అలర్ట్! కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

మీరు మాస్క్ ధరించినా.. కర్చీఫ్ ను ఉపయోగించినా.. ఏవైనా మందులు వాడినా.. దగ్గు, తుమ్ములు తగ్గకుండా నిరంతరం మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

కరోనా వైరస్ లక్షణాలతో ఇప్పటికే కొన్ని వేల మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది తప్ప తగ్గడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. చైనా నుండి వ్యాపించిన ఈ వైరస్ భూతం ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా వ్యాపించింది.

Tips To Prevents Coronavirus

మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ వంటి నగరాల్లో..విదేశాల నుండి విమానాశ్రయాలలో ఎవరైతే వచ్చారో.. వారికి ఈ కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైనా ప్రకారం ఇప్పటివరకు 9 వేల మందికి కరోనా వైరస్ సోకిందని, వారికి సపరేట్ గా గదిని ఏర్పాటు చేసి చికిత్స ఏర్పాట్లు చేస్తున్నారు.

Tips To Prevents Coronavirus

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా వైరస్ భూతం సోకినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల నుండి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీరాన్ని పూర్తిగా స్కాన్ చేస్తున్నారు.

Tips To Prevents Coronavirus

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ఆసుపత్రుల్లో ఈ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఇతరుల నుండి మనకు ఎలా వ్యాపిస్తుంది? మనకు ఈ వైరస్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఈ స్టోరీలో చూడండి...

కరోనా వైరస్ నివారణకు..

కరోనా వైరస్ నివారణకు..

కరోనా వైరస్ అనేది ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా మీ దగ్గర్లో దగ్గుతున్నప్పుడు గానీ లేదా తుమ్ముతున్నప్పుడు గానీ వారి నుండి దూరంగా వెళ్లండి. అలాగే మీకు కూడా దగ్గు లేదా తుమ్ములు వంటివి వస్తే మీ కర్చీఫ్ ను అడ్డుపెట్టుకోండి. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ లు ధరించండి.

దగ్గు, తుమ్ములు తగ్గకపోతే..

దగ్గు, తుమ్ములు తగ్గకపోతే..

మీరు మాస్క్ ధరించినా.. కర్చీఫ్ ను ఉపయోగించినా.. ఏవైనా మందులు వాడినా.. దగ్గు, తుమ్ములు తగ్గకుండా నిరంతరం మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఆసుపత్రిలో చెకప్ చేయించుకోండి.

పరిశుభ్రత విషయంలో..

పరిశుభ్రత విషయంలో..

మీ చేతులను తరచుగా శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ చేతులను కడుక్కోవడానికి ఆల్కహాల్ కంటెంట్ తో హ్యాండ్ వాష్ ఉపయోగించాలని లేదా మంచి నీళ్లతో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

మాంసం, గుడ్లు వంటి వాటిని..

మాంసం, గుడ్లు వంటి వాటిని..

మీరు మార్కెట్ కు వెళ్లినప్పుడు మాంసం మరియు గుడ్లతో పాటు మాంసాహార పదార్థాలను చేతితో నేరుగా తాకకండి. అలాగే పచ్చి వాటిని తినడం వంటి ప్రయత్నాలు చేయకంి. వాటిని బాగా ఉడికించిన తర్వాతే తినండి.

జంతువుల నుండి మానవులకు..

జంతువుల నుండి మానవులకు..

ఈ కరోనా వైరస్ భూతం జంతువులలో కనిపించే ప్రాణాంతక వైరస్. అయితే అరుదైన సందర్భాలలో మాత్రం ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మానవుని శరీరంపై దాడి చేసినప్పుడు మొదట్లో చిన్న ఆరోగ్య సమస్యను తెస్తుంది. ఆ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుస్తుంది.

కరోనా వైరస్ లో నాలుగు రకాలు..

కరోనా వైరస్ లో నాలుగు రకాలు..

కరోనా వైరస్ NL63

కరోనా వైరస్ 229E

కరోనా వైరస్ HKU1

కరోనా వైరస్ OC43

ఇవి మానవుడి శరీరంలో కలిసినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు జలుబు మరియు ఫ్లూ లక్షణాలు మొదట్లో కనిపిస్తాయి.

కరోనా ఎలా వ్యాపిస్తుందంటే...

కరోనా ఎలా వ్యాపిస్తుందంటే...

కరోనా వైరస్ అనేది ఒక వ్యక్తి నుండి ఇతర వ్యక్తులకు చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఎవరైనా వ్యక్తి నిరంతరం దగ్గుతూ ఉన్నప్పుడు లేదా నిరంతరం జలుబుతో బాధపడుతూ ఉన్నప్పుడు.. ఇన్ఫెక్షన్ వల్ల ఈ వైరస్ వ్యాధి ఇతరులకు చాలా సులభంగా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, పెద్దవయస్సు వారికి ఎక్కువగా వస్తుంది.

కరోనా వైరస్ లక్షణాలివే..

కరోనా వైరస్ లక్షణాలివే..

* నిరంతరం జలుబు

* తలనొప్పి

* దగ్గు

* గొంతులో చికాకు

* ఫ్లూ

కరోనాకు దొరకని నివారణ..

కరోనాకు దొరకని నివారణ..

కరోనా వైరస్ నివారణ పద్ధతులు ఇంకా కనుగొనబడలేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండండి. ముఖ్యంగా వారి కన్ను, నోరు లేదా ముక్కును తరచుగా తాకొద్దండి. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. తరచూగా నీరు తాగడం అనేది తగ్గించాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Desktop Bottom Promotion