Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
భారత్‌లోకి ప్రవేశించిన BF-7 ఒమిక్రాన్ వేరియంట్.. 3 కేసులు నమోదు
చైనాలో అల్లకల్లోలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇండియాలోకి ఒమిక్రాన్ BF-7 ఎంట్రీ ఇచ్చింది. చైనాలో అధిక స్థాయిలో నమోదు అవుతున్న కేసుల్లో ఈ వేరియంట్‌వే ఎక్కువ ఉంటున్నాయి.
చైనాలో అల్లకల్లోలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇండియాలోకి ఒమిక్రాన్ BF-7 ఎంట్రీ ఇచ్చింది. చైనాలో అధిక స్థాయిలో నమోదు అవుతున్న కేసుల్లో ఈ వేరియంట్‌వే ఎక్కువ ఉంటున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో ఎన్ఆర్ఐ మహిళలో ఈ వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా ఒమిక్రాన్ BF-7 వేరియంట్‌గా అధికారులు నిర్ధారించారు. కొత్త వేరియంట్ సోకిన ఎన్ఆర్ఐ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటి వరకు భారత్‌లో 3 ఒమిక్రాన్ BF-7 వేరియంట్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా కేసుల్లో ప్రస్తుతం పెరుగుదల లేనప్పటికీ, ఇప్పటికే ఉన్న వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి నిరంతర నిఘా అవసరమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగటం, ప్రజలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. BF-7 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రజల్లోని రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ BF-7 వేరియంట్ BF-5 వేరియంట్‌కు సబ్ వేరియంట్. దీనికి ఒకరి నుండి ఒకరికి సోకే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ BF-7 వేరియంట్‌ను అమెరికా, యూకే, ఐరోపా దేశాల్లోనూ గుర్తించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
