Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే.. రాత్రయినా, పగలైనా 'పడక' పని సాఫీగా సాగుతుంది
జీర్ణవ్యవస్థలో చిన్న పాటి సమస్య కూడా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. పురుషుల్లో ఆరోగ్యకరమైన లైంగిక పనితీరును నిర్వహించడానికి అవసరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా గట్ ప్రభావితం
ఆరోగ్యంగా ఉండటం అంటే అన్ని రకాలుగా మంచిగా ఉండటం. అంటే శారీరకంగా, మానసికంగా చక్కగా ఉండటమే ఆరోగ్యంగా ఉండటం అంటే. మనం ఆరోగ్యంగా ఉండటంలో గట్ హెల్త్‌ది కీలక పాత్ర. గట్ హెల్త్ అంటే జీర్ణవ్యవస్థ మొత్తం. శరీర రోగనిరోధక వ్యవస్థ కూడా గట్ హెల్త్‌పై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ నియంత్రణలో కూడా దీనిదే కీలక పాత్ర. లైంగిక పనితీరు సక్రమంగా ఉండాలంటే హార్మోన్లు, గట్ హెల్త్ సరిగ్గా ఉండాలి.

జీర్ణవ్యవస్థలో చిన్న పాటి సమస్య కూడా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. పురుషుల్లో ఆరోగ్యకరమైన లైంగిక పనితీరును నిర్వహించడానికి అవసరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా గట్ ప్రభావితం చేస్తుంది.

సరైన బరువు:
మంచి గట్ హెల్త్ నిర్వహిస్తే అది సరైన బరువును మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది లైంగిక ఆరోగ్యానికి ముఖ్యమైనది. అధిక బరువు లేదా ఊబకాయం లైంగిక పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీని లైంగిక చర్య సమయంలో ఆత్మగౌరవం తక్కువ స్థాయిలో ఉంటుంది. తమపై తమకు విశ్వాసం ఉండదు. ఈ కారణాల వల్ల లైంగిక కోరిక తగ్గుతుంది ఆరోగ్యకరమైన గట్ కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది లైంగిక పనితీరుకు చాలా కీలకం.

మానసిక స్థితి అదుపులో ఉంటుంది:
గట్ హెల్త్ సెరోటోనిన్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ మరియు లైంగిక కోరికలు, ఉద్రేకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పేలవమైన పేగు ఆరోగ్యం ఉన్న వ్యక్తులు సెరోటోనిన్ స్థాయిల్లో తగ్గుదలను అనుభవించవచ్చు. ఇది లైంగిక పనితీరును తగ్గిస్తుంది.

లైంగిక వ్యాధులపై ప్రభావం:
గట్ హెల్త్ లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల(STIs) ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది. గట్ హెల్త్ మెరుగ్గా ఉంటే రోగనిరోధక శక్తి బాగుండి లైంగిక వ్యాధులపై మెరుగ్గా పోరాడుతుంది. అదే గట్ హెల్త్ బాగోలేకపోతే ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల ప్రభావాన్ని పెంచుతుంది.
గట్ హెల్త్ మెరుగుపరచుకోవడానికి అలాగే లైంగిక పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు గట్ బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రోబయోటిక్స్ వంటి పులియబెట్టిన ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ పద్ధతులు గట్ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి లైంగిక పనితీరును మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
గట్ ఆరోగ్యం, లైంగిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన గట్‌ను నిర్వహించడం లైంగిక పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ ద్వారా ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. దీని వల్ల మొత్తం లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications
