For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid vaccine: కరోనా టీకాలకు సడెన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్ కు సంబంధం లేదంటున్న శాస్త్రవేత్తలు?

కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత మరణాలు సంభించిన ఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదని పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో పని చేస్తున్న ఇమ్యునాలజిస్ట్ సత్యజిత్ రాత్ చెప్పారు.

|

Covid vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు 'సడెన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్'తో సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌లకు 'సడన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్' లేదా సడెన్ అరిథమిక్ డెత్ సిండ్రోమ్స్ (SADS)తో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ రెండింటికి సంబంధం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని.. అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. సడెన్ అరిథమిక్ డెత్ సిండ్రోమ్(SADS) రావడానికి కొవిడ్-19 వ్యాక్సిన్‌లే కారణమంటూ ఇటీవలి కాలంలో చాలా పోస్టులు, వేలాది రీట్వీట్‌లు, లైక్‌ లు రావడం, అది తీవ్రమైన చర్చలకు దారి తీసిన నేపథ్యంలో వీటిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ... ఆ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Scientists say that corona vaccines are not related to Sudden Adult Death Syndrome

కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత మరణాలు సంభించిన ఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదని పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో పని చేస్తున్న ఇమ్యునాలజిస్ట్ సత్యజిత్ రాత్ చెప్పారు. అమెరికాలోని సడెన్ అరిథమిక్ డెత్ సిండ్రోమ్- SADS ఫౌండేషన్ కూడా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ సిండ్రోమ్ ఉన్న రోగులు కరోనా టీకాలను తీసుకోవాలని కూడా సిఫార్సు చేశారు అమెరికా అధికారులు. అందుబాటులో ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ఏవైనా... SADS రోగుల పరిస్థితులను దిగజార్చడానికి లేదా SADS పరిస్థితులను మరింత తీవ్రంగా మార్చడానికి కారణం అవుతున్నాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అమెరికన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. SADS అనేది కెనడా సడెన్ అరిథ్మియా డెత్ సిండ్రోమ్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వచించారు. ఈ సడెన్ డెత్ సిండ్రోమ్ అనేది యువకుల్లో కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల్ కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి.

అడల్ట్ డెత్ సిండ్రోమ్.. కొవిడ్ -19 వ్యాక్సిన్ల వస్తుందని ట్విట్టర్ లో పలువురు యూజర్లు పోస్టు చేశారు. ఇలాంటి ట్వీట్లకు వేలాది లైక్స్ తో పాటు, షేర్ లు వస్తున్నాయి. అలాగే వీటిపై కామెంట్లు చేసే యూజర్లు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. అయితే కొందరు కరోనా వ్యాక్సిన్లకు, అడల్ట్ డెత్ సిండ్రోమ్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇలాంటి ట్వీట్లకు కూడా లైకులు, షేర్లు వస్తున్నాయి. ఇలాంటి ట్వీట్లు ఎక్కువ మందిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపై స్పందిస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన యువకుల్లో చాలా తక్కువ సందర్భాల్లో సడెన్ అరిథమిక్ డెత్ సిండ్రోమ్- SADS అప్పుడప్పుడు ఆకస్మిక మరణంగా నమోదు అవుతుందని ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రత్ చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో, mRNA- ఆధారిత COVID-19 టీకాలు (ఫైజర్ మరియు మోడెర్నా) మయోకార్డిటిస్‌తో సంబంధం ఉన్నట్లు తేలిందని.. దీని వల్ల గుండె కండరాల్లో వాపు కనిపించినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

Scientists say that corona vaccines are not related to Sudden Adult Death Syndrome

ఈ 'SADS' కనెక్షన్‌ని క్లెయిమ్ చేయడాన్ని ఆధారం చేసుకున్నట్లు తెలుస్తున్నా... మయోకార్డిటిస్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు రత్ తెలిపారు. ఇంత తక్కువ స్థాయిలో మయోకార్డిటిస తో ప్రాణాలకు ముప్పు ఉండదని చెబుతున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌లు, SADS కేసుల మధ్య ఎటువంటి సంబంధం లేదని ఇమ్యునాలజిస్ట్ వినీతా బాల్ అంగీకరించారు. ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సిన్‌లు సడెన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్‌కు కారణమని చెప్పలేవన్నారు. కార్డియాలజిస్ట్ ఆశిష్ అగర్వాల్ తెలిపినదాని ప్రకారం, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) లేదా గుండెపోటుకు సంబంధించిన కొన్ని అరుదైన కేసులు ముడిపడి ఉన్నాయని తేలింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ కు, కానీ SADS తో ఎలాంటి సంబంధం లేదని అగర్వాల్ తేల్చి చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజుల నుండి కొన్ని వారాల తర్వాత MI పొందిన కొంత మంది వ్యక్తులను పరిశీలించిన వైద్యులు కొన్ని ఆసక్తి కర విషయాలను గుర్తించారు. కొవిడ్- 19 వ్యాక్సిన్‌ లతో సంబంధం ఉన్న ప్రాణాంతక సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు తెలిపారు. అవి ఇతర వ్యాక్సిన్‌లతో సమానంగా ఉంటాయని, గరిష్ఠంగా లక్షలో ఒకటి వరకు మాత్రమే కనిపిస్తాయన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌లు సడన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్ తో ముడిపడి ఉన్నాయన్న వాదనలు శుద్ధం తప్పు అని ఆయన తెలిపారు.

కరోనా వ్యాక్సిన్లతో ఎలాంటి ప్రమాదం లేనందున ప్రతి ఒక్కరూ వీటిని తీసుకోవచ్చని వైద్యులు పదే పదే చెబుతున్నారు. కరోనా టీకాల వల్ల దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారిలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు చూడలేదని చెబుతున్నారు. జులై 15 నుండి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోస్ లు పంపిణీ చేయనుంది. ఈ బూస్టర్ డోసులను దీర్ఘకాల రోగాలు ఉన్న వారు తీసుకోవచ్చని.. కానీ వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

English summary

Scientists say that corona vaccines are not related to Sudden Adult Death Syndrome

Read on to know Scientists say that corona vaccines are not related to Sudden Adult Death Syndrome.
Desktop Bottom Promotion