Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
రోజూ పిస్తా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
డ్రైఫ్రూట్‌లో పిస్తాను ఇష్టపడని వారుండరు. మార్కెట్లో రోస్టెడ్ పిస్తాలుంటాయ్. తినడానికి రుచిగా వుండే ఈ పిస్తాలు ఆరోగ్యానికి కూడా చాలా దోహదపడతాయ్. పిస్తాలో ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయ్. వీటితో ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. గుండె ఆరోగ్యం కూడా పిస్తా వల్ల మెరుగుపడుతుంది. పిస్తా ప్రయోజనాల గరించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
పోషకాలు
పిస్తాలో పోషకాలు మెండుగా వుంటాయ్. కాజూ, బాదాంతో సరిసమానంగా పోషకాలు పిస్తాలో వున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయ్. 50 పిస్తాలో మొత్తం 160 వరకు క్యాలరీలు ఉంటాయ్. ప్రొటీన్లు 5 గ్రాముల వరకుంటాయ్. వీటితోపాటు వైటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, పాస్ఫరస్ పోషకాలుంటాయ్.
తక్కువ క్యాలరీలు
క్యాలరీలు ఎక్కువగా ఉంటాయన్న భయం అవసరం లేదు. పిస్తాలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలుంటాయ్. డ్రై ఫ్రూట్స్‌లలో అత్యంత తక్కువ క్యాలరీలు కలిగినవ కూడా పిస్తాలేనని చెప్పుకోవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లు
పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుంటాయ్. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రోజూ కొన్ని పిస్తాలు తినడం వల్ల క్యాన్సర్‌కు ఇక భయపడాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు.

కంటి ఆరోగ్యానికి
పిస్తాలో కంటికి అవసరమైన లూటియిన్, జియాక్సాంతిన్ యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుంటాయ్. ఇవి కంటి వ్యాధులు రాకుండా అడ్డుపడతాయ్. క్యాటరాక్ట్ లాంటి కంటి వ్యాధులతో కూడా పిస్తాలో వుండే పోషకాలు పోరాడతాయ్.
ఫైబర్
పిస్తాలో ఫైబర్ కంటెంట్ బాగా ఉండడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. పిస్తాల వల్ల మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. జీర్ణ ప్రక్రియకు అవసరమైన బ్యాక్టీరియా కూడా పిస్తాల వల్ల వస్తుంది.
క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ
2017లో జరిపిన పరిశోధనల ప్రకారం పిస్తాలు తినడం వల్ల కొలొన్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉనట్లు కనుగ్గొన్నారు.
చెక్కర స్థాయి
పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యారటినాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్లు అధికంగా వుండడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి అదుపులోకి వస్తుంది. మధుమేహం సంబంధించిన వ్యాధులు కూడా తీవ్రంగా కాకుండా వుంటాయని పరిశోధనలు చెబుతున్నాయ్.
గుండెకు మంచి
పిస్తాలు గుండెకు చాలా రకాలుగా లాభాలు చేకూరుస్తుంది. పిస్తాలు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయ్. గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తీవ్రం కాకుండా పిస్తాలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు సహకరిస్తాయ్.
శాఖాహారులకు
శాఖామారులు మాంసం తినలేరు కాబట్టి వారికి ప్రొటీన్లు అందాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుంది. పిస్తాలో ప్రొటీన్ శాతం మెండుగా వుండడం వల్ల శాఖాహారులు మాంసం తినాల్సిన అవసరం లేదు. పిస్తాలో యామినో యాసిడ్ల కూడా మెండుగా వుంటాయ్. తక్కవ క్యాలరీలతో ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రొటీన్ వున్న ఒకే ఒక్క వెజిటేరియన్ ఫుడ్ పిస్తా మాత్రమే.
పిస్తాలో విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిస్తాల్లో ఉప్పు వేసి వేంచి ప్యాక్ చేసి అమ్ముతారు. దీని వల్ల పిస్తాల్లో సోడియమ్ కంటెంట్ ఎక్కువగా వుండే అవకాశం వుంది. రోస్టెడ్ పిస్తాలకు బదులుగా వేయిచని పిస్తాలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మరింత లాభం చేకూరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications