Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
వేడి వేడిగా టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ సమస్యలు తప్పవు!జాగ్రత్త
వేడి వేడిగా టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఐతే ఈ సమస్యలు తప్పవు!జాగ్రత్త
టీ మనకు ఇష్టమైన తేనీటిపానీయం. చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగందే ఆ రోజు ప్రారంభం అవ్వదు. ఇది మనకు శక్తి వస్తుంది, నిద్ర నుండి తేరుకునేలా చేస్తుంది, ఆరోజంతా రిఫ్రెష్ గా ఉంచుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉంటాము. కానీ టీ తాగిన తర్వాత నీరు త్రాగకూడదా? అవును. ఇది మీ ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతర దేశాలలో, టీని ఉడికించిన నీటిలో స్వీటెనర్ కలపకుండా తాగుతారు. కానీ భారతదేశంలో మాత్రమే మనం పాలు మరియు పంచదారతో ఉడికించిన టీని తాగుతాము. అంతేకాదు వారి వారి సౌలభ్యం ప్రకారం అల్లం లేదా యాలకులు లేదా లవంగాలు లేదా పంచదార వేసి తయారుచేసి తాగుతారు. ఈ పద్ధతిలో టీ తాగడం భారతదేశంలో మాత్రమే ఉంది. టీ ఒకప్పుడు రోజుకు ఒకసారి తాగే పానీయం. కానీ ఇప్పుడు అలా కాదు, ఎప్పుడుపడితే అప్పుడు టీ తాగేవాళ్లు చాలామందే ఉన్నారు. రోజుకు ఒకసారి మాత్రమే టీ తాగడం మంచిది. కానీ ఒక్కసారి అలవాటుగా మారితే సమస్యాత్మకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతారు. టీ కంటే టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం చాలా హానికరం అంటున్నారు వైద్యులు. టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారో ఈ కథనంలో తెలుసుకుందాం..

డీహైడ్రేషన్:
టీలో కెఫిన్ ఉంటుంది. అందుకే చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 mg కెఫిన్ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది.

జీర్ణ సమస్య:
టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ, టీ వంటి వేడి పానీయాలతో పాటు నీటిని తాగడం వల్ల అసిడిటీ లేదా నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నమ్ముతారు.

దంత సమస్యలు
ఎక్కువ చల్లగా ఉండే ఆహారపానీయాలు, మరీ వేడిగా ఉండే ఆహారపానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అలా తీసుకున్నప్పుడు మన నోరు, గొంతు మరియు అన్నవాహికపై ప్రభావం చూపుతుంది. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నోటిలో ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పు పంటి నరాలను దెబ్బతీస్తుంది మరియు దంతాలలో జలదరింపును కలిగిస్తుంది.

అల్సర్
టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్ వస్తుంది. దీన్ని తగ్గించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి. మలబద్ధకం తదితర సమస్యలు రావచ్చు. అయితే ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ మాత్రమే వస్తుందని గుర్తుంచుకోండి.

రక్తస్రావం
టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం కారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చలి మరియు వేడి రెండింటినీ ఒకేసారి తట్టుకోలేదు. వాతావరణానికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఎండాకాలంలో నీళ్లు తాగిన తర్వాత టీ తాగితే ముక్కుద్వారా రక్తస్రావం సమస్య వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గొంతు నొప్పి
వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. టీ తాగిన అరగంట తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. అప్పుడే మీకు అలాంటి సమస్యలు దరిచేరవు.

టీ, కాఫీలు తాగడానికి ముందు నీళ్ళు తాగవచ్చా?
టీ, కాఫీలు తాగిన తర్వాత నీళ్లు తాగే బదులు, వాటిని తాగే ముందు నీళ్లు తాగడం మీ ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది కడుపు మరియు మొత్తం ఆరోగ్య నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. టీలో దాదాపు 6 pH ఉంటుంది, కాఫీలో pH 5 ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఉదయం లేదా సాయంత్రం టీ లేదా కాఫీ తాగడం వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మరియు తీవ్రమైన వ్యాధులు, అల్సర్ మరియు క్యాన్సర్‌కు దారితీస్తుంది. అదే టీ లేదా కాఫీకి ముందు నీళ్లు తాగడం వల్ల పొట్టలోని యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి దాంతో గ్యాస్ట్రిక్, అల్సర్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని చాలా నివేదికలు సూచిస్తున్నాయి. నీరు కడుపులోని ఆమ్లాన్ని పలచన చేయడానికి సహాయపడుతుంది.
నిరాకరణ: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు మరియు సమాచారంను సూచనలుగా మాత్రమే తీసుకోండి, తెలుగు బోల్డ్ స్కై దీన్ని నిర్ధారించలేదు. అటువంటి చికిత్స/ఔషధం/ఆహారం మరియు సూచనలను అమలు చేయడానికి ముందు, దయచేసి వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.



Click it and Unblock the Notifications











