Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
రెండేళ్లలో 5 శాతం పెరిగిన ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, ఈ మహమ్మారిని ఇలా తరిమికొట్టండి
భారత దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు సంవత్సరాల్లో లంగ్ క్యాన్సర్ కేసులు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం
భారత దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు సంవత్సరాల్లో లంగ్ క్యాన్సర్ కేసులు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించిన ఘటనలు గతేడాదిలో 34 వేల కంటే ఎక్కువే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ:
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల, బీహార్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో క్యాన్సర్ కేసులు ఎక్కువ వెలుగుచూస్తున్నాయి. ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.
ఊపిరితిత్లు క్యాన్సర్ కేసులు 2020లో 98,278 నుండి 1,03,371కి పెరిగాయని, అంటే 5.2 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామును ఉటంకిస్తూ వివరాలు వెల్లడించింది.
ఉత్తరాదిలో ఎక్కువ కేసులు నమోదు:
2022 ఏడాదిలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2,10,958 మంది పురుషులు, స్త్రీలలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అదే సంవత్సరం మహారాష్ట్రలో 1,21,717 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 1,13,851, బీహార్‌లో 1,09,274 కేసులు నమోదు అయ్యాయి.
దక్షిణాదిలో టాప్‌లో తమిళనాడు:
1. తమిళనాడు - 93,536 కేసులు
2. కర్ణాటక - 90,349 కేసులు
3. ఆంధ్రప్రదేశ్ - 73,536 కేసులు
4. కేరళ - 59,143 కేసులు
నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 2019 నుండి క్యాన్సర్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 2019లో తమిళనాడులో 86,596 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
తెలంగాణలో చాలా తక్కువ:
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో క్యాన్సర్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. తెలంగాణలో 2019లో 46,464 కేసులు నమోదయ్యాయి. 2020లో 47,260 కేసులు వెలుగుచూశాయి. 2021లో 48,775కి చేరుకున్నాయి.
వరుసగా 2 సంవత్సరాల్లో 28 కేసులు నమోదు అయ్యాయి.
ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ రావొచ్చు:
ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ వ్యాధి 2022 నుండి 2025 వరకు 12.8 శాతం పెరగవచ్చు.
పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, తగినతం శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, వాయు కాలుష్యం వంటివి క్యాన్సర్‌కు ప్రమాద కారకాలుగా ప్రభుత్వం పేర్కొంది.
క్యాన్సర్ కేసులు పెరుగతూనే ఉన్నాయి:
40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఊపిరితిత్తుల క్యాన్సర్ పురుషుల్లో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా ఉంది. అయితే అన్ని వయసుల వర్గాల్లో స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో క్యాన్సర్ సంభవం పెరుగుతూనే ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ తన జర్నల్, ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడకల్ రీసెర్చ్‌లో పేర్కొంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ చిట్కాలు:
1. స్మోకింగ్‌ను వదిలిపెట్టాలి
ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 80 శాతానికి పైగా స్మోకింగ్ వల్లే సంభవిస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చెడు అలవాటను వదులుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ నుండి దూరంా ఉండొచ్చు.

2. కుటుంబ చరిత్ర తెలుసుకోవాలి
జన్యుపరంగా సంక్రమించే పరివర్తనల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసుకుని, వాటి గురించి డాక్టర్‌తో చర్చించడం ముఖ్యం.

3. సప్లిమెంట్లు వద్దు
B12, B6 సప్లిమెంట్లను తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం.

4. ఎక్కువగా బీటా కెరోటిన్ తీసుకోవాలి
తీపి బంగాళాదుంపలు, కాంటాలోప్ వంటి మొదలైన ఆహార పదార్థాలల్లో కనిపించే ఒక యాంటీ ఆక్సిడెంట్ అయిన బీటా-కెరోటిన్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది.

5. యాపిల్స్ తినాలి
ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో క్వెర్సేటిన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.

6. ఎర్ర ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్
ఎర్ర ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని క్వెర్సెటిన్ అనే పదార్థం క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది.



Click it and Unblock the Notifications