Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
సూపర్ బ్రెయిన్ యోగా అనేది మానసిక స్పష్టత, ఏకాగ్రత మరియు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న సులభమైన అలాగే అత్యంత శక్తివంతమైన టెక్నిక్. ఇది ఇయర్ లోబ్స్ టెంపుల్స్ లో ఉన్న పీడన బిందువుల
సూపర్ బ్రెయిన్ యోగా అనేది మానసిక స్పష్టత, ఏకాగ్రత మరియు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న సులభమైన అలాగే అత్యంత శక్తివంతమైన టెక్నిక్. ఇది ఇయర్ లోబ్స్ టెంపుల్స్ లో ఉన్న పీడన బిందువుల ఉద్దీపనను కలిగిస్తుంది. ఆక్యుప్రెషర్, యోగా సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.

సూపర్ బ్రెయిన్ యోగా ఎలా చేయాలి, దాని వల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
సూపర్ బ్రెయిన్ యోగా ఎలా చేయాలి:
నేలపై లేదా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలితో ఎడమ ఇయర్ లోబ్‌ను నెమ్మదిగా నొక్కాలి. అలా కొన్ని సెకన్ల పాటు నొక్కాలి. ఇప్పుడు ఎడమ చేతి బొటన వేలు, చూపుడు వేలితో కుడి చెవి ఇయర్ లోబ్‌ను నెమ్మదిగా కొన్ని సెకన్ల పాటు నొక్కాలి. తర్వాత కుడి బొటన వేలు అలాగే చూపుడు వేలితో తల కుడి వైపు, చెవికి ఎగువన ఉన్న టెంపుల్‌ను గట్టిగా నొక్కాలి. కొన్ని సెకన్ల తర్వాత వదిలిపెట్టాలి. అలాగే ఎడమ వైపు కూడా అలాగే చేయాలి.
సూపర్ బ్రెయిన్ యోగా ప్రయోజనాలు:
- సూపర్ బ్రెయిన్ యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక స్పష్టత వస్తుంది.
- జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
- నేర్చుకునే శక్తి పెరుగుతుంది.
- ఒత్తిడి తగ్గుతుంది
- ఆందోళన తగ్గుతుంది
- మంచి నిద్ర పడుతుంది.
సూపర్ బ్రెయిన్ యోగా ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందాలంటే దానిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుండాలి. మెదడు పనితీరును పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి రోజూ సూపర్ బ్రెయిన్ యోగా చేయడం మంచిది.
సూపర్ బ్రెయిన్ యోగా అనేది మొదడు పనితీరు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన, సురక్షితమైన, సమర్థవంతమైన మార్గం. బ్రెయిన్ యోగా చేయడం చాలా సులువు. దీనిని ఎక్కడైనా చాలా సులభంగా చేయవచ్చు. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకునే వారు, మెదడు పనితీరు పెంచుకోవాలని చూస్తున్నా సూపర్ బ్రెయిన్ యోగా చాలా అద్భుతమైన ఎంపిక అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
