Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Consuming Fruits: పండ్లు తినేటప్పుడు చేసే ఈ తప్పులు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి
అయితే పండ్లను ఎలా తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం అన్నది కూడా ప్రధానమేనని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. సాధారణంగా పండ్లు తినేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్ల వల్ల ఆరోగ్యానికి చెడు జరుగుతుంది.
Consuming Fruits: తాజా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్‌కు దూరం ఉండొచ్చని చిన్నప్పటి నుండి వింటున్నదే.

అయితే పండ్లను ఎలా తింటున్నాం.. ఎప్పుడు తింటున్నాం అన్నది కూడా ప్రధానమేనని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. సాధారణంగా పండ్లు తినేటప్పుడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్ల వల్ల ఆరోగ్యానికి చెడు జరుగుతుంది.

పండ్లు తినేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు
వేరే ఆహారాలతో పండ్లను కలిపి తీసుకోవడం:
పండ్లు ఇతర ఆహారాలు, వేరే జాతి పండ్లతో కలిపిపోవు. పండ్లు తినేటప్పుడు అమా అని పిలిచే టాక్సిన్స్ ఏర్పడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు పండ్లు తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆహారం తిన్నప్పుడు పండు తింటే.. కొన్ని రకాల ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి.. కొన్ని త్వరగా జీర్ణం అవుతాయి.. వాటిని పండ్లతో కలిపినప్పుడు ఒకటి త్వరగా, ఒకటి ఆలస్యంగా జీర్ణం కావడం వల్ల పోషకాల శోషణ కష్టమవుతుంది. ఇది జీర్ణ రసాల్లో పులియబెట్టడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా విషపూరితమైనది. ఇతర ఆరోగ్య పరిస్థితుల సంభావ్యతను పెంచుతుంది. కాబట్టి పండ్లను విడిగా తీసుకోవాలి.

రాత్రిపూట తినడం:
నిద్రపోయేందుకు 2-3 గంటల వరకు ఏదీ తినకపోవడం ఉత్తమం. ఇది పండ్లకు కూడా వర్తిస్తుంది. పడుకునే ముందు పండ్లు తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. కొన్ని రకాల పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు శక్తి స్థాయిలను పెంచుతుంది. రాత్రి సమయంలో, పోషకాలను గ్రహించే సమీకరించే మన సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. రాత్రి పూట పండ్లు తినడం వల్ల ఎసిడిటీ లక్షణాలు కనిపిస్తాయి. పండ్లను సాయంత్రం స్నాక్‌గా తీసుకోవాలి. వాటి తర్వాత ఏమీ తినొద్దు.

వెంటనే నీరు త్రాగడం:
పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతుంటారు కొంతమంది. పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే జీర్ణవ్యవస్థ యొక్క pH స్థాయి అసమతుల్యతకు కారణం అవుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాథం ఉండే పండ్లను తీసుకున్నప్పుడు నీటిని తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ నీరు కడుపులోని ఆమ్లతను తగ్గించడం ద్వారా pH బ్యాలెన్స్‌ని మారుస్తుంది. ఇలా చేయడం వల్ల డయేరియా, కలరా వంటి తీవ్ర రోగాలు రావొచ్చు.

తొక్క తీసి తినడం:
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పండు తొక్కపైనే ఉంటాయి. ఆపిల్ తొక్కలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. తొక్కను తినడం వల్ల ఊబకాయులకు మేలు జరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరు ఆపిల్ తొక్కపై వ్యాక్స్ ఉంటుంది. దీని రసాయనం కదా ప్రమాదం కదా అనే అనుమానాలను రేకెత్తించవచ్చు. మీకు అలాంటి అనుమానాలు ఉన్నా, లేకున్నా.. పండ్లను తినేటప్పుడు శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. నల్లా కింద ఆపిల్ తో పాటు ఇతర అన్ని పండ్లను శుభ్రంగా కడిగితే పైన పేరుకున్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది.
బయట నుండి తీసుకువచ్చిన పండ్లను గోరువెచ్చని నీటిలో 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగేసినా చక్కగా తినొచ్చు.
ఆపిల్, జామ, గ్రేప్స్, నేరేడు పండ్లు వంటి వాటిని తొక్కతో పాటు తినొచ్చు. కానీ కొన్ని రకాల పండ్లను తొక్కను తిసేసి తినాల్సి ఉంటుంది. అరటి పండు, పుచ్చకాయ, మోసంబి, ఆరెంజ్, సీతాఫలం వంటి పండ్లను తొక్క తీసేసి తింటే బాగుంటుంది.



Click it and Unblock the Notifications