Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
బ్లడ్ గ్రూప్ గురించి మనలో చాలా మందికి ఎంతో కొంత అవగాహణ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కావాలనుకున్న బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల నుంచి కూాడా మనం ఈ బ్లడ్ గ్రూప్‌లు దొరకవు. దీనికి కారణాలు చాలా ఉన్నాయ్. మొత్తం నాలుగు బ్లడ్ గ్రూపులుంటాయ్.. అవి ఏ, బి, ఏబీ, ఓ వీటిలో పాజిటివ్ లేదా నెగిటివ్ ఉంటాయ్.
కానీ బాంబే బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టమైన విషయమని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ప్రపంచంలో కేవలం 0.0004 శాతం మందేనని అంటున్నారు. మన దేశంలో ప్రతీ 10,000ల మందిలో ఒకరికి మాత్రమే ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. దీనికి హెచ్‌హెచ్, ఏబీఓ అని వివిధ పేర్లున్నాయ్. ఈ బ్లడ్ గ్రూపును మొట్టమొదటిసారిగా 1952లో ముంబైలో డాక్టర్ వైఎమ్ భెండె దీనిని కనుగ్గొన్నారు. బాంబేలో కనిపెట్టారు కాబట్టి దీనికి బాంబే బ్లడ్ గ్రూప్‌గా గుర్తించారు.
బాంబే బ్లడ్ గ్రూపకు ఉన్న ప్రత్యేకతలు
బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారి ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యూల్స్ ఉండడం సహజం. వీరికి ఏ,బీ, హెచ్ అనే మూడు రకాల యాంటీ బాడీలు కూడా వీరి రక్తంలో వుంటాయ్. ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ వీరు అందరిలాాగే సాధారణంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు గానీ, అంగవైకల్యం గానీ ఉండదు. వీరికి రక్తం అవసరమైనప్పుడు వారి కుటుంబ సభ్యుల నుంచే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా పెద్ద సమస్య. ఒకవేల ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి దొరకదు.

ఎవరికి రక్తదానం చేయవచ్చు, ఎవరి నుంచి తీసుకోవచ్చు..?
బాంబే బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారు అదే బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారి నుంచి మాత్రమే రాక్తాన్ని ఎక్కించుకోవాలి . కాబట్టి వీరు తమ రక్తాన్ని వృధాగా దానం చేయకుండా అవసరమైనప్పుడు మాత్రమే దానం చెయ్యాలి. సాధారణంగా అందరూ రక్త దానం చేసేట్టు వీరు చేస్తే ఆ రక్తం ఎక్స్‌పైర్ అయిపోయి వృధా అయ్యే అవకాశం ఉంది.
యూనివర్సల్ డోనార్ల నుంచి కూడా వీరు రక్తాన్ని తీసుకోవడానికి అనుమతి లేదు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కేవలం బాంబే బ్లడ్ గ్రూప్ నుంచి మాత్రమే వీరు రక్తాన్ని ఎక్కించుకోవాలి. లేదంటే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
బాంబే బ్లడ్ గ్రూప్ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బాంబే బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారు తమ బ్లడ్ గ్రూపుకు సంబంధించి చాలా అప్రమత్తతో ముందు జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో తమకు రక్తదానం చెయ్యడానికి ఆ బాంబే బ్లడ్ గ్రూప్‌కు చెందినవారు మాత్రమే అవసరమౌతారు. కుటుంబ సభ్యుల్లో ఈ గ్రూపు ఉన్న వారు ఉండే అవకాశాలున్నాయ్.
బాంబే బ్లడ్ గ్రూప్ ధర
ఇది చాలా అరుదుగా దొరికే బ్లడ్ గ్రూప్ కాబట్టి దీనిపై బ్లాక్ మార్కెటింగ్, స్మగ్లింగ్ చేసే అవకాశాలున్నాయ్. అలాంటి వాటి ఎరలో పడకుండా వైద్యులతో సంప్రదించి ముందుగానే ఈ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించిన వారితో టచ్‌లో ఉండడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications