Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
International Men's Day 2022: ప్రతి పురుషుడు ఈ ఆరోగ్య పరీక్షలు తరచూ చేయించుకోవాల్సిందే!
ఇవి పురుషులకు ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు.
International Men's Day 2022: ఆరోగ్యంగా ఉండటం కోసం సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంతో ముఖ్యం. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలని అంటారు వైద్యులు. వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల రాబోయే విపత్తులను ముందే గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండొచ్చు. వాటిని ముందే కట్టడి చేయవచ్చు.

ఇవి పురుషులకు ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు. మీ వైద్యుడు మీ ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఏ పరీక్షలు, ఎంత తరచుగా నిర్వహించాలో నిర్ణయిస్తారు.

బ్లడ్ షుగర్
40 ఏళ్లు పైబడిన వారికి, ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నట్లైతే బ్లడ్ షుగర్ టెస్టు చేయించుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఉపవాసం, పోస్ట్‌ప్రాండియల్, HbA1C ఉపయోగించి మధుమేహం కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహాన్ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ను ముందుగా గుర్తిస్తే దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కట్టడి చేయవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్
35 ఏళ్లు పైబడిన వ్యక్తులు అందరూ ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొలెస్ట్రాల్‌ని చెక్ చేసుకోవాలి. ఊబకాయంతో బాధపడుతున్నా, మీరు ఎక్కువగా ధూమపానం చేస్తున్నా లిపిడ్ ప్రొఫైల్ టెస్టు తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

రక్తపోటు
అధిక బ్లడ్ ప్రెషర్ గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంట్లో బీపీ చెక్ చేసుకునేందుకు కిట్‌లు ఉన్నాయి. సాధారణ రక్తపోటు స్థాయి 120/80 mmHg కంటే తక్కువగా ఉంటుంది.

థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH)
థైరాయిడ్ తో ఏవైనా అసమానతలు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. బరువు పెరగడం లేదా అలసటకు కారణమవుతాయి. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష ద్వారా థైరాయిడ్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అధికంగా లేదా తక్కువగా ఉండే TSH పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటిజెన్ (PSA) పరీక్ష
ఎనిమిది మంది పురుషులలో ఒకరు తన జీవితకాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉన్నప్పుడు, క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. వార్షిక ప్రాతిపదికన 50 ఏళ్లు పైబడిన పురుషులందరికీ సిఫార్సు చేయబడింది.

వృద్ధుల కోసం
50 ఏళ్లు పైబడిన వ్యక్తులు అలాగే గుండె జబ్బులకు ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులను పరీక్షించడానికి సంవత్సరానికి ఎకోకార్డియోగ్రామ్ మరియు ట్రెడ్‌మిల్ పరీక్ష చేయించుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ తో ఏడాది వ్యవధిలో కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్ చేయించుకోవాలి.

కొలొనోస్కోపీ
కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దప్రేగులో లేదా పురీషనాళంలో అభివృద్ధి చెందే ఒక రకమైన క్యాన్సర్. పెద్దప్రేగు, పురీషనాళంలో మార్పులు లేదా అసాధారణతలను గుర్తించడంలో కొలనోస్కోపీ పరీక్ష సహాయపడుతుంది.
సాధారణంగా, 45 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 10 సంవత్సరాలకు కొలొనోస్కోపీని సిఫార్సు చేస్తారు.



Click it and Unblock the Notifications