Latest Updates
-
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026
Sun Charged Water: సన్ ఛార్జ్ వాటర్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలే వదిలిపెట్టరు.. ఎలా తయారు చేసుకోవాలంటే..
సన్ ఛార్జ్ వాటర్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అసలు సన్ ఛార్జ్ వాటర్ అంటే ఏంటి.. సన్ ఛార్జ్ వాటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడిని శక్తికి ప్రతీకగా చూస్తారు. భారతీయ సంస్కృతిలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య భగవానుని ఆరాధించడం నుండి కిరణాల నుండి విటమిన్-డిని పొందడం వరకు సూర్యుడిని ఎంతో ప్రత్యేకంగా చూస్తాం. రోజూ ఉదయం సూర్యుని లేతకిరణాలు తగిలేలా చూసుకోవాలని పెద్దలు చెప్పడం చాలా మందికి అనుభవమే. శిశువులను కూడా ఉదయం పూట సూర్య కిరణాలు తగిలేలా చూస్తుంటారు మన పెద్దలు.

ఆయుర్వేదం ప్రకారం కూడా సూర్య కిరణాలకు ఎంతో శక్తి ఉంటుంది. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి, నయం చేయడానికి సూర్యకాంతి ప్రయోజనం చేకూరుస్తుందని అంటారు. సన్ ఛార్జ్ వాటర్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అసలు సన్ ఛార్జ్ వాటర్ అంటే ఏంటి.. సన్ ఛార్జ్ వాటర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సన్ ఛార్జ్ వాటర్ అంటే ఏంటి?:
సూర్యుడిని శక్తికి రూపంగా భావిస్తారు. ఆయుర్వేద ప్రకారం సన్ ఛార్జ్ వాటర్ నే సూర్య జల్ అని కూడా అంటారు. సన్ ఛార్జ్ అంటే సూర్య కిరణాల శక్తిని గ్రహించే నీరు అని అర్థం. సన్ ఛార్జ్ చేయబడిన నీరు ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, సన్ ఛార్జ్ వాటర్ కు మాయా హీలింగ్ లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు.

తరాలనాటి సాంప్రదాయం:
వైదిక సంస్కృతి ప్రకారం, సూర్య జల్ చికిత్స అనేది పురాతన వైద్యం. సూర్య కిరణాల ద్వారా నీటిని ఛార్జ్ చేస్తారు. ఈ నీటిని తాగడం ద్వారా అనేక వ్యాధులు నయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నీరు దీర్ఘాయువును పెంచుతుందని నమ్ముతారు. ఆయుర్వేద పుస్తకాలం ప్రకారం, సూర్యరశ్మి నీటిపై పడినప్పుడు, అది నీటి పరమాణు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. అది నీటికి శక్తిని ఇస్తుంది. దానిని సజీవంగా ఉంచుతుంది.

సన్ ఛార్జ్ వాటర్ ప్రయోజనాలు:
సన్ లైట్ ఛార్జ్ చేయబడిన నీరు శక్తివంతమైన యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరానికి, చర్మానికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం, ప్రతి రోజూ ఈ నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట, అల్సర్ వంటి జీర్ణ సమస్యలు నయం అవుతాయి. అలాగే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సూర్యరశ్మి విటమిన్-డి యొక్క మూలమని తెలిసిందే. అందువల్ల సూర్యకాంతితో ఛార్జ్ చేయబడిన నీరు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది దద్దుర్లు, చర్మ అలెర్జీలు వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ప్రధానంగా ఉపయోగించబడుతుంది. సహజంగా చర్మానికి ఆరోగ్యకరమైన గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

సన్ ఛార్జ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి?:
సన్ ఛార్జ్ వాటర్ ను ఎవరికి వారు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి నీటిని గాజు సీసాలో నింపి కనీసం 8 గంటల పాటు సూర్యకాంతిలో ఉంచాలి. సాంప్రదాయకంగా, ఈ నీరు సూర్యరశ్మి కింద 3 రోజుల పాటు రోజూ 8 గంటల పాటు ఉంచాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇలా ఎండలో ఉంచిన నీటిని ఎట్టిపరిస్థితుల్లో ఫ్రిజ్ లో ఉంచకూడదు.



Click it and Unblock the Notifications