Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Fatty Liver: వారానికి రెండున్నర గంటలు ఇదొక్కటి చేయండి చాలు, లివర్ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది
పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల కాలేయ కొవ్వు ప్రభావవంతంగా తగ్గుతున్నట్లు తేలింది.
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. రక్తాన్ని శుద్ధి చేయడం, ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడటం, రక్తంలో గ్లూకోజును స్థిరంగా ఉంచడం ఇలా చాలా పనులు చేస్తుంది. అయితే మిగతా అవయవాల్లో కొవ్వు పేరుకున్నట్లే కాలేయ కణాల్లోనూ కొవ్వు పేరుకుపోతుంది. ఇది కొంత వరకు ఉంటే ఓకే. కానీ మితిమీరితే కాలేయం దెబ్బతింటుంది. దీని వల్ల కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ.. ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టడంతో తలెత్తుతాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.

ఊబకాయం, మధుమేహంతో బాఢపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అధిక బరువు ఉండేవారిలో 75శాతం మందిలో, తీవ్ర ఊబకాయుల్లో 90 శాతం మందిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కనిపిస్తుంటుంది.

చిన్నగా మొదలై.. క్యాన్సర్ వరకూ వెళ్తుంది:
కాలేయానికి కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలనేమీ లేదు. కానీ కాలేయంలో ఇన్‌ఫ్లమేషన్ తలెత్తవచ్చు. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. దీనిని నాష్- నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అంటారు. ఇది మరింత ముదిరితే సిరోసిస్ అనే పరిస్థితి తలెత్తుతుంది. ఇది మరింత తీవ్రమైతే కాలేయం విఫలమవుతుంది లేదంటే క్యాన్సర్ వస్తుంది.

ఈ ఒక్కటి చేస్తే కాలేయ కొవ్వును కరిగిస్తుంది:
పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల కాలేయ కొవ్వు ప్రభావవంతంగా తగ్గుతున్నట్లు తేలింది.
కాలేయ కొవ్వు తగ్గించడంలో శారీరక శ్రమ ప్రయోజనకరంగా ఉంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెప్పినా.. ఎంత మేరకు వ్యాయామం చేయాలని ఏ అధ్యయనం చెప్పలేకపోయింది. తాజాగా చేసిన అధ్యయనం ద్వారా వారానికి రెండున్నర గంటల పాటు ఏరోబిక్ వ్యాయామం చేస్తే లివర్ ఫ్యాట్ తగ్గుతుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.
శారీరక శ్రమ, వ్యాయామం, శారీరక దృఢత్వం, శరీర కూర్పు, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది.

కాలేయానికి కొవ్వు పట్టిందని తెలుసుకోవడం ఎలా:
సాధారణంగా ఏదో సమస్య కోసం రక్త పరీక్షలు చేసినప్పుడు కాలేయానికి కొవ్వు పట్టినట్లు లేదా కాలేయ జబ్బు ఉన్నట్లు తెలిసిపోతుంది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే డాక్టర్లు పరీక్షలు చేయిస్తుంటారు. కాలేయ పనితీరును తెలిపే రక్త పరీక్షలు, స్కానింగ్ చేయడం వల్ల జబ్బు నిర్ధారణతో పాటు అదెంత తీవ్రంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు.
అయితే నాష్- నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే మాత్రం కాలేయంలోని కొంత భాగాన్ని తీసి పరీక్షించాల్సి ఉంటుంది. దానినే బయాప్సీ అంటారు. అయితే బయాప్సీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. బయాప్సీ చేయడంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 100శాతం బయటపడుతుందని కూడా లేదు. అందుకే అధునాతన స్కాన్ పరీక్ష పద్ధతిని వాడి కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు మోతాదులను, మచ్చను గుర్తిస్తున్నారు.

కాలేయానికి కొవ్వు పడితే ఈ పనులు చేయాలి:
- తొలిదశలో గుర్తించడం ద్వారా చాలా వరకు కాలేయాన్నిక కాపాడుకోవచ్చు.
- శరీర బరువులో సుమారు 7శాతం తగ్గినా నాష్ నుండి బయట పడొచ్చు.
- శరీర బరువు 10 శాతం తగ్గితే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కి మళ్లించవచ్చు.
- మంచి పోషకాహారం తీసుకోవాలి.
- నూనె పదార్థాలు తగ్గించాలి.
- పురుగుల మందులు తొలగించిన తర్వాతే కూరగాయలు వండుకోవాలి.
- కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు తాగొద్దు.
- మద్యం జోలికి వెళ్లొద్దు.
- పొగ తాగొద్దు.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.



Click it and Unblock the Notifications