Latest Updates
-
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.!
ఇలా చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కాలంతో పాటు పరుగెత్తాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. రోజంతా హుషారుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలా రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి.
రోజూ ఎన్నో రకాల పనులు, ఎన్నో బాధ్యతలు, ఇంట్లో పనులు, ఆఫీసు పనులు ఇలా చాలా మందికి రోజంతా తీరిక లేకుండా గడిచిపోతుంది. జానెడు పొట్ట కోసం మంచి జీవితం కోసం కష్టపడక తప్పదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు రకరకాల పనుల్లో నిమగ్నం అవుతుంటాం.

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కాలంతో పాటు పరుగెత్తాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. రోజంతా హుషారుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలా రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి.

సరిగ్గా ప్రారంభించడం ముఖ్యం
ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యం. శారీరకంగా, మానసికంగా శక్తిని పుంజుకోవడానికి విశ్రాంతి కీలకం. వివిధ కారణాల వల్ల రాత్రుళ్లు ఆలస్యంగా పడుకుంటే ఉదయం ఆఫీసుకనో లేదంటే కాలేజీలకనో వెళ్లడానికి ఉదయమే నిద్ర లేస్తే ఆ చాలీచాలనీ నిద్ర మిమ్మల్ని రోజంతా వెంటాడుతుంది. రోజంతా నిద్ర మబ్బుగానే ఉంటుంది. ఫేస్‌లోనూ కళ ఉండదు.
రోజూ ఒకే సమయానికి నిద్రలోకి జారుకోవడం, నిద్ర నుండి మేల్కోవడం అలవాటు చేసుకుంటే.. ఉదయం నిద్ర లేవగానే ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. ఉదయం ఉన్న ఫీలింగ్ సాయంత్రం వరకూ కొనసాగుతుంది. వీకెండ్స్‌లోనూ ఒకేరకమైన నిద్ర షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి.

తక్కువ స్థాయిలో కెఫిన్ తీసుకోవడం
అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే కొత్త మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల చలాకీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

సరిగ్గా తినాలి
ఉదయం వేళ తినే అల్పాహారం మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అందులే ఉదయం వేళ తీసుకునే అల్పాహారంలో పోషకాలు, కేలరీలు అన్ని సమపాళ్లలో ఉండేలా కొద్దిగా పెద్ద మొత్తంలో తీసుకోండి.
ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. అల్పాహారంలో తాజా పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లు భాగం చేసుకోండి.

పుష్కలంగా నీరు తాగాలి
వేసవి కాలం, చలికాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి నీళ్లు చాలా ముఖ్యం. శరీరాన్ని డీహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజంతా తరచూ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన ప్రోటీన్
ప్రోటీన్ వల్ల శరీరానికి శక్తి సమకూరుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ప్రోటీన్ తీసుకోవాలి. మాంసం, గుడ్లు, లీన్ మాంసాలు, చేపలు, నట్స్, పాల ఉత్పత్తులు, పెరుగు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.

శారీరక శ్రమ
రోజంతా కూర్చున్నా, రోజంతా నిల్చున్నా అలసట వస్తుంది. మీది రోజంతా కూర్చుని చేసే పని అయితే మధ్య మధ్యలో అటు ఇటు నడవడం అలవాటు చేసుకోండి. గంట గంటకు ఓ 10 లేదా 15 నిమిషాల పాటు అలా నడవాలి.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేదంటే సాయంత్రం వేళ నడక లేదా ఇతర వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సిందే.

రోజులో కాసేపు ఎండలో..
పగటి పూట సూర్య రశ్మిలో కాసేపు ఉండండి. శరీరంపై సూర్య కిరణాలు పడటం వల్ల ఉత్తేజకరంగా అనిపిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాలు సూర్య కిరణాలో తాకేలా చూసుకోవాలి.

ధ్యానం
ధ్యానం శారీరక, మానసిక ఉల్లాసానికి చక్కగా సహాయపడుతుంది. రోజూ కాసేపు ధ్యానం చేయడం వల్ల ఒంట్లోకి శక్తి వస్తుంది. మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉండవచ్చు. కొన్ని నిమిషాలైనా పర్లేదు కానీ పూర్తి స్థాయి ధ్యానంలోకి వెళ్లేలా చూసుకోవడం ముఖ్యం.



Click it and Unblock the Notifications