World Spine Day 2022: మీది కూర్చుని చేసే ఉద్యోగమా? ఈ చిట్కాలు పాటిస్తే వెన్నునొప్పి రాదు

ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న వెన్నునొప్పి. మధ్య వయస్కుల నుండి పెద్ద వారి వరకు చాలా మందిని ఈ వెన్ను నొప్పి తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వెన్నునొప్పిగా మొదలై ఇతర అనారోగ్య సమస్యలూ వస్తాయి.

World Spine Day 2022: ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న వెన్నునొప్పి. మధ్య వయస్కుల నుండి పెద్ద వారి వరకు చాలా మందిని ఈ వెన్ను నొప్పి తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వెన్నునొప్పిగా మొదలై ఇతర అనారోగ్య సమస్యలూ వస్తాయి.

World spine day 2022: Tips to get rid of back pain in Telugu

తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 16వ తేదీన, వరల్డ్ స్పైన్ డే ను జరుపుకుంటున్నాం. ఈ తీవ్రమైన సమస్య గురించి ప్రజల్లో అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వెన్నునొప్పి ఏ వయస్సు వారినైనా వేధిస్తుంది. దిగువ వెన్నునొప్పి అస్థి కటి వెన్నెముక, వెన్నుపూసల మధ్య డిస్క్‌లు, వెన్నెముక మరియు డిస్క్‌ల చుట్టూ స్నాయువులు, వెన్నుపాము మరియు నరాలు, దిగువ వెనుక కండరాలు, ఉదర మరియు కటి అంతర్గత అవయవాలు మరియు కటి ప్రాంతం చుట్టూ ఉన్న చర్మంతో ముడిపడి ఉండవచ్చు.

తీవ్రమైన వెన్ను నొప్పికి కారణాలు

తీవ్రమైన వెన్ను నొప్పికి కారణాలు

ఆటో ఇమ్యూన్ పరిస్థితులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి నొప్పులు. ఎముక క్షీణత మరియు బోలు ఎముకల వ్యాధి వంటి కండరాల బలహీనతతో సంబంధం ఉన్న బోలు ఎముకల వ్యాధి. సయాటికా వంటి నరాల సంబంధిత వెన్నునొప్పి వెన్నెముక నరాల చివరల నుండి తొడ వరకు వ్యాపిస్తుంది. అధిక వినియోగం, కండరాల బలహీనత మరియు కడుపు కొవ్వు మరియు బరువు పెరగడం వల్ల నొప్పి మరియు ఒత్తిడి కారణంగా కండరాల బలహీనత.

ఇలా చేస్తే వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు

ఇలా చేస్తే వెన్ను నొప్పి తగ్గించుకోవచ్చు

వ్యాయామం

బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉన్నప్పుడే చిన్న చిన్న వ్యాయామాలు మొదలు పెట్టాలి. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల వెన్నుకు రక్తప్రసరణ అందుతుంది. అంతే కాదు, శరీరంలో ఎండోర్ఫిన్ ఉత్పత్తి అవుతుంది, దాంతో బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

ప్రతి రోజూ ఉదయం బ్యాక్ స్ట్రెచెస్ చేయడం వల్ల , బాడీ ఫుల్ గా స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ వదులౌతాయి, నొప్పి తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

విశ్రాంతి తీసుకోవాలి

విశ్రాంతి తీసుకోవాలి

శరీరంలో ఎటువంటి నొప్పి ఉన్నా, శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం . నొప్పి ఉన్నప్పుడు అది కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. మీకు మెడిటేషన్ చేసే అలవాటున్నట్లైతే, మెడిటేషన్ చేయడం వల్ల కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు.

బాగా నిద్రపోవాలి

బాగా నిద్రపోవాలి

మోకాళ్ళ క్రింది దిండు పెట్టుకొని నిద్రపోవడం వల్ల నొప్పిని తగ్గించుకోవచ్చు. బాగా నిద్రపడుతుంది. బ్యాక్ కు సపోర్ట్ గా ఉంటుంది.

చమోమెలీ

చమోమెలీ

చమోమెలీ టీ త్రాగడం వల్ల మనస్సు ప్రశాంత చెందుతుందన్న విషయం మీకు తెలుసా . చమెమోలీ టీని కొన్ని రోజుల పాటు కొన్నికప్పుల టీని త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది .

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్

ఇన్ఫ్లమేషన్ నివారించుకోవడానికి , ఐస్ ప్యాక్ ను ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక నేచురల్ హోం రెమెడీ. ఇది వెంటనే ఇన్ల్ఫమేషన్ తగ్గిస్తుంది . అందుకు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని క్లాత్ లో పెట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో 10-15నిముషాలో వేసుకోవాలి. కొద్ది సమయం తర్వాత తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి.

అల్లం వేర్లు

అల్లం వేర్లు

అల్లం వేరును, బ్యాక్ పెయిన్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. చిన్న అల్లం ముక్కను నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసి త్రాగాలి . ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫ్లమేషన్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

స్విమ్మింగ్

స్విమ్మింగ్

బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి స్విమ్మింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల వెన్నులో ఉండే కండరాలను బలోపేతం చేస్తాయి. అయితే నొప్పి ఉన్నప్పుడు స్విమ్ చేయకూడదు.

బాత్ టబ్

బాత్ టబ్

వెన్నునొప్పితో బాధపడే వారు, ఇంట్లో కనుకు బాత్ టమ్ ఉన్నట్లైతే, దాన్ని వేడినీళ్ళతో ఫిల్ చేసి, మీ అంతట మీరు 30నిముషాలు అందులో ఉండటం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలకు పొట్టలో పెరిగే బిడ్డకు ఇది అనారోగ్యకరం కాబట్టి, గర్భిణీలు ఈ పద్దతికి దూరంగా ఉండాలి.

Story first published: Monday, October 10, 2022, 13:55 [IST]
Desktop Bottom Promotion