదు. జల్లుల మధ్య మూడు నుండి నాలుగు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ వదిలివేయడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు పొలుసుల చర్మం ప్యాచ్‌లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ డార్క్ ప్యాచ్‌లలో మురికి, చెమట, చనిపోయిన చర్మ కణాలు మొటిమలను ప్రేరేపించడం లేదా తామర, సోరియాసిస్ మరియు చర్మశోథ వంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తాయి.

English summary

Health Problems You will get if don't take a bath in cold weather in telugu

read on to know Health Problems You will get if don't take a bath in cold weather in telugu
Story first published:Wednesday, August 3, 2022, 14:25 [IST]
Desktop Bottom Promotion