Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఆ మందుల ధరలను మరింతగా తగ్గించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ.. అవేంటంటే..
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి ఏకంగా 127 మందుల ధరలపై పరిమితి విధించింది. ఈ నిర్ణయంతో 127 ఔషధాల ధరలు తగ్గనున్నాయి.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రజలకు మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి ఏకంగా 127 మందుల ధరలపై పరిమితి విధించింది. ఈ నిర్ణయంతో 127 ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఇందులో క్యాన్సర్ మందులు కూడా ఉండటం గమనార్హం. ఔషధాల ధరలపై పరిమితి విధించడం ఈ సంవత్సరంలో ఇది ఐదోసారి కావడం విశేషం. పారాసెటమాల్ సహా ఇతర మందుల ధరలు తగ్గనున్నాయి. అయితే మెట్‌ఫార్మిన్, మాంటెలుకాస్ట్ సహా కొన్న ఔషధాల ధరలు పెరగనున్నాయి.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ విడుదల చేసిన జాబితాలో 127 మందుల్లో పారాసెటమాల్, అమోక్సిసిలిన్, రాబెప్రజోల్ వంటి మందులు ఉన్నాయి. వీటిలో చాలా మందులను రోగులు చాలా తరచుగా ఉపయోగిస్తారు. ఒక్కో ట్యాబ్లెట్ రూ.2.3కు విక్రయించే పారాసెటమాల్(650ఎంజీ) ఇప్పుడు ఒక్కో ట్యాబ్లెట్‌పై రూ.1.8కి పరిమితం అయింది. ఎన్‌పీపీపీఏ పారాసెటమాల్ ఫార్ములేషన్ ధరలను తగ్గించింది. అదే విధంగా అమోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్ ధర కూడా రూ.22.3 నుండి రూ. రూ.16.8కి తగ్గింది.
మోక్సిఫ్లోక్సాసిన్(400ఎంజీ) ఒక ట్యాబ్లెట్ ధరను రూ.31.5 నుండి రూ.22.8కు తగ్గించింది. న్యుమోనియా వంటి బాక్టీరియా వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఈ మందుల ధరను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఈ సంవత్సరంలో మొదటిసారిగా తగ్గించింది. అయితే కొత్త జాబితా మెట్‌ఫార్మిన్(500ఎంజీ) వంటి కొన్ని మందుల ధరను రూ.1.7 నుండి రూ.1.8కి పెంచింది. గత ఏడాదిలో టైప్-2 డయాబెటిస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే మెట్‌ఫార్మిన్ కలయిసు ఫార్ములేషన్ కోసం ధరల్లో అనేక మార్పులు జరిగాయి.
పారాసెటమాల్, మోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్ వంటి మందులతో పాటు, క్యాన్సర్ మందులపై కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పరిమితి విధించింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలను ఎన్‌పీపీఏ 40 శాతం వరకు పరిమితం చేసింది. జ్వరం, డయాబెటిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు కూడా 40 శాతం మేరక తగ్గించింది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications