Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క! నవ్వితే షూటింగ్ మధ్యలో ఆపాల్సిందేనట
తాను ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు అనుష్క శెట్టి చెప్పింది. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే 20, 30 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట. ఎంతగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తాను నవ్వును నియంత్రించుకోలేదట.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆటో ఇమ్యూన్ వ్యాధితో సమంత, బొల్లి వ్యాధితో మమత మోహన్ దాస్, గుండె సంబంధిత వ్యాధితో రేణు దేశాయ్ బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి బాహుబలి నటి స్వీటి అనుష్క శెట్టి చేరిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. తాను వింత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేసింది.

నవ్వడమే తన వ్యాధి:
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శెట్టి.. తాను ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పింది. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే 20, 30 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట. ఎంతగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తాను నవ్వును నియంత్రించుకోలేదట. ఎవరైనా తన దగ్గర జోక్ వేసినా, నవ్వు తెప్పించే సందర్భం గురించి చెప్పినా తను నవ్వుతూనే ఉండిపోతుందట. దీనిని ఎంతగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తన వల్ల కావడం లేదని ఆ ఇంటర్వ్యూలో అనుష్క చెప్పింది. తాను నవ్వడం మొదలు పెడితే 20, 30 నిమిషాలు నవ్వుతూనే ఉంటుందని, ఆ సమయంలో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ కూడా పూర్తి చేసేస్తారని స్వీటీ చెప్పింది.

లాఫింగ్ డిజార్డర్ అంటే ఏంటి?
లాఫింగ్ డిజార్డర్ దీనినే సూడోబుల్‌బార్ ఎఫెక్ట్(PBA) అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు తమ నవ్వును, ఏడుపును ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు. చిన్న సందర్భానికైనా అతిగా నవ్వడం లేదా అతిగా ఏడ్వడం చేస్తుంటారు. కొన్ని సార్లు ఇది చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ఎదుటివారు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నప్పుడు నవ్వడం ఇబ్బందిని కలిగిస్తుంది. నువ్వును, ఏడుపును ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేరు.

లాఫింగ్ డిజార్డర్ లక్షణాలు:
* ఆకస్మికంగా నవ్వడం లేదా ఏడవడం
* నవ్వును, ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోవడం
* నవ్వాలనుకున్నప్పుడు ఏడవొచ్చు, ఏడవాలనుకున్నప్పుడు నవ్వొచ్చు
* నవ్వు అయినా, ఏడుపు అయినా కొన్ని నిమిషాల పాటు ఉండటం
* రోజులో ఎన్నిసార్లు అయినా ఇలా రావడం
* సూడోబుల్బార్ ఎఫెక్ట్ డిప్రెషన్ లేదా ఇతర మూడ్ డిజార్డర్స్ గా తప్పుగా నిర్ధారించడం

లాఫింగ్ డిజార్డర్ ఎవరికి ప్రమాదం:
లాఫింగ్ డిజార్డర్ మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. భావోద్వేగాలను నియంత్రించే నాడీ మార్గాలు చెదిరిపోయినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది భావోద్వేగ ప్రతిస్పందనలపై నియంత్రణ కోల్పోవడానికి దారితీస్తుంది. అయితే PBA రావడానికి కచ్చితమైన కారణం మాత్రం తెలియదు.
లాఫిగ్ డిజార్టర్‌తో ఈ పరిస్థితులు తలెత్తవచ్చు
* డిమెన్షియా, అల్జీమర్స్
* లౌ గెహ్రిగ్స్ వ్యాధి లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్
* మల్టిపుల్ స్క్లెరోసిస్
* మూర్ఛ
* పార్కిన్సన్ వ్యాధి
* మెదడు గాయాలు
* స్ట్రోక్

చికిత్స:
లాఫింగ్ డిజార్డర్ వ్యాధిని యాంటిడిప్రెసెంట్స్, కంబైన్డ్ మెడికేషన్స్ వంటి వాటితో నిర్వహించబడుతుంది. చికిత్స ప్రధానంగా భావోద్వేగాల తీవ్రతను, సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెడతారు.
PBA చికిత్సలో సాధారణంగా డిప్రెషన్ వంటి ఇతర మానసిక రుగ్మతలకు ఉపయోగించే మందులనే వాడతారు. ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, సెలెక్టివ్-సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ సాధారణంగా డిప్రెషన్ చికిత్సకు ఉపయోగించే దానికంటే తక్కువ మోతాదులో వాడతారు.



Click it and Unblock the Notifications
